
తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. తిరుమలలో శుక్రవారం వేకువజామున బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం సంభవించింది. టీటీడీ అధికారుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుంది. కొన్ని నిమిషాల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఓవర్ హీట్ కారణంగానే ప్రమాదం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తాత్కాలికంగా లడ్డూ తయారీని ఆపేశారు. సంఘటనాస్థలాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు పరిశీలించారు.