ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది ఆపిల్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్ -13 ఫోన్లను వచ్చే నెల సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. కాగా ఈ ఫోన్ ఐఫోన్ 12కు తదనంతర ఫోన్‌గా రానుంది.
అమెరికాలో ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆపిల్ రిలీజ్ చేయనుంది. పెర్ల్, సన్‌సెట్ గోల్డ్ వేరియంట్లతో ఐఫోన్-13 రానుంది.
ఐఫోన్-13 ఫీచర్లు
- ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ సెన్సార్, ఎల్‌ఈడీ ఫ్లాష్
- లైడార్ సెన్సార్
- 5 జీ కనెక్టవిటీ సపోర్ట్
- వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- పవర్ ఎఫిసియంట్ ఎల్‌టీవో డిస్‌ప్లే
- ఏ15 బయోనిక్ చిప్‌సెట్ అండ్ అల్వేస్ ఆన్ డిస్‌ప్లే
- ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment