జర్మన్ కండోమ్ బ్రాండ్ బిల్లీ బాయ్.. ఇన్నోసియన్ బెర్లిన్ కలిసి 'కామ్‌డోమ్' (Camdom) యాప్ ప్రారంభించాయి. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాలను, మైక్రోఫోన్‌లను నిలిపివేయడానికి బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
డిజిటల్ కామ్‌డోమ్ యాప్ అనేది.. ప్రైవేట్ సమయాల్లో వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ మీ అనుమతి లేకుండా ఎదుటి వ్యక్తి కాల్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ వంటివి చేయకుండా నిరోధిస్తుంది. ఒకవేళా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీకు అలర్ట్ వస్తుంది.
చాలామంది మీరు వీడియో కాల్ లేదా ఆడియో కాల్‌లో ఉన్నప్పుడు రికార్డ్ చేసి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ డిజిటల్ కామ్‌డోమ్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగించవచ్చు. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి.
ప్రస్తుతం ఈ యాప్ 30 కంటే ఎక్కువ దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ యాప్ మన వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా అడ్డుకుంటుందని యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment