భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి ఒకాయా (Okaya) నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధమైంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకాయ మోటో ఫాస్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ నుంచి 135 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ నుంచి 70 కిమీ కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 17న అధికారికంగా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
లేటెస్ట్ ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. రోజు వారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LFP బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ సియాన్, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది కాబట్టి ఆఫర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ద్వారా స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్ మరియు బ్యాటరీ శాతం వంటి వాటిని చూపిస్తుంది. బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షవ్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment