15 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్.. | Oppo unveils technology to charge smartphone in 15 minutes | Sakshi
Sakshi News home page

15 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్..

Published Wed, Feb 24 2016 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

15 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్..

15 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్..

బార్సిలోనా: చైనా ఫోన్ల తయారీ దిగ్గజం ఒప్పో కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాలజీ సాయంతో కేవలం 15 నిమిషాల్లో ముబైల్ ఛార్జింగ్ (0 నుంచి) 100శాతం అవుతుందట. ముబైల్ వరల్డ్ కాంగ్రెస్ మంగళవారం ఈ ఛార్జర్ ను ఆవిష్కరించింది. 'సూపర్ వూక్' (superVOOC) ఛార్జన్ 2,500 మి.అంపియర్ అవర్ ఉన్న ఛార్జింగ్ లేని బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మైక్రో యూఎస్బీ, యూఎస్బీ టైప్-సీ కేబుల్స్ ఇందులో వాడినట్లు సంస్థ తెలిపింది.

తక్కువ వోల్టేట్ అల్ గారిథమ్స్ వాడకంతో ఫోన్లు వేడేక్కడం లాంటి సమస్యలకు గురికావట. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 10 గంటలపాటు మాట్లాడే అంత సామర్థం బ్యాటరీకి లభిస్తుందని కంపెనీ అధికారి వెల్లడించారు. క్వాల్కమ్ వారి 'క్విక్ ఛార్జ్ 3.0' ఛార్జర్ ఇప్పటివరకు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ డివైస్ గా ఉండేది. ఆ ఛార్జింగ్ టెక్నాలజీతో 35 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ 80 శాతం ఛార్జింగ్ అయ్యేది. భారత్ లో ఈ ఏప్రిల్ లో విడుదలకానున్న ఎఫ్1 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో కొత్త టెక్నాలజీ బ్యాటరీ మార్కెట్లోకి రానుంది.

ఎఫ్1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫోన్ పూర్తి వివరాలు:
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్
13 మెగా పిక్సల్ కెమెరా
4G టెక్నాలజీ, 4 GB ర్యామ్
32 GB ఇంటర్నల మెమరీ
5.5 అంగుళాల స్ర్ర్కీన్
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 616 ప్రాసెసర్
బ్లూ టూత్ 4.1, జీపీఎస్, డ్యూయల్ సిమ్
ధర: 26, 990 రూపాయలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement