Simple One Electric Scooter: బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న 'సింపుల్ వన్' (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రేపు అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. సుదీర్ఘ విరామం తరువాత విడుదలకానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. డెలివరీలు కూడా బహుశా రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు పరిచయమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు రెండు సంవత్సరాల తరువాత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎటువంటి ఇబ్బందులు కస్టమర్లు ఎదుర్కోకూడదని చాలా రోజులుగా టెస్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం చరమ దశకు చేరింది. కావున విడుదలకు సన్నద్ధమైపోయింది.
రేంజ్
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. కావున మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు లభిస్తాయి.
(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్‌జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!)
ధర & ప్రత్యర్థులు
ఇప్పటికే మంచి బుకింగ్స్ పొందిన ఈ స్కూటర్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ స్కూటర్ ధరను రూ. 1.09 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గతంలోనే ప్రకటించింది. ఇది మార్కెట్లో ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment