మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.
ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.
ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్‌లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్‌కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.
గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా విడుదల చేయవచ్చు.
ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట!
Comments
Please login to add a commentAdd a comment