smart phone app
-
డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..
జర్మన్ కండోమ్ బ్రాండ్ బిల్లీ బాయ్.. ఇన్నోసియన్ బెర్లిన్ కలిసి 'కామ్‌డోమ్' (Camdom) యాప్ ప్రారంభించాయి. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాలను, మైక్రోఫోన్లను నిలిపివేయడానికి బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.డిజిటల్ కామ్‌డోమ్ యాప్ అనేది.. ప్రైవేట్ సమయాల్లో వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ మీ అనుమతి లేకుండా ఎదుటి వ్యక్తి కాల్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ వంటివి చేయకుండా నిరోధిస్తుంది. ఒకవేళా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీకు అలర్ట్ వస్తుంది.చాలామంది మీరు వీడియో కాల్ లేదా ఆడియో కాల్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ డిజిటల్ కామ్‌డోమ్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగించవచ్చు. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి.ప్రస్తుతం ఈ యాప్ 30 కంటే ఎక్కువ దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ యాప్ మన వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా అడ్డుకుంటుందని యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా పేర్కొన్నారు. -
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్‌కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
రోబో లాయర్!
వాషింగ్టన్: న్యాయవాదుల సేవలు నానాటికీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయి. ఈ భారీ ఫీజులతో పని లేకుండా ఓ రోబో లాయర్ మన తరఫున ఎంచక్కా కోర్టులో వాదిస్తే? బాగుంటుంది కదా! కృత్రిమ మేధతో పని చేసే అలాంటి రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. డునాట్‌పే అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది. కోర్టులో వాదనలు జరిగినంతసేపూ సలహాలు సూచనలు అందించనుంది. స్మార్ట్ ఫోన్ సాయంతో వాదనలు వింటూ, ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తన కక్షిదారుకు ఎప్పటికప్పుడు ఇయర్ ఫోన్లో చెబుతుందట. అయితే కక్షిదారు పేరు, వాదనలు జరిగే కోర్టు తదితర వివరాలను సదరు కంపెనీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతోంది. స్టాన్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ జోషువా బ్రౌడర్ దీని వ్యవస్థాపకుడు. తన యాప్ ఆధారిత రోబో లాయర్లు మున్ముందు లాయర్ల వ్యవస్థ మొత్తాన్నీ భర్తీ చేయాలన్నది ఆయన ఆకాంక్ష! అదెంత మేరకు నెరవేరుతుందో చూడాలి. -
వ్యాధుల్ని పసిగట్టే యాప్
న్యూయార్క్ : రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్ల్లోని మైక్రోఫోన్ నుంచే యూజర్ల ఆరోగ్యంపై వైద్యులకు సంకేతాలు వెళతాయి. యుద్ధరంగంలో సైనికుడి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే కొత్త యాప్‌ను పెంటగాన్ అభివృద్ధి చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల్లో నిక్షిప్తమయ్యే సాఫ్ట్వేర్ కెమేరాలు, లైట్ సెన్సర్లు, పెడోమీటర్లు, ఫింగర్‌ప్రింట్ సెన్సర్లు, ఇతర సెన్సర్ల ద్వారా యూజర్ల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తుంది. పెంటగాన్ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ టెక్నాలజీ కొన్ని సంవత్సరాల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. వర్జీనియాకు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రిప్టోవైర్కు ఈ యాప్‌ను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ 3 కోట్ల కాంట్రాక్ట్‌ను అప్పగించారు. సైనికుడి ఆరోగ్యాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ సెన్సర్ డేటాను విశ్లేషిస్తుంది. వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు బయోమార్కర్లను గుర్తిస్తుంది. వ్యాధి లక్షణాలు ముదిరేలోగా వైద్యుడు, నర్సింగ్ సేవలు అందేలోగా వైద్య పరమైన అవసరాలనూ అధిగమించేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. అయితే యాండ్రాయిడ్, ఐఓఎస్‌లపై రూపొందే ఈ యాప్ వల్ల యూజర్ గోప్యత, భద్రతా పర్యవసానాలపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
స్మార్ట్ యాప్స్‌తో కుంగుబాటు దూరం
సిడ్నీః కుంగుబాటు, అలజడి, మానసిక సంఘర్షణలకు స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉపశమనం ఇస్తాయని ఓ సర్వే తేల్చింది. మానసిక అలజడులకు ఇవే మంచి మందని నిపుణలు పేర్కొన్నారు. డిప్రెషన్‌తో బాధపడే వారిని సరిగ్గా అర్ధం చేసుకుని, నిరంతరం పర్యవేక్షిస్తూ వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో స్మార్ట్ ఫోన్ యాప్స్ మెరుగ్గా ఉన్నాయని పరిశోధకులు నిగ్గుతేల్చారు. మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీతో, మూడ్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌లతో పోలిస్తే యాప్స్ పనితీరులో ఎలాంటి వ్యత్యాసం లేదని కనుగొన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. డిప్రెషన్‌ను దూరం చేసేందుకు సంపూర్ణ వైద్యంగా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. మానసిక అలజడులతో బాధపడేవారి మూడ్స్‌ను సరిగ్గా ఉండేలా చూడటంలో తీవ్ర కుంగుబాటును నియంత్రించడంలో యాప్స్ ఉపయోగకరంగా ఉన్నాయని వరల్డ్ సైకియాట్రి జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన 3400 మంది స్ర్తీ, పురుషులపై ఈ అథ్యయనం నిర్వహించినట్టు పరిశోధకులు తెలిపారు. -
1..2..3 లైట్స్ ఆన్!
ఇంట్లో లైట్ అనగానే మనం పైకప్పు కేసి చూస్తాం. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా దీపాలు అక్కడే ఉంటాయి. అవసరమైనప్పుడు వెలుతురు ఎక్కువ తక్కువయ్యే అవకాశం లేదు. రంగులు మారే ప్రశ్నే రాదు. ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్స్ కొన్నింటిలో ఇతర హంగులన్నీ ఉన్నా... వెలుతురును ఒక స్థాయి వరకూ మాత్రమే పెంచుకోవచ్చు. ఇప్పుడు పక్క ఫొటోను చూడండి. ఇందులో షడ్భుజి ఆకారంలో కనిపిస్తున్నవి ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన హీలియోస్ బల్బులు. ఒకొక్కటి 4.3 అంగుళాల వెడల్పు, ఒక అంగుళం మందం ఉంటాయి. 6.3 వాట్ల విద్యుత్తును వాడుకుని 400 ల్యూమెన్ల వెలుతురునిస్తాయి. మన లైటింగ్ అవసరాలను బట్టి ఒకదానితో ఒకటి అతికించుకుంటూ పోవచ్చు. ఇలా దాదాపు 105 బల్బులను జోడించుకుంటూ వెళ్లవచ్చునని కంపెనీ చెబుతోంది. ఇందుకోసం అయస్కాంతంగా, ఎలక్ట్రిక్ కనెక్షన్గానూ ఉపయోగపడేలా ప్రత్యేకమైన ఫిటింగ్సను ఉపయోగించారు. ముట్టుకుంటే.. ఆన్/ ఆఫ్ అయిపోతాయి. రంగులు మార్చుకోవడం, వెలుతురు స్థాయిని పెంచుకోవడం కూడా స్మార్ట్‌ఫోన్ ఆప్‌తో సునాయాసంగా చేయవచ్చు. ప్రస్తుతం కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరిస్తున్న కంపెనీ వచ్చే ఏడాది వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని అంటోంది.