launch date
-
డేట్ ఫిక్స్.. ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ అప్పుడే
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 21న భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ కానుంది. ఇది ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో అనే రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ పొందనుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను అధిగమించగలదని సమాచారం. గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం ఏఐ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది.కంపెనీ.. ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందే కొన్ని వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త మొబైల్ హ్యాండ్సెట్లు, పర్ఫామెన్స్ అన్నీ కూడా దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ఇది 7.85 మిమీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ నాలుగువైపులా 1.45 మిమీ సన్నని బెజెల్స్‌తో 6.59 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. ఇది స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ అనే రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రెండో వేరియంట్.. ఫైండ్ ఎక్స్8 ప్రో విషయానికి వస్తే.. రెండు వైపులా క్వాడ్ కర్వ్డ్ గ్లాస్‌తో పెద్ద 6.78 ఇంచెస్ డిస్ప్లే పొందనుంది. ఇది స్పేస్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్ఒప్పో ఫైండ్ ఎక్స్8 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రానుంది. ఎక్స్8 ప్రో 5910mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం. కాగా కంపెనీ కొత్త మొబైల్ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ధరలు నవంబర్ 21న వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు
భారతీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్థ త్వరలో వర్చ్యువల్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ ప్రో' (Vision Pro) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ లాంచ్ చేయనున్న ఈ కొత్త హెడ్సెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, యాపిల్ కంపెనీ తన వర్చ్యువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను లాంచ్ చేయడానికంటే ముందు రిటైల్ స్టోర్లకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ అయిన తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం. యాపిల్ సంస్థ ఈ విజన్ ప్రో హెడ్సెట్ సేల్స్ కోసం ఉద్యోగులకు ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి డెలివరీలు ప్రారంభమయ్యే సమయంలో శిక్షణ పొందిన ఉద్యోగులు రిటైల్ స్టోర్ల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు ఉండే అవకాశం ఉంది. వారు కొనుగోలుదారులకు హెడ్‌సెట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారు. ధర (Price) 2023 WWDC ఈవెంట్లో మొదటి సారి కనిపించిన యాపిల్ విజన్ ప్రో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ హెడ్సెట్లో ఎమ్2 చిప్ సెట్, రెండు హై-రిజల్యూషన్ 4K ఐపీస్ వంటివి ఉంటాయి. దీని ధర 3499 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.90 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ఇదీ చదవండి: ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్ ఈ లేటెస్ట్ హెడ్‌సెట్‌తో వర్చ్యువల్ రియాల్టీ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ఇది మొదట కేవలం అమెరికాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఆ తరువాత చైనా, కెనడా, యూకే వంటి దేశాల్లో విక్రయాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ హెడ్సెట్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. I’d expect a Vision Pro related announcement sometime this upcoming week. Start writing your “Apple Wins CES” headlines. https://t.co/A41ayEKe6o — Mark Gurman (@markgurman) January 7, 2024 -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి ఒకాయా (Okaya) నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధమైంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకాయ మోటో ఫాస్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ నుంచి 135 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ నుంచి 70 కిమీ కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 17న అధికారికంగా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. రోజు వారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LFP బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ సియాన్, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది కాబట్టి ఆఫర్లో ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ద్వారా స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్ మరియు బ్యాటరీ శాతం వంటి వాటిని చూపిస్తుంది. బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షవ్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్...ఇక పండగే!
Apple Big Event iphone15 launch: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్‌లను లాంచ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్అయింది. రానున్న యాపిల్ బిగ్ ఈవెంట్కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా లీక్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్‌ను తేదీని యాపిల్ లీక్‌కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టుతెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలలో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) సరఫరా సమస్యల కారణంగా ఐఫోన్ 14 ప్లస్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. 2020లో ఐఫోన్ 12 Pro Max, ఐఫోన్12 mini లాంచింగ్ లేట్ అయింది. ఈ ఏడాది సేల్ కూడా ఐఫోన్ 15 మోడల్‌లు "తీవ్రమైన కొరత" కారణంగా ఆలస్యం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు అన్ని కొత్త మోడళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే, యాపిల్ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) Breaking 😍 Apple to launch iPhone 15 series on 13 September, 2023. USB-C#iPhone15 #USBC #Apple pic.twitter.com/2YPVLTMlbR — Abhishek Yadav (@yabhishekhd) August 4, 2023 -
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్ - నిరీక్షణకు తెర పడ్డట్టే..
ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో మొదటిసారి తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలచేసినప్పుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు అనేక విధాలుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ మే 23 న అధికారికంగా మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం. సింపుల్ ఎనర్జీ 2023 మే 23న తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలో ఏర్పడిన లోపల వల్ల కొన్ని కంప్లైంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ సింపుల్ వన్ స్కూటర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తూ విడుదల చేయడంలో కొంత ఆలస్యం చేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) సవరణ 3 ప్రవేశపెట్టిన తరువాత మెరుగైన బ్యాటరీ భద్రతలను కలిగి ఉన్న స్కూటర్లలో సింపుల్ వన్ ప్రధానంగా చెప్పుకోదగ్గదిగా మారింది. కావున ఈ స్కూటర్ మార్కెట్లో అమ్మకానికి రానున్న అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కోలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందింది, కాగా త్వరలో లాంచ్ అవుతుంది. డెలివరీలు కూడా వేగంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. -
వచ్చేస్తోంది..ఐఫోన్-13..! లాంఛ్ ఎప్పుడంటే..!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది ఆపిల్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్ -13 ఫోన్లను వచ్చే నెల సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. కాగా ఈ ఫోన్ ఐఫోన్ 12కు తదనంతర ఫోన్‌గా రానుంది. అమెరికాలో ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆపిల్ రిలీజ్ చేయనుంది. పెర్ల్, సన్‌సెట్ గోల్డ్ వేరియంట్లతో ఐఫోన్-13 రానుంది. ఐఫోన్-13 ఫీచర్లు ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ లైడార్ సెన్సార్ 5 జీ కనెక్టవిటీ సపోర్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పవర్ ఎఫిసియంట్ ఎల్‌టీవో డిస్ప్లే ఏ15 బయోనిక్ చిప్సెట్ అండ్ అల్వేస్ ఆన్ డిస్ప్లే ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆపిల్ నుంచి కొత్త ఐప్యాడ్.. రిలీజ్ ఎప్పుడంటే ?
టెక్నాలజి దిగ్గజం ఆపిల్ నుంచి మరో రెండు ఐప్యాడ్లు రాబోతున్నాయి. అధునాత ఫీచర్లతో ఈ ఐ ప్యాడ్లను ఆపిల్ రిలీజ్ చేయబోతుంది. ఓఎల్ఈడీ టెక్నాలజీతో, హై రిఫ్రెష్ రేట్‌తో ఈ ఐ ప్యాడ్లను రూపొందిస్తోంది ఆపిల్. 2022లో వచ్చే సంవత్సరంలో 10.86 అంగులాల ఐప్యాడ్‌ను రిలీజ్ చేయనుంది. ఇందులో ఉన్న ఓఎల్ఈడీ డిస్ప్లేకు సపోర్ట్‌గా థిన్ ఫిల్మ్ ఎన్క్యాప్సులైజేషన్ టెక్నాలజీ ఉపయోగించినట్టు ‘జీఎస్ఎం ఆరేనా’ పేర్కొంది. ఇది గాలిలో తేమ, ఆక్సిజన్ ఇతర కారణాల వల్ల ఓఎల్ఈడీకి అదనపు రక్షణ కల్పిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐ ప్యాడ్ ఎయిర్‌కు నెక్ట్స్ వెర్షన్‌లా రాబోతుంది. 2023లో ఎల్టీపీవో టెక్నాలజీ ప్యానెళ్లతో మరో ఐ ప్యాడ్‌ను మార్కెట్లోకి ఆపిల్ తేనుంది. 12.9 అంగులాలు, 11 అంగులాల డిస్ప్లేలతో రెండు వేరియంట్లుగా ఈ మోడల్ని రూపొందిస్తోంది. డిస్ప్లే రిఫ్రెష్ రేటును 120 హెర్జ్‌గా ఇవ్వబోతుంది. ఐప్యాడ్‌ని మాక్సిమమ్ రిఫ్రేష్ రేటులో ఉపయోగిస్తున్నా.. బ్యాటరీ త్వరగా డ్రైన్ అవకుండా ఎల్టీపీవో టెక్నాలజీ సాయం చేస్తుంది. ఈ ఐ ప్యాడ్‌ని 2023లో రిలీజ్ చేసేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఆపిల్ వాటా ప్రస్తుతం ఇండియాలో ట్యాబెట్ల మార్కెట్లో ఆపిల్‌కి 29 శాతం వాటా ఉంది. మార్కెట్లో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి వెళ్లేందుకు కన్నేసిన ఆపిల్ వరుసగా కొత్త మోడళ్లు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసింది. చదవండి : పేటిఎమ్‌లో రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్‌లు -
‘భారతీయుడు 2’ లాంచ్ డేట్..!
2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకు సీక్వల్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఇన్నాళ్లు 2.ఓ పనుల్లో శంకర్ బిజీగా ఉండటంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. 2.ఓ రిలీజ్ కావటంతో శంకర్ తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. వీలైనంత త్వరగా భారతీయుడు 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అందుకే డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. రాయలసీమతో పాటు చెన్నై, తైవాన్లతో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2.ఓలో ప్రతినాయకుడిగా అలరించిన అక్షయ్ కుమార్ మరోసారి శంకర్ సినిమాలో భాగం కానున్నాడట. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
లీకేజీ బాటలో మోటో జీ కూడా
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాకముందే దాని ఫీచర్స్, ధరలు లీకవడం చూస్తున్నాం. ఇటీవలే హెచ్ టీసీకి ఎదురైన ఈ లీకేజీల అనుభవం ప్రస్తుతం మోటరోలా మోటో కి కూడా తాకింది. మోటరోలా నుంచి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 9న చైనా వేదికగా మార్కెట్లోకి తీసుకురానున్నట్టు లెనోవా కంపెనీ సీఈవో యాంగ్ యాన్ కింగ్ తెలిపారు. అయితే ఆయన మిగతా ప్రొడక్ట్ పేరు గురించి కానీ, దాని ధర, ఫీచర్స్ వివరాలేమి ప్రకటించలేదు. కానీ మోటరోలా నుంచి మోటో జీ 4, జీ 4 ప్లస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయని, వాటి ధరలు ఈ విధంగా ఉంటున్నాయంటూ పుకార్లు వస్తున్నాయి. చైనా సోషల్ నెట్ వర్క్ సైట్ లో ఈ ఫీచర్స్ , ధరలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ లీకేజీలే నిజమైతే మోటరోలా ప్రవేశపెడుతున్న మోటో జీ4, జీ4 ప్లస్ ను జూన్ 9న ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. మోటరోలా 2016లో ప్రవేశపెట్టే ఈ కొత్త మొదటి స్మార్ట్ ఫోన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉండబోతోందని సమాచారం. చైనా సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మోటో జీ3 మాదిరిగానే ఎగువ, దిగువ స్పీకర్ గ్రిల్స్ కలిగి ఉంది. కెమెరా సెట్ అప్ చేయడం కూడా కొత్తగా ఉందని, మెరుగైన ఆటో ఫోకస్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ లీకేజీ పిక్చర్ చూపిస్తోంది. హోమ్ స్క్రీన్ కు కింద ఉన్న స్కేర్ హోమ్ బటన్ కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుందని లీకేజీల్లో ఉంది. 'ఎమ్' అనే లోగో కూడా కెమెరా కింద భాగంలో కనిపిస్తుంది. గత కొంతకాలం కిందటే గూగుల్ నుంచి మోటరోలాను లెనోవా సొంతంచేసుకుంది. ఈ నేపథ్యంలో లెనోవా బ్రాండింగ్ తో రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో 2016 మోటో జీ మొదటిది. 2016 మోటో జీ స్మార్ట్ పోన్ మధ్యతరగతుల బడ్జెట్ కు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. లీకేజీ మోటో జీ ఫీచర్స్ 5.5 అంగుళాలు, టీఈటీ ఎల్సీసీడీ 720పీ హెచ్ డీ ఆండ్రాయిడ్ 5.1.1, లాలీపాప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 1.5 జీహెచ్ జెడ్-కోర్ సీపీయూ 13ఎంపీ రేర్(4జీ ఫోన్), 16ఎంపీ రేర్(4జీ ప్లస్), 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 16జీబీ స్టోరేజ్ ప్లస్ 2 జీబీ రామ్ 2470 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ నలుపు, తెలుపు రంగుల్లో మోటో 4జీ ప్లస్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.