స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 21న భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ కానుంది. ఇది ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో అనే రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ పొందనుంది. ఇది క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను అధిగమించగలదని సమాచారం. గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం ఏఐ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది.
కంపెనీ.. ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందే కొన్ని వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, పర్ఫామెన్స్ అన్నీ కూడా దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ఇది 7.85 మిమీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ నాలుగువైపులా 1.45 మిమీ సన్నని బెజెల్స్‌తో 6.59 ఇంచెస్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ అనే రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రెండో వేరియంట్.. ఫైండ్ ఎక్స్8 ప్రో విషయానికి వస్తే.. రెండు వైపులా క్వాడ్ కర్వ్డ్ గ్లాస్‌తో పెద్ద 6.78 ఇంచెస్ డిస్‌ప్లే పొందనుంది. ఇది స్పేస్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.
ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్
ఒప్పో ఫైండ్ ఎక్స్8 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రానుంది. ఎక్స్8 ప్రో 5910mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం. కాగా కంపెనీ కొత్త మొబైల్ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ధరలు నవంబర్ 21న వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment