over heat
-
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్‌కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. తిరుమలలో శుక్రవారం వేకువజామున బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం సంభవించింది. టీటీడీ అధికారుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుంది. కొన్ని నిమిషాల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఓవర్ హీట్ కారణంగానే ప్రమాదం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తాత్కాలికంగా లడ్డూ తయారీని ఆపేశారు. సంఘటనాస్థలాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు పరిశీలించారు. -
హడలిపోతున్న ఆటగాళ్లు
న్యూయార్క్ : బాబాయ్ ఇవేం ఎండలు.. అంటున్నారు యూఎస్ గ్రాండ్ స్లామ్లో ఆడుతున్న ఆటగాళ్లు. ఎందుకంటే ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిన ఆటగాళ్ల సంఖ్య 14కు చేరుకుంది. అమెరికాకు చెందిన జాక్ సాక్ 33 డిగ్రీల ఎండ వేడిమిని తట్టుకోలేక టెన్నిస్ కోర్టులోనే నిస్సహాయంగా కూలబడిపోగా, అతడిని డ్రెస్సింగ్ రూముకు మోసుకెళ్లాల్సి వచ్చిందంటేనే విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బెల్జియంకు చెందిన రుబెన్ బెమెల్మన్స్తో మ్యాచ్‌లో 6-4, 6-4, 3-6, 1-2తో ఉన్న దశలో 28వ సీడ్ ఆటగాడైన 22 ఏళ్ల సాక్ రిటైర్ అవ్వాల్సి వచ్చింది. సెట్ విరామాల్లో ఐస్ ముక్కలతో అతడికి సాంత్వన చేస్తూ, చల్లని టవల్స్‌తో ఉపశమనం కల్గించేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. కారణం భరించలేనంత వేడి, ఉక్కపోత. 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రోజూ అక్కడ నమోదవుతోంది. జాక్ రిటైరైన కొన్ని గంటల్లోనే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెన్నిస్ ఇస్తోమిన్ 6-4, 6-4, 1-0 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన డొమినిక్ తేయిమ్తో ఉన్న సందర్భంలో కోర్టులోనే కుప్పకూలిపోయాడు.దీంతో ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇద్దరు మహిళా క్రీడాకారిణులు తొలిరౌండ్లోనే రిటైర్ అయిన విషయం విదితమే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 14 మంది యూఎస్ ఓపెన్‌లో ఎండ వేడిమికి తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నారు. ఇదిలాఉండగా ఎండ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఫ్రెంచ్ ఓపెన్ విజేత వావ్రింకా అన్నాడు. తాను ఎప్పుడు అలా రిటైర్ అవ్వలేదని తెలిపాడు. వావ్రింకా సాధారంగానే ఆరున్నర అడుగుల ఎత్తుతో పాటు శారీరకంగానూ ఫిట్‌గా ఉండటంతో అతనికి సమస్యే లేదు. ఇతర ఆటగాళ్లు మాత్రం బలమైన ప్రత్యర్థి కంటే కూడా ఎండ వేడిమిని తట్టుకోలేక బెంబెలెత్తుతుండటం గమనార్హం. అయితే, మ్యాచ్ మధ్యలోనే వైదొలగాల్సిరావడం తనను ఎంతో నిరుత్సాహానికి గురిచేసిందని వడదెబ్బ నుంచి తేరుకున్న అనంతరం జాక్ సాక్ పేర్కొన్నాడు.