బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?
3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది.
డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment