ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో మొదటిసారి తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలచేసినప్పుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు అనేక విధాలుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని టెస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ మే 23 న అధికారికంగా మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం.
సింపుల్ ఎనర్జీ 2023 మే 23న తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలో ఏర్పడిన లోపల వల్ల కొన్ని కంప్లైంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ సింపుల్ వన్ స్కూటర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తూ విడుదల చేయడంలో కొంత ఆలస్యం చేసింది.
ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) సవరణ 3 ప్రవేశపెట్టిన తరువాత మెరుగైన బ్యాటరీ భద్రతలను కలిగి ఉన్న స్కూటర్లలో సింపుల్ వన్ ప్రధానంగా చెప్పుకోదగ్గదిగా మారింది. కావున ఈ స్కూటర్ మార్కెట్లో అమ్మకానికి రానున్న అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది.
(ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!)
కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కోలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందింది, కాగా త్వరలో లాంచ్ అవుతుంది. డెలివరీలు కూడా వేగంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment