లీకేజీ బాటలో మోటో జీ కూడా | Motorola Moto G4, G4 Plus leaks: Specs, launch date, features and more | Sakshi
Sakshi News home page

లీకేజీ బాటలో మోటో జీ కూడా

Published Sun, Apr 24 2016 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

లీకేజీ బాటలో మోటో జీ కూడా

లీకేజీ బాటలో మోటో జీ కూడా

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాకముందే దాని ఫీచర్స్, ధరలు లీకవడం చూస్తున్నాం. ఇటీవలే హెచ్ టీసీకి ఎదురైన ఈ లీకేజీల అనుభవం ప్రస్తుతం మోటరోలా మోటో కి కూడా తాకింది. మోటరోలా నుంచి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 9న చైనా వేదికగా మార్కెట్లోకి తీసుకురానున్నట్టు లెనోవా కంపెనీ సీఈవో యాంగ్ యాన్ కింగ్ తెలిపారు. అయితే ఆయన మిగతా ప్రొడక్ట్ పేరు గురించి కానీ, దాని ధర, ఫీచర్స్ వివరాలేమి ప్రకటించలేదు. కానీ మోటరోలా నుంచి మోటో జీ 4, జీ 4 ప్లస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయని, వాటి ధరలు ఈ విధంగా ఉంటున్నాయంటూ పుకార్లు వస్తున్నాయి. చైనా సోషల్ నెట్ వర్క్ సైట్ లో ఈ ఫీచర్స్ , ధరలు హల్ చల్ చేస్తున్నాయి.

ఒకవేళ ఈ లీకేజీలే నిజమైతే మోటరోలా ప్రవేశపెడుతున్న మోటో జీ4, జీ4 ప్లస్ ను జూన్ 9న ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. మోటరోలా 2016లో ప్రవేశపెట్టే ఈ కొత్త మొదటి స్మార్ట్ ఫోన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉండబోతోందని సమాచారం. చైనా సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మోటో జీ3 మాదిరిగానే ఎగువ, దిగువ స్పీకర్ గ్రిల్స్ కలిగి ఉంది. కెమెరా సెట్ అప్ చేయడం కూడా కొత్తగా ఉందని, మెరుగైన ఆటో ఫోకస్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ లీకేజీ పిక్చర్ చూపిస్తోంది. హోమ్ స్క్రీన్ కు కింద ఉన్న స్కేర్ హోమ్ బటన్ కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుందని లీకేజీల్లో ఉంది. 'ఎమ్' అనే లోగో కూడా కెమెరా కింద భాగంలో కనిపిస్తుంది. గత కొంతకాలం కిందటే గూగుల్ నుంచి మోటరోలాను లెనోవా సొంతంచేసుకుంది. ఈ నేపథ్యంలో లెనోవా బ్రాండింగ్ తో రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో 2016 మోటో జీ మొదటిది. 2016 మోటో జీ స్మార్ట్ పోన్ మధ్యతరగతుల బడ్జెట్ కు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

లీకేజీ మోటో జీ ఫీచర్స్
5.5 అంగుళాలు, టీఈటీ ఎల్సీసీడీ 720పీ హెచ్ డీ
ఆండ్రాయిడ్ 5.1.1, లాలీపాప్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 1.5 జీహెచ్ జెడ్-కోర్ సీపీయూ
13ఎంపీ రేర్(4జీ ఫోన్), 16ఎంపీ రేర్(4జీ ప్లస్), 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
16జీబీ స్టోరేజ్ ప్లస్ 2 జీబీ రామ్
2470 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ
నలుపు, తెలుపు రంగుల్లో మోటో 4జీ ప్లస్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement