సిడ్నీః కుంగుబాటు, అలజడి, మానసిక సంఘర్షణలకు స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉపశమనం ఇస్తాయని ఓ సర్వే తేల్చింది. మానసిక అలజడులకు ఇవే మంచి మందని నిపుణలు పేర్కొన్నారు. డిప్రెషన్‌తో బాధపడే వారిని సరిగ్గా అర్ధం చేసుకుని, నిరంతరం పర్యవేక్షిస్తూ వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో స్మార్ట్ ఫోన్ యాప్స్ మెరుగ్గా ఉన్నాయని పరిశోధకులు నిగ్గుతేల్చారు. మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీతో, మూడ్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌లతో పోలిస్తే యాప్స్ పనితీరులో ఎలాంటి వ్యత్యాసం లేదని కనుగొన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
డిప్రెషన్‌ను దూరం చేసేందుకు సంపూర్ణ వైద్యంగా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. మానసిక అలజడులతో బాధపడేవారి మూడ్స్‌ను సరిగ్గా ఉండేలా చూడటంలో తీవ్ర కుంగుబాటును నియంత్రించడంలో యాప్స్ ఉపయోగకరంగా ఉన్నాయని వరల్డ్ సైకియాట్రి జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన 3400 మంది స్ర్తీ, పురుషులపై ఈ అథ్యయనం నిర్వహించినట్టు పరిశోధకులు తెలిపారు.