ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొన్నప్పుడు ఉన్న స్పీడ్.. కొన్ని రోజుల ఉపయోగించిన తరువాత బహుశా ఉండకపోవచ్చు. దీనికి కారణం అనవసరమైన యాప్స్ కావొచ్చు.. లేదా అవసరం లేని డేటా స్టోరేజ్ కూడా కావొచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్ మళ్ళీ వేగంగా పనిచేయాలంటే.. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయాలి (Clear Cache and Data)
మొబైల్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. యూజర్ అనేక యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ, కొన్ని సార్లు అవసరం లేదు అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటాడు. వాటిని తాత్కాలికంగా డిలీట్ చేసినప్పటికీ.. అవి బ్యాక్‌ఎండ్‌లో స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఎక్కువవ్వడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. వీటన్నింటినీ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి క్లియర్ చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.
ఉపయోగించని యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి (Uninstall Unused Apps)
కొన్ని సార్లు మొబైల్ ఫోనులో ఉపయోగించని లేదా అనవసరమైన యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాప్ ఫోన్‌లో కొంత స్టోరేజిని ఆక్రమిస్తుంది. మరికొన్ని యాప్స్ అయితే ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన వెంటనే వాటి స్టోరేజ్‌ని విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ మొబైల్ స్పీడ్ తగ్గిస్తాయి.
అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లను డిసేబుల్ చేయాలి (Disable Unnecessary Background Processes)
మీరు ఉపయోగిస్తున్న మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లు కూడా అంత వేగంగా గుర్తించలేరు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. డిలీట్ చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం వంటివి చేయాలి.
పర్ఫామెన్స్ బూస్టర్ (Performance Booster) ఉపయోగించడం
పర్ఫామెన్స్ బూస్టర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్‌లోని అనవసరమైన ఫైల్‌లు.. అనవసరమైన డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ఫోన్‌లలో ఈ బూస్టర్ యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళా మీ మొబైల్ ఫోనులో లేదంటే ప్లే స్టోర్‌కి వెళ్లి ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment