G4
-
భయపెట్టే వార్త చెప్పిన చైనా!
బీజింగ్: కరోనా కరాళ నృత్యంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు చైనా మరోసారి భయపెట్టే వార్త చెప్పింది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు బయటపటపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా ఆదివారం వెల్లడించింది. అడవి ఉడుత (మర్మోట్) మాంసం అమ్మే వ్యక్తి (27), అతని తమ్మునికి జూలై 1న ప్లేగ్ నిర్ధారణ అయిందని తెలిపింది. వారిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. వారితో కాంటాక్ట్ అయిన 146 మందిని అధికారులు ఐసోలేషన్లో ఉంచారని వెల్లడించింది. (చదవండి: గులాబీ రంగు మంచు.. పర్యాటకుల ఆందోళన) ఇక బుబోనిక్ ప్లేగ్పై మంగోలియా అలర్ట్ అయింది. తమ దేశంలోని బయన్నూర్ పట్టణంలో గత శనివారం ఒక ప్లేగ్ కేసు నమోదైందని తెలిపిన అక్కడి ప్రభుత్వం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. ప్లేగ్ నియంత్రణ, నివారణకు 2020 చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం అందకుంటే 24 గంటల్లోనే రోగి మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇదిలాఉండగా..గతేడాది మంగోలియాలోని బయాన్ ఉల్గీ ప్రాంతంలో అడవి ఉడుత పచ్చి మాంసం తిని బుబోనిక్ ప్లేగ్ బారినపడ్డ ఇద్దరు మరణించడం గమనార్హం. ఇక కరోనా విషయంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదనే విమర్శల నేపథ్యంలో చైనా ఇటీవల పందుల నుంచి వ్యాపించే జీ4 వైరస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కొత్త వైరస్ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వుహాన్లో నియంత్రణలో ఉన్న కరోనా, బీజింగ్లో అధికమవుతోంది. అక్కడ కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (భవిష్యత్ మహమ్మారి జీ4..!) -
భవిష్యత్ మహమ్మారి జీ4..!
చైనాలో పుట్టి ప్రపంచమంతా చుట్టేసిన కరోనాతో ప్రపంచ దేశాలన్నీ కిందామీదా పడుతోంటే.. అదే చైనాలో సరికొత్త వైరస్ ఒకదాన్ని శాస్త్రవేత్తలు పందుల్లో గుర్తించారు. జీ4 అని పిలుస్తున్న ఈ వైరస్ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పందుల్లో అటు పక్షి సంబంధ, ఇటు క్షీరద సంబంధ వైరస్లు రెండూ ఉంటాయి. ఇలా రెండు రకాల వైరస్లు ఒకే జంతువులో ఉన్నప్పుడు ఒకదాంట్లోని జన్యువులు ఇంకోదాంట్లోకి చేరుతుంటాయి. ఫలితంగా కొత్త రకాల వైరస్లు పుడుతుంటాయి. ఇవి ఏదో ఒక దశలో జంతువుల నుంచి క్షీరదాలైన మనుషులకూ సోకే అవకాశం ఉంటుంది. చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోంగ్లీసన్ అనే శాస్త్రవేత్త ఇటీవల పందులపై జరిపిన పరిశోధనల ద్వారా జీ4 ఉనికి బహిర్గతమైంది. దీంట్లో కనీసం మూడు ఇన్ఫ్లుయెంజా కారక వైరస్ల జన్యుపదార్థం కలిసిపోయి ఉంది. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్) . యూరప్, ఆసియా పక్షుల్లోని వైరస్ ఒకటి కాగా, ఎగిరే పక్షులు, మనుషులు, పందుల వైరస్లు కలిగి ఉన్న నార్త్ అమెరికన్ రకం మరొకటి. 2011 –2018 మధ్యకాలంలో హోంగ్లీసన్ పది చైనా ప్రావిన్స్ల్లోని జంతు వధశాలల్లో పందుల ముక్కుల్లోని స్రావాల నమూనాలు సేకరించి ఈ పరిశోధనలు నిర్వహించారు. శ్వాస సంబంధ సమస్యలున్న వెయ్యి పందుల నమూనాలను కూడా విశ్లేషించారు. వీటిలో జీ4తోపాటు కనీసం 179 ఇన్ఫ్లుయెంజా కారక వైరస్లు ఉన్నాయని, 2016 తరువాత సేకరించిన నమూనాల్లో ఇవి మరిన్ని ఎక్కువున్నాయని హోంగ్లీసన్ అంటున్నారు. జీ4 ఇప్పటికే మనుషులకు సోకుతున్నా అది మహమ్మారి స్థాయిలో లేదని, భవిష్యత్తులో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. పందులను పెంచేచోట్ల ఉన్న మనుషుల్లో ఈ జీ4 వైరస్ యాంటీబాడీలు కూడా గుర్తించడం ఇంకో విశేషం. -
లీకేజీ బాటలో మోటో జీ కూడా
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాకముందే దాని ఫీచర్స్, ధరలు లీకవడం చూస్తున్నాం. ఇటీవలే హెచ్ టీసీకి ఎదురైన ఈ లీకేజీల అనుభవం ప్రస్తుతం మోటరోలా మోటో కి కూడా తాకింది. మోటరోలా నుంచి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 9న చైనా వేదికగా మార్కెట్లోకి తీసుకురానున్నట్టు లెనోవా కంపెనీ సీఈవో యాంగ్ యాన్ కింగ్ తెలిపారు. అయితే ఆయన మిగతా ప్రొడక్ట్ పేరు గురించి కానీ, దాని ధర, ఫీచర్స్ వివరాలేమి ప్రకటించలేదు. కానీ మోటరోలా నుంచి మోటో జీ 4, జీ 4 ప్లస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయని, వాటి ధరలు ఈ విధంగా ఉంటున్నాయంటూ పుకార్లు వస్తున్నాయి. చైనా సోషల్ నెట్ వర్క్ సైట్ లో ఈ ఫీచర్స్ , ధరలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ లీకేజీలే నిజమైతే మోటరోలా ప్రవేశపెడుతున్న మోటో జీ4, జీ4 ప్లస్ ను జూన్ 9న ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. మోటరోలా 2016లో ప్రవేశపెట్టే ఈ కొత్త మొదటి స్మార్ట్ ఫోన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉండబోతోందని సమాచారం. చైనా సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మోటో జీ3 మాదిరిగానే ఎగువ, దిగువ స్పీకర్ గ్రిల్స్ కలిగి ఉంది. కెమెరా సెట్ అప్ చేయడం కూడా కొత్తగా ఉందని, మెరుగైన ఆటో ఫోకస్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ లీకేజీ పిక్చర్ చూపిస్తోంది. హోమ్ స్క్రీన్ కు కింద ఉన్న స్కేర్ హోమ్ బటన్ కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుందని లీకేజీల్లో ఉంది. 'ఎమ్' అనే లోగో కూడా కెమెరా కింద భాగంలో కనిపిస్తుంది. గత కొంతకాలం కిందటే గూగుల్ నుంచి మోటరోలాను లెనోవా సొంతంచేసుకుంది. ఈ నేపథ్యంలో లెనోవా బ్రాండింగ్ తో రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో 2016 మోటో జీ మొదటిది. 2016 మోటో జీ స్మార్ట్ పోన్ మధ్యతరగతుల బడ్జెట్ కు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. లీకేజీ మోటో జీ ఫీచర్స్ 5.5 అంగుళాలు, టీఈటీ ఎల్సీసీడీ 720పీ హెచ్ డీ ఆండ్రాయిడ్ 5.1.1, లాలీపాప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 1.5 జీహెచ్ జెడ్-కోర్ సీపీయూ 13ఎంపీ రేర్(4జీ ఫోన్), 16ఎంపీ రేర్(4జీ ప్లస్), 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 16జీబీ స్టోరేజ్ ప్లస్ 2 జీబీ రామ్ 2470 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ నలుపు, తెలుపు రంగుల్లో మోటో 4జీ ప్లస్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.