భారతీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్థ త్వరలో వర్చ్యువల్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ ప్రో' (Vision Pro) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ లాంచ్ చేయనున్న ఈ కొత్త హెడ్సెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, యాపిల్ కంపెనీ తన వర్చ్యువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను లాంచ్ చేయడానికంటే ముందు రిటైల్ స్టోర్‌లకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ అయిన తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం.
యాపిల్ సంస్థ ఈ విజన్ ప్రో హెడ్సెట్ సేల్స్ కోసం ఉద్యోగులకు ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి డెలివరీలు ప్రారంభమయ్యే సమయంలో శిక్షణ పొందిన ఉద్యోగులు రిటైల్ స్టోర్ల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు ఉండే అవకాశం ఉంది. వారు కొనుగోలుదారులకు హెడ్‌సెట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారు.
ధర (Price)
2023 WWDC ఈవెంట్‌లో మొదటి సారి కనిపించిన యాపిల్ విజన్ ప్రో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ హెడ్సెట్లో ఎమ్2 చిప్ సెట్, రెండు హై-రిజల్యూషన్ 4K ఐపీస్ వంటివి ఉంటాయి. దీని ధర 3499 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.90 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్
ఈ లేటెస్ట్ హెడ్‌సెట్‌తో వర్చ్యువల్ రియాల్టీ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ఇది మొదట కేవలం అమెరికాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఆ తరువాత చైనా, కెనడా, యూకే వంటి దేశాల్లో విక్రయాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ హెడ్సెట్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
I’d expect a Vision Pro related announcement sometime this upcoming week. Start writing your “Apple Wins CES” headlines. https://t.co/A41ayEKe6o
— Mark Gurman (@markgurman) January 7, 2024
Comments
Please login to add a commentAdd a comment