టెక్నాలజి దిగ్గజం ఆపిల్ నుంచి మరో రెండు ఐప్యాడ్‌లు రాబోతున్నాయి. అధునాత ఫీచర్లతో ఈ ఐ ప్యాడ్‌లను ఆపిల్ రిలీజ్ చేయబోతుంది. ఓఎల్‌ఈడీ టెక్నాలజీతో, హై రిఫ్రెష్ రేట్‌తో ఈ ఐ ప్యాడ్‌లను రూపొందిస్తోంది ఆపిల్.
2022లో
వచ్చే సంవత్సరంలో 10.86 అంగులాల ఐప్యాడ్‌ను రిలీజ్ చేయనుంది. ఇందులో ఉన్న ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేకు సపోర్ట్‌గా థిన్ ఫిల్మ్ ఎన్‌క్యాప్సులైజేషన్ టెక్నాలజీ ఉపయోగించినట్టు ‘జీఎస్‌ఎం ఆరేనా’ పేర్కొంది. ఇది గాలిలో తేమ, ఆక్సిజన్ ఇతర కారణాల వల్ల ఓఎల్‌ఈడీకి అదనపు రక్షణ కల్పిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐ ప్యాడ్ ఎయిర్‌కు నెక్ట్స్ వెర్షన్‌లా రాబోతుంది.
2023లో
ఎల్‌టీపీవో టెక్నాలజీ ప్యానెళ్లతో మరో ఐ ప్యాడ్‌ను మార్కెట్‌లోకి ఆపిల్ తేనుంది. 12.9 అంగులాలు, 11 అంగులాల డిస్‌ప్లేలతో రెండు వేరియంట్లుగా ఈ మోడల్‌ని రూపొందిస్తోంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేటును 120 హెర్జ్‌గా ఇవ్వబోతుంది. ఐప్యాడ్‌ని మాక్సిమమ్ రిఫ్రేష్ రేటులో ఉపయోగిస్తున్నా.. బ్యాటరీ త్వరగా డ్రైన్ అవకుండా ఎల్‌టీపీవో టెక్నాలజీ సాయం చేస్తుంది. ఈ ఐ ప్యాడ్‌ని 2023లో రిలీజ్ చేసేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది.
ఆపిల్ వాటా
ప్రస్తుతం ఇండియాలో ట్యాబెట్ల మార్కెట్‌లో ఆపిల్‌కి 29 శాతం వాటా ఉంది. మార్కెట్‌లో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి వెళ్లేందుకు కన్నేసిన ఆపిల్ వరుసగా కొత్త మోడళ్లు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment