iPads
-
తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్‌గా నిలుస్తోంది. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుని మరీఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్, ఐప్యాడ్స్, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది. ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఇండియాలో రెండో స్టోర్‌గా యాపిల్ సాకేత్‌ను ఢిల్లీలో ఏప్రిల్ 20న యాపిల్ సీఈవో టిక్ కుక్ లాంచ్ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్‌ను లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ప్రత్యర్థిబ్రాండ్ల స్టోర్స్ లేకుండా జూలై 2022లో మాల్తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్. -
ఇక ఎయిర్‌ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ!
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ భారత్‌లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఆర్డర్‌ను సాధించింది. దీంతో ఇప్పటివరకు ఐఫోన్ మేకర్‌గా ఉన్న తైవాన్‌కు మేకర్ ఇపుడు తొలిసారి ఎయిర్‌పాడ్స్‌ను కూడా ఉత్పత్తి చేయనుంది. దాదాపు 70శాతం ఐపోన్ల అసెంబ్లర్ ఫాక్స్‌కాన్ కొత్త ప్లాంట్‌లో ఎయిర్‌ప్యాడ్స్ ఉత్పత్తి షురూ అయితే తక్కువ ధరకే లభ్యం కానున్న యాపిల్ ఉత్పత్తుల జాబితాలో ఇవి కూడా చేరనున్నాయి. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) రాయిటర్స్ అందిచిన రిపోర్ట్ ప్రకారం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇండియా ఎయిర్‌ప్యాడ్ ప్లాంట్‌లో ఫాక్స్‌కాన్ 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,654 కోట్లు) పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించాలనే ఫాక్స్‌కాన్ లక్క్ష్యం. గత కొంతకాలంగా యాపిల్ భారత్‌లో తన కార్యకలాపాలని విస్తరించాలని యోచిస్తోంది. అయితే తక్కువ లాభాలు ఉన్నందున ఎయిర్పాడ్లను తయారు చేయాలని అనేదానిపై ఫాక్స్‌కాన్ తీవ్రం చర్చిస్తోందని చివరికి ఒప్పందంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించిందేకు నిరాకరించిన ఫాక్స్‌కాన్ కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా వెలుపల పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్‌కాన్ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎయిర్‌ప్యాడ్స్ సరఫరా చేస్తున్న చైనా కంపెనీలను కాదని, భారత్‌లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్‌కాన్‌తో యాపిల్ ఒప్పందం చేసుకున్నట్టు అంచనా. మరోవైపు ఈ వార్తలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ యాపిల్ నుండి మరిన్ని ఆర్డర్లను గెలుచుకోవడానికి Wistron Corp, Pegatron Corp వంటి తైవానీస్ ప్రత్యర్థులతో ఫాక్స్‌కాన్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
యాపిల్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ యాపిల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్, ఇవాన్స్ హాంకీ తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ స్థానంలో హాంకీ బాధ్యతలు స్వీకరించారు. హాంకీ స్థానంలో ఎవర్ని నియమించిందీ యాపిల్ అధికారంగా ప్రకటించలేదు. అయితే కొత్త నియామకంగా జరిగేదాకా ఆమె తన పదవిలో కొనసాగ నున్నారు. కాగా ఐమాక్, ఐపాడ్ ఐఫోన్ల పరిచయం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా జోనీ ఐవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌తో కలిసి విభిన్నమైన యాపిల్ ఉత్పత్తులకు నాంది పలికారు. అయితే తన సొంత స్వతంత్ర కంపెనీ స్థాపన నేపథ్యంలో యాపిల్ నుంచి ఆయన నిష్క్రమించడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
15 వేలకే యాపిల్ 4కే టీవీ, అదిరిపోయే ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ న్యూ జనరేషన్ యాపిల్ 4కే టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ 14,900గా ఉంచింది. దీంతోపాటు 5జీ సరికొత్త ఐప్యాడ్, ఐప్యాడ్‌ప్రో (ఎం2చిప్సెట్) విడుదల చేసింది. ముఖ్యంగా ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో అదిరిపోయే లుక్‌లో ఈ ప్యాడ్‌ను తీసుకొచ్చింది. యాపిల్ 4కే టీవీ డాల్బీ విజన్‌తో పాటు HDR 10+కి మద్దతుతో సిరి రిమోట్, USB Type-C పోర్ట్‌ను ఇందులో జోడించింది. రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేసింది. వేగవంతమైన నెట్వర్కింగ్ , స్ట్రీమింగ్ కోసం వైఫై ఈథర్నెట్ సపోర్ట్‌తో 64 జీబీ స్టోరేజ్. రెండోది యాప్‌లు, గేమింగ్ కోసం 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 16,900. ఇంట్లోనే అతిపెద్ద స్క్రీన్‌పై తమకు ఇష్టమైన వినోదాన్ని ఆస్వాదించే లక్క్ష్యంతో గతంలో కంటే మరింత శక్తివంతంగా దీన్ని లాంచ్ చేసినట్టు వైస్ ప్రెసిడెంట్ బాబ్ బోర్చర్స్ అన్నారు. ఈటీవీలు ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, షిప్పింగ్ నవంబర్ 4 నుండి ప్రారంభం. ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఐప్యాడ్ ఫుల్ ఆల్ స్క్రీన్ తో సిల్వర్, బ్లూ, ఎల్లో, పింక్ నాలుగు కొత్త రంగుల్లో కొత్త 10వ తరం ఐప్యాడ్ అందుబాటులో ఉండనుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ 2022 వైఫై 64 జీబీ మోడల్ ధర రూ. 44,900 గాను, వైఫై 256 జీబీ వేరియంట్ ధర రూ. 59,900గా ఉంది. అలాగే వైఫై + సెల్యులార్ 64 జీబీ మోడల్ ధర రూ. 59,900 గాను, వైఫై + సెల్యులార్ 256 జీబీ ధర రూ. 74,900 గా ఉంది. ఐప్యాడ్ స్పెసిఫికేషన్స్ 10.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ ప్లే ఏ14 బయోనిక్ చిప్ సెట్ ఐప్యాడ్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ రియర్ కెమెరా 4కే వీడియో సపోర్ట్ ఈ ఐప్యాడ్ కి సంబందించిన ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాపిల్ వెబ్సైట్ ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 26నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. -
యాపిల్ వార్నింగ్:సెక్యూరిటీ లోపం, తక్షణమే అప్డేట్ చేసుకోండి!
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ సెక్యూరిటీ లోపాలపై తన యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. తన ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్, మ్యాక్లకు సంబంధించి హ్యాకర్లు దాడిచేసి అవకాశం ఉందని సూచించింది. వెంటనే అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులను కోరింది. iPhone6S, తదుపరి మోడల్స్; ఐప్యాడ్ 5వ తరంతో పాటు, అన్ని ఐప్యాడ్ ప్రో మోడల్స్, ఐప్యాడ్ ఎయిర్ 2; మ్యాక్ కంప్యూటర్లు macOS Montereyలను ప్రభావితం చేస్తుందని సెక్యూరిటీ నిపుణులు కూడా హెచ్చరించారు. దీనిపై బుధవారం రెండు భద్రతా నివేదికలను యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మాక్‌ల భద్రతాలోపాన్ని వెల్లడించిన యాపిల్ ఆయా పరికరాలపై హ్యాకర్లు పూర్తి పట్టు సాధించే అవకాశం ఉందంటూ పేర్కొంది. వీలైనంత త్వరగా ఆయా డివైస్‌లలో ఈ కొత్త ప్యాచ్ అప్డేట్ చేసుకోవాలని,లేదంటేసైబర్ నేరగాళ్లు సిస్టమ్‌లోకి ప్రవేశించి విలువైన డేటాను యాక్సస్ చేయవచ్చు. అన్ని డివైస్‌లలో ప్యాచ్డ్ వెర్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఎక్కడ, ఎవరి ద్వారా లోపాన్ని గుర్తించిందీ యాపిల్ స్పష్టం చేయలేదు. అటు భద్రతా నిపుణులు ప్రభావితమైన పరికరాలను అప్డేట్ చేసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చొరబాటుదారులు అసలు ఓనర్‌గా నటించి, వారి పేరుతో ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉందని సోషల్ ప్రూఫ్ సెక్యూరిటీ సీఈవో రేచెల్ టొబాక్ తెలిపారు. 1/ Apple has just released macOS Monterey 12.5.1 and iOS 15.6.1/iPadOS 15.6.1 to resolve two zero-day vulnerabilities which have been actively exploited, and targeting crypto wallets. We strongly recommend that you update your devices as soon as possible. — GameStopNFT (@GameStopNFT) August 18, 2022 -
త్వరలోనే యాపిల్ టెక్ ఫెస్టివల్, ఆతృతగా ఎదురు చూస్తున్న టెక్ లవర్స్!
టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించే టెక్ ఫెస్టివల్ వచ్చేసింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)- 2022ను జూన్ 6నుంచి జూన్ 10వరకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ డెవలర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా యాపిల్ సంస్థ తాను విడుదల చేయబోయే గాడ్జెట్స్ గురించి ప్రకటన చేస్తుంది. అందుకే వచ్చే నెలలో జరగనున్న కాన్ఫరెన్స్ లో యాపిల్ ఏం ప్రకటన చేస్తుందోనని టెక్ లవర్స్‌కు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ల గురించి డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఓఎస్ 16, ఐపాడ్ ఐఓఎస్ 16, వాచెస్ ఓస్ 9 లలో అదనంగా కొన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. నోటిఫికేషన్ల అప్డేట్తో పాటు కార్ క్రాష్ డిటెక్షన్, ఐపాడ్లలో కొత్త మల్టీ టాస్కింగ్ ఇంటర్ ఫేస్ తో పాటు మిగిలిన గాడ్జెట్ అప్డేట్ల గురించి ప్రకటన చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు పేర్కొన్నాయి. -
యాపిల్ మాస్టర్‌ప్లాన్...అందరికీ అందుబాటులో ఐఫోన్..! కొనడం మరింత ఈజీ..!
యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తులకు ఆదరణ మామూలుగా ఉండదు.ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్లకు సాటి లేదు. కొంతమందైతే ఐఫోన్లను దర్పంలాగా కూడా వాడుతుంటారు. యాపిల్ ఐఫోన్లను సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అధిక ధర ఉండడంతో చాలామంది ఐఫోన్లను కొనడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కాగా ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లను అందరికీ అందుబాటులో ఉంచేందుకు యాపిల్ సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్..! సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్ రూపంలో ఐఫోన్, ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తులను విక్రయించాలని యాపిల్ భావిస్తోన్నట్లు సమాచారం. ఈ సర్వీసులో భాగంగా తొలుత ఐఫోన్, ఐప్యాడ్లను యాపిల్ విక్రయించనుంది. ఇక్కడ కస్టమర్లు సంప్రదాయ పద్ధతి(ఈఎంఐ)లో కొనుగోలు చేయడానికి బదులుగా నెలవారీ యాప్ రుసుమును చెల్లిస్తారు. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం..యాపిల్ హార్డ్‌వేర్ సబ్స్క్రిప్షన్ సేవ ఇంకా అభివృద్ధిలో ఉందని నివేదించింది. కాగా ఈ ఏడాది చివరిలో సబ్స్రిప్షన్ బేస్డ్ సర్వీసులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తులను సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసుల్లో అమ్మడం ద్వారా కంపెనీకి భారీగా కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆయా మార్కెట్లలో కొనుగోలుదారులు యాపిల్ కార్డ్ ద్వారా హార్డ్‌వేర్ ఉత్పత్తుల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడానికి అనుమతిస్తుంది. దీనిలో ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. వీటి ద్వారా కస్టమర్లు, ఎంపిక చేసిన దేశాలలో, ఎటువంటి అదనపు ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత ఐఫోన్లను ఎక్సేఛేంజ్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను పొందవచ్చు. భారీ ఆదాయాలు..! యాపిల్‌కు సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసులు చాలా ముఖ్యమైనవి. ఇప్పటి వరకు Apple Music, iCloud, Apple TV Plus, Apple Fitness Plus, Apple Arcade వంటి యాప్ సేవలను యాపిల్ తన యూజర్లకు అందిస్తోంది. వీటన్నింటిని యాపిల్ వన్ పేరుతో బండిల్ సబ్స్క్రిప్షన్ సేవలు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కంపెనీకి భారీ ఆదాయం సమాకురుతోంది. ఇదే తరహాలో థర్డ్ పార్టీ సంస్థలకు దూరంగా ఉంటూ ఐఫోన్, ఐప్యాడ్ అమ్మకాలను జరపాలని యాపిల్ భావిస్తోన్నట్లు సమాచారం. చదవండి: ఐఫోన్‌ను తలదన్నేలా బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్..! నథింగ్ నుంచి..! లాంచ్ ఎప్పుడంటే..? -
పెను ప్రమాదంలో ఐఫోన్, యాపిల్ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..!
ఇటీవల ఐఫోన్లతో పాటుగా పలు యాపిల్ ఉత్పత్తులపై కొత్త అప్డేట్ను విడుదల చేసింది యాపిల్. ఈ అప్డేట్తో పలు ఫీచర్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఫేస్ మాస్క్ అన్‌లాక్‌ను ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సైబర్-సెక్యూరిటీ వింగ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ డివైజ్‌లను వాడుతున్న వినియోగదారులందరూ వీలైనంత త్వరగా తమ డివైజ్‌లను అప్డేట్ చేయాలని కోరుతూ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్ల చేతిలోకి..! యాపిల్ ఉత్పత్తుల్లో భద్రత లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. దీంతో యాపిల్ ఉత్పత్తులను హ్యకర్లు సులువుగా అపరేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. మెమొరీ ప్రారంభ సమస్య, ఔట్ ఆఫ్ బౌండ్ రీడ్ అండ్ రైట్, మెమరీ కరప్షన్, సెన్సిటివ్ ఇష్యూ టైప్, యూజ్ ఆఫ్టర్ ఫ్రీ, నల్ పాయింటర్ డిరిఫరెన్స్, అథనిటికేషన్ సమస్య, కుకీ మేనేజ్మెంట్ , వ్యాలిడేషన్ ఇష్యూ, బఫర్ ఓవర్‌ఫ్లో, మెమరీ యూజ్ , యాక్సెస్ ప్రాబ్లమ్ వంటి భద్రతా లోపాలు కనుగొన్నామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. ఈ భద్రతా లోపాల కారణంగా యాపిల్ ప్రొడక్ట్స్‌పై సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అప్డేట్ చేయాల్సినవి Apple iOS,iPadOS ఉత్పత్తుల్లో 15.4 కంటే పాత వెర్షన్ Apple WatchOS ఉత్పత్తుల్లో 8.5 కంటే పాత వెర్షన్ Apple TV 15.4 కంటే పాత వెర్షన్ Apple macOS Monterey 12.3 కంటే పాత వెర్షన్ యాపిల్ మాకోస్ కాటాలినా వెర్షన్ కంటే పాత వెర్షన్ చదవండి: ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేయండి? -
బంపరాఫర్..! ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బంపరాఫర్‌ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్‌ను ఫ్రీగా పొందాలంటే యాపిల్ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాపిల్ మార్చి 7,2022 వరకు 'బ్యాక్ టూ యూనివర్సిటీ' ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది. ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్‌బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే యాపిల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్‌లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే? ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్‌లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్లో మాత్రం "సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్" అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాపిల్ 'యాపిల్ కేర్ ప్లస్' ప్రొటెక్షన్ ప్లాన్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్డేట్ అవుతాయి. యాపిల్ అధికారిక సైట్ ప్రకారం..ఈ ఆఫర్ ప్రస్తుతం, లేదంటే కొత్తగా ఆమోదించిన యూనివర్సిటీ విద్యార్ధులకు,లెక్చరర్స్‌కు, విద్యార్ధుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా సైన్ అప్ చేసి unidasyలో నమోదు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ జరుగుతుందని గుర్తించాలి. చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు! -
విమాన ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..!
‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ ఇది సినిమా డైలాగే. కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాన్నే మార్చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యాపిల్ స్మార్ట్ వాచ్ యువకుడి ప్రాణం కాపాడింది. ఇప్పుడు అదే యాపిల్ సంస్థకు చెందిన ఐపాడ్..విమాన ప్రమాదం నుంచి తండ్రి - కూతుర్ని కాపాడింది. సీఎన్ఎప్ కథనం ప్రకారం..అమెరికా పెన్సిల్వేనియాకు చెందిన 58ఏళ్ల పైలెట్ తన 13ఏళ్ల కుమార్తెతో కలిసి రెండు సీట్ల విమానంలో మరో ప్రాంతానికి బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే రాడార్‌లో విమానం ఆచూకీ తప్పిపోయింది. దీంతో అప్రమత్తమైన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ సిబ్బంది విమానం చివరి సారిగా తప్పిపోయిన ప్రదేశంలో కోఆర్డినేటర్లు, రెస్క్యూ టీమ్‌లు, 30 మంది వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అదే సమయంలో పైలట్ జాడ గుర్తించిన రెస్క్యూ టీమ్ అతని భార్యను సంప్రదించి, బాధితుడి ఫోన్ నెంబర్‌ను సేకరించారు. కానీ ఆ ఫోన్ నెంబర్ నుంచి బాధితుడికి ఫోన్ చేయగా.. ఆఫోన్ సిగ్నల్స్ మిస్సవ్వడంతో అతడి కుమార్తె వద్ద ఐపాడ్ ఉందని గుర్తించారు. ఐపాడ్ సిగ్నల్స్ ఆధారంగా అధికారులు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తండ్రి, కుమార్తె' ఆచూకీ లభ్యమైంది. విమానం టేకాఫ్ అయిన విల్కేస్-బారే స్క్రాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి చెందిన చెట్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బాధితుల్ని ఆలస్యంగా ఆస్పత్రిలో జాయిన్ చేసి ఉంటే ప్రాణాలు పోయేవని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితుడి భార్య...విమాన ప్రమాదంలో గాయపడ్డ కుటుంబ సభ్యులు ఐపాడ్ వల్ల ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: యాపిల్ లోగో..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..! -
వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా
ఐపాడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వాట్సాప్ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్ యూజర్లు వినియోగించేలా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2019 నుంచి మల్టీ డివైజ్ 2.0 పేరుతో మల్టీ డివైజ్ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్..ఈ ఏడాదిలో ఊహించని విధంగా ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందించింది. అయితే తాజాగా ఈ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్లలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. యూజర్లు వాట్సాప్‌ను ఫోన్‌తో పాటు వాట్సాప్ వెబ్, పోర్టల్, డెస్క్ ట్యాప్, ఫోన్ లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఐపాడ్ లో కూడా అందుబాటులోకి రానుంది. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 అంతేకాదు వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. కాగా భవిష్యత్‌లో ఐపాడ్ కాకుండా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో మల్టీ డివైజ్ ఆప్షన్ ను అందించనుంది. -
అగ్గిరాజుకుంటే ఆగమే, ఆపిల్,విండోస్‌పై కేంద్రం హెచ్చరిక
విండోస్, ఆపిల్ కొత్త వెర్షన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరికులు జారీ చేసింది. పెగాసెస్‌తో సైబర్ అగ్గిరాజుకుంటే ఆగమేనని భావించిన కేంద్రం సైబర్ దాడులు జరిగే ఓఎస్‌లను గుర్తించి.. వాటి వినియోగంలో జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)విండోస్,ఆపిల్ ఐఫోన్,యాపిల్ ఐప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు ప్రైవేట్, ప్రభుత్వరంగానికి చెందిన సంబంధిత శాఖల రహస్యాల్ని సేకరించేందుకు టార్గెటెడ్ కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను 'కోడ్ ఎగ్జిక్యూషన్' సాయంతో దాడి చేస్తారని,ఆ సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేసింది. విండోస్ వినియోగదారులు,యాపిల్ కొత్త వెర్షన్లను ఆపరేట్ చేసే వినియోగదారులు మితిమీరిన అనుమతుల కారణంగా యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్‌లో ఉన్న ఫైళ్లు,డేటా బేస్‌తో పాటు సెక్యూరిటీ అకౌంట్స్ మేనేజర్ (SAM) లు భద్రతలోపం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఆ లోపం కారణంగా పాస్వర్డ్ లను గుర్తించి సిస్టమ్ డ్రైవ్‌లను దొంగిలించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 వెర్షన్ 1809 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్, x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 1909 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్, x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 2004 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 20 హెచ్ 2 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 21H1 32-బిట్ సిస్టమ్స్, ARM64 -ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ సర్వర్ 2019 విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్) విండోస్ సర్వర్, వెర్షన్ 2004 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఆపిల్ సాఫ్ట్వేర్ ఆపిల్ మాకోస్ బిగ్ సుర్ వెర్షన్లు 1 ఆపిల్ iOS 14.7.1, ఐప్యాడ్ వెర్షన్లు ఐఫోన్ 6 తరువాత విడుదలై ఐఫోన్ 6వెర్షన్లు ఐప్యాడ్ ప్రో (డివైజెస్) ఐప్యాడ్ ఎయిర్ 2 తో పాటు వాటి వెర్షన్లు ఐప్యాడ్ 5 తో పాటు వాటి వెర్షన్లు ఐప్యాడ్ మినీ 4 తో పాటు వాటి వెర్షన్లు ఐపాడ్ టచ్ (7 వ తరం) మాక్ ఓస్ బిగ్ సుర్ వెర్షన్లను అప్ డేట్ చేయాలని కోరింది. -
ఆపిల్ నుంచి కొత్త ఐప్యాడ్.. రిలీజ్ ఎప్పుడంటే ?
టెక్నాలజి దిగ్గజం ఆపిల్ నుంచి మరో రెండు ఐప్యాడ్లు రాబోతున్నాయి. అధునాత ఫీచర్లతో ఈ ఐ ప్యాడ్లను ఆపిల్ రిలీజ్ చేయబోతుంది. ఓఎల్ఈడీ టెక్నాలజీతో, హై రిఫ్రెష్ రేట్‌తో ఈ ఐ ప్యాడ్లను రూపొందిస్తోంది ఆపిల్. 2022లో వచ్చే సంవత్సరంలో 10.86 అంగులాల ఐప్యాడ్‌ను రిలీజ్ చేయనుంది. ఇందులో ఉన్న ఓఎల్ఈడీ డిస్ప్లేకు సపోర్ట్‌గా థిన్ ఫిల్మ్ ఎన్క్యాప్సులైజేషన్ టెక్నాలజీ ఉపయోగించినట్టు ‘జీఎస్ఎం ఆరేనా’ పేర్కొంది. ఇది గాలిలో తేమ, ఆక్సిజన్ ఇతర కారణాల వల్ల ఓఎల్ఈడీకి అదనపు రక్షణ కల్పిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐ ప్యాడ్ ఎయిర్‌కు నెక్ట్స్ వెర్షన్‌లా రాబోతుంది. 2023లో ఎల్టీపీవో టెక్నాలజీ ప్యానెళ్లతో మరో ఐ ప్యాడ్‌ను మార్కెట్లోకి ఆపిల్ తేనుంది. 12.9 అంగులాలు, 11 అంగులాల డిస్ప్లేలతో రెండు వేరియంట్లుగా ఈ మోడల్ని రూపొందిస్తోంది. డిస్ప్లే రిఫ్రెష్ రేటును 120 హెర్జ్‌గా ఇవ్వబోతుంది. ఐప్యాడ్‌ని మాక్సిమమ్ రిఫ్రేష్ రేటులో ఉపయోగిస్తున్నా.. బ్యాటరీ త్వరగా డ్రైన్ అవకుండా ఎల్టీపీవో టెక్నాలజీ సాయం చేస్తుంది. ఈ ఐ ప్యాడ్‌ని 2023లో రిలీజ్ చేసేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఆపిల్ వాటా ప్రస్తుతం ఇండియాలో ట్యాబెట్ల మార్కెట్లో ఆపిల్‌కి 29 శాతం వాటా ఉంది. మార్కెట్లో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి వెళ్లేందుకు కన్నేసిన ఆపిల్ వరుసగా కొత్త మోడళ్లు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసింది. చదవండి : పేటిఎమ్‌లో రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్‌లు -
ఆ హెడ్‌ఫోన్స్ ధర రూ.59,900
ముంబై, సాక్షి: మొబైల్ ఫోన్ల రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ కంపెనీ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైర్లెస్ హెడ్ ఫోన్లు డిసెంబర్ 15వ తేదీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి. 2016లో తీసుకొచ్చిన ఏర్‌పాడ్స్ మ్యాక్స్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెడ్ఫోన్ల కోసం ఈ క్షణం నుంచే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 15 తర్వాతే దిగుమతి, ఎగుమతులను అనుమతిస్తారు. వీటి ధరను 549 పొండ్లు (53 వేల రూపాయలు)గా నిర్ణయించారు. ఏర్‌పాడ్స్ 159 పౌండ్లు, ఏర్‌పాడ్స్ ప్రోను 249 పొండ్లకు విక్రయించగా హెడ్ ఫోన్లకు వాటికన్నా ఎక్కువ ధరను ఖరారు చేశారు. ఇందులో బయటి నుంచి వచ్చే ధ్వనులను గణనీయంగా తగ్గించడంతోపాటు వినేవారి చెవుల నిర్మాణం తీరునుబట్టి లో ఫ్రీక్వెన్సీ లేదా మధ్యస్థ ఫ్రీక్వెన్సీలోకి దానంతట అదే మారేందుకు హెడ్ఫోన్ల అవుట్ పుట్‌ను మార్చేందుకు అందులో ‘అడాప్టివ్ ఈక్యూ’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆపిల్ కంపెనీ వర్గాలు వివరించాయి. ఆకుపచ్చ, నీలి, గులాబీ, గోధుమ, రజితం రంగుల్లో హెడ్ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంతకు ఒక్క రోజు ముందు నుంచి, అంటే డిసెంబర్ 14వ తేదీ నుంచి కొత్త ఫిట్నెస్ యాప్‌ను ఆపిల్ కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. నెలకు దీని సబ్ స్క్రిప్షన్ 9.99 పౌండ్లకు (989 రూపాయలు), అలాగే 9.99 డాలర్లకు సబ్స్క్రిప్షన్లు అందుబాటులో ఉంటాయని, ఈ యాప్ ద్వారా వివిధ రకాల ఫిట్నెస్ వీడియోలను, యోగా , డ్యాన్సింగ్ వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా అమ్మకాలలో భాగంగా 25 దేశాలు, ప్రాంతాలకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఐప్యాడ్లు తదితర యాపిల్ డివైస్‌లు ఐవోఎస్ 14.3 లేదా తదుపరి అప్‌గ్రేడ్‌తో పనిచేస్తాయని ఐఫోన్ల దిగ్గజం యాపిల్ పేర్కొంది. మ్యాక్ ఓఎస్ బిగ్ 11.1 లేదా తదుపరి అప్‌గ్రేడ్స్ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. యాపిల్ వాచీలయితే ఓఎస్ 7.2, టీవీలకు ఓఎస్14.3 కంపాటిబుల్‌గా పేర్కొంది. చదవండి: (రూ. 13,000లలో నోకియా లేటెస్ట్ ఫోన్) హెచ్1 చిప్ ప్రపంచవ్యాప్తంగా హెడ్‌ఫోన్స్‌లో ఎయిర్‌పోడ్స్ జనాదరణ పొందినట్లు యాపిల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గ్రెగ్ జాస్వియక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ ద్వారా అత్యంత నాణ్యతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చని తెలియజేశారు. ఆధునిక డిజైన్, ప్రతిభావంతమైన హెచ్1 చిప్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తదితరాల కారణంగా వినియోగదారులు అత్యుత్తమ వైర్లెస్ ఆడియోను ఆనందించవచ్చని వివరించారు. ఎడాప్టివ్ ఈక్విలైజర్ కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర శబ్దాలను తగ్గిస్తుందని(నాయిస్ రిడక్షన్) పేర్కొన్నారు. కానీ దీని ధరపై కొంత మంది నిపుణులతో పాటు, ఆపిల్ లవర్స్ కూడా పెదవి విరుస్తున్నారు. -
ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు
ప్రతీ ఏడాది లాగానే సెప్టెంబరులో నిర్వహించే ఆపిల్ ఈవెంట్ 2020ని కూడా కాలిఫోర్నియాలో నిర్వహించింది. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్ లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ ఊహించినట్టుగానే ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ ఎస్ఈ ఐప్యాడ్ 8వ జెన్, ఐప్యాడ్ ఎయిర్ (2020)ను లాంచ్ చేశారు. అలాగే ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 12 సిరీస్ తీసుకొస్తున్నట్టు కుక్ ప్రకటించారు. ముఖ్యంగా ఐప్యాడ్ ఆపరేటింగ్ సిస్టం 14, వాచ్ఓఎస్ 7 నేడు (సెప్టెంబర్ 16 న) విడుదల చేయనున్నట్లు ఆపిల్ ప్రకటించింది. "టైమ్ ఫ్లైస్" ఈవెంట్ గా పేర్కొన్న వర్చువల్ షోలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 2020ను ఆవిష్కరించలేదు. ఐప్యాడ్ ఎయిర్ 4 టచ్ ఐడి, ఎ14 బయోనిక్ ప్రాసెసర్ యుఎస్బి-సి కనెక్టివిటీని కలిగి ఉన్నడిజైన్తో కంపెనీ విడుదల చేసింది.నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ న్యూరల్ ఇంజిన్‌తో సరికొత్త చిప్‌ను పొందడం దాదాపు తొమ్మిది సంవత్సరాలలో ఇదే మొదటిసారి ఐప్యాడ్ ఎయిర్ 4 స్పెసిఫికేషన్స్ 10.9 అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్ రెటీనా డిస్ప్లే 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 7 మెగాపిక్సెల్ సెల్ఫీ హెచ్డి కెమెరా ఇది అక్టోబరునుంచి ఆపిల్ స్టోర్లలో లభ్యం కానుంది. ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై మోడల్స్ ప్రారంభ ధర 54,900 రూపాయలు. వై-ఫై + సెల్యులార్ మోడల్స్ 66,900 రూపాయల నుండి ప్రారంభం. 64 జీబీ, 256 జీబీ కాన్ఫిగరేషన్లలో సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్ స్కై బ్లూ ఐదు కలర్స్ లో లభ్యం. ఐప్యాడ్ 8 ఇన్ బిల్ట్ టచ్ ఐడి, హోమ్ బటన్ ఫీచర్లతో కొత్త ఐప్యాడ్ 7వ తరం మాదిరిగానే ఉంది. ఏ10 ఫ్యూజన్ చిప్ షాట్ కొత్త అప్‌గ్రేడ్.10 గంటల బ్యాటరీ లైఫ్ మరో ప్రత్యేకత. ఆపిల్ పెన్సిల్, ఐప్యాడ్ ఓస్14, 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫేస్‌టైమ్ హెచ్డీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉ న్నాయి. ఏ12 బయోనిక్ చిప్, టచ్ ఐడీ, స్మార్ట్ కీబోర్డ్ కవర్ ఆపిల్ పెన్సిల్ లాంటి వాటితో తీసుకొచ్చింది. వై-ఫై మోడల్ 29,900 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. వై-ఫై + సెల్యులార్ 41,900 రూపాయలు. 32 జీబీ, 128 జీబీ కాన్ఫిగరేషన్లలో సిల్వర్, స్పేస్ గ్రే, గోల్డ్ ఫినిష్ రంగుల్లో లభ్యం. ఆపిల్ వాచ్ సిరీస్ 6 మిగిలిన అన్ని అద్భుతమైన ఫీచర్లతోపాటు, పల్స్ ఆక్సీమీటర్ అవసరం లేకుండానే పల్స్ తెలుసుకునే ఫీచర్ లో ఇందులో జోడించింది. 40ఎంఎం, 44ఎంఎం సైజుల్లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో ప్రాసెసర్ గతంకంటే 20 శాతం వేగంగా పనిచేస్తుంది. రెడ్ బ్యాండ్ ఎడిషన్‌తో తీసుకొచ్చిన తొలి ఆపిల్ వాచ్ ఇది. ఈ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆపిల్ చారిటీలకు అందిస్తుంది. ఏడు రంగులలో లభ్యం. ఆపిల్ వాచ్ సిరీస్ 6 ధర భారతదేశంలో 40,900 రూపాయల నుంచి ప్రారంభం. ఆపిల్ వాచ్ ఎస్ఈ ఆటోమేటిక్ లొకేషన్ నోటిఫికేషన్లు, స్కూల్ టైం మోడ్ లాంటి కొత్త ఫీచర్లతో ఎక్కువగా పిల్లలకు ఆకర్షించనుంది. ఆపిల్ వాచ్ ఫ్యామిలీ సెటప్ తో దీన్ని తీసుకొచ్చింది. ఒకే ఐఫోన్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆపిల్ వాచెస్‌ను పెయిర్ చేసుకోవచ్చు. అయితే ఈ స్మార్ట్ వాచెస్ భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టం చేయలేదు. త్వరలోనే అని ప్రకటించింది. ఆపిల్ వాచ్ ఎస్ఇ జీపీఎస్ మోడల్ ధర రూ. 29,900 నుంచి ప్రారంభం సెల్యులార్ మోడల్ 33,900 రూపాయలు. -
మరింత సన్నటి ‘ఐప్యాడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఆపిల్ ఇప్పటివరకు లేనంత సన్నని (మందం తక్కువ) ఐపాడ్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను తీసుకొస్తున్నట్లు ఆపిల్ కంపెనీ విశ్లేషకులు మింగ్ చీ క్యూ సూత్రప్రాయంగా మీడియాకు తెలియజేశారు. ఐపోడ్, మ్యాక్‌బుక్ ప్రోలలో ఆరు సన్నటి మోడళ్లు 2020 సంవత్సరానికి మార్కెట్లోకి వస్తాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు మందంగా 0.29 అంగుళాల మోడళ్లలో ఓ ఎల్ఈడీ లైట్లను ఉపయోగించగా, మందం తక్కువ సన్నటి మోడళ్లలో స్క్రీన్ డిస్ ప్లే కోసం చిన్న ఎల్ఈడీ లైట్లను, సన్నటి పిక్చల్స్‌ను ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. ఆరు సన్నటి మోడళ్లు వచ్చే ఏడాది ఏ నెలలో మార్కెట్లోకి వస్తాయో, వాటి ధర ఎంత ఉండవచ్చో మింగ్ చీ క్యూ వెల్లడించలేదు. సన్నటి మోడళ్లలో 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. -
రూ.15వేలకే ఐఫోన్, ఐప్యాడ్లు
న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. మీ ప్రియమైన వారికి ఆపిల్ డివైజ్‌తో సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్‌పై హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా అధికారిక డీలర్ల వద్ద ఆపిల్ డివైజ్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. ఐఫోన్లపై డిస్కౌంట్లు : ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6 పై 7 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఇది కేవలం హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై మాత్రమే కొనుగోలు చేయాలి. అది కూడా ఈఎంఐ రూపంలోనే వర్తిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ (32GB) రూ.22వేలుగా ఉంది. 7 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ.15వేలకే ఐఫోన్ ఎస్ఈ లభిస్తోంది. ఐఫోన్ 6 పైన కూడా ఇదే విధమైన ఆఫర్ అందిస్తోంది. ఐపాడ్స్‌పై భారీ ఆఫర్లు : ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ 4, ఐప్యాడ్ ప్రొ ఈఎంఐ లావాదేవీలపై రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తోంది. దీంతో 9.7 అంగుళాల వై-ఫై ఓన్లీ మోడల్ ఐప్యాడ్(32జీబీ స్టోరేజ్) అత్యంత తగ్గింపుకు వస్తోంది. ప్రస్తుతం రూ.25వేలకు విక్రయిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్, 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో కేవలం రూ.15వేలకు మాత్రమే లభిస్తోంది. ఐఫోన్ షోరూమ్‌లు, ప్రముఖ మొబైల్ షాపుల్లో హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఇదే రకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లపై కూడా హెచ్డీఎఫ్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డివైజ్‌ను ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ 2018 మార్చి 11 వరకు అందుబాటులో ఉంటుంది. -
అమెజాన్ ఆపిల్ ఫెస్ట్: డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా రెండు రోజుల ఆపిల్ ఫెస్టివల్‌కు తెరతీసింది. ఈ ఫెస్టివల్లో ఐఫోన్లు, వాచ్‌లు, ఐప్యాడ్లు, ఐమ్యాక్‌లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. నేడు, రేపు ఈ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుహోల్డర్స్పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఐఫోన్ 7, ఐఫోన్6, ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డివైజ్ ధర రూ.56,200 కాగ, ఈ ఫోన్ 11,201 రూపాయల డిస్కౌంట్‌తో 44,999 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత డివైజ్‌తో ఎక్స్చేంజ్లో ఐఫోన్ 7ను కొనుగోలు చేయాలనుకుంటే 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక 32జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 6 ధర 29,500 రూపాయలు కాగ, ఈ డివైజ్ కూడా 3,501 రూపాయల డిస్కౌంట్లో 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 6పై కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 14,920 రూపాయల వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఆపిల్‌కు చెందిన మరో ఫేమస్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎస్ఈ కూడా డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎస్ఈ అసలు ధర 26వేల రూపాయలు కాగ, 7,001 రూపాయల డిస్కౌంట్లో 25,999 రూపాయలకే ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌పై కూడా 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లపై 3000 రూపాయల తగ్గింపు, ఐప్యాడ్లపై ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐలు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. -
అమెరికా ఆఫీసుల్లో వాటిపై నిషేధం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని తమ దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు లాంటి పరికరాలను తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. చెన్నై కేంద్రంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇప్పటికే నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా తమ అన్ని కేంద్రాల్లోనూ అమెరికా ఇలాంటి చర్యలే చేపట్టింది. యూఎస్ ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను పెంచేందుకే ఈ మార్పులు చేస్తున్నామని ఢిల్లీ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లతో పాటు నెట్బుక్స్, క్రోమ్‌బుక్స్, ఐపాడ్లు, కిండిల్స్, మ్యాక్‌బుక్స్‌లను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులను మొబైల్ఫోన్లతో అనుమతిస్తామని చెప్పారు. చెన్నై కార్యాలయంలో మొబైల్ఫోన్లను కూడా అనుమతించబోమన్నారు. సందర్శకుల ఎలక్ట్రానిక్ వస్తువులు కార్యాలయం వెలుపల పెట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవని వెల్లడించారు. -
పిల్లలకూ ఐప్యాడ్స్ ఇష్టమే
న్యూయార్క్: నేటి తరంలో చిన్న పిల్లలు సైతం టెక్నాలజీని త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఐపాడ్స్, ల్యాప్టాప్స్.. ఇలా దేని గురించైనా తెలుసుకోవడంలో ముందుంటున్నారు. సరిగ్గా మాట్లాడడం రాని పిల్లలు సైతం వీడియోగేమ్స్ అంటే ఇష్టపడుతున్నారు. ఏడాది వయసున్న చిన్నారులు సైతం ఐప్యాడ్స్ వినియోగించగలరని తాజా అధ్యయనం వెల్లడించింది. రెండేళ్ల వయస్సుకు చేరేలోపు ఐప్యాడ్ వినియోగంలో వారు మరింతగా ఆరితేరిపోతున్నారని కూడా యూనివర్సిటీ ఆఫ్ లోవా పరిశోధకులు తెలిపారు. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన చిన్నారులకు చెందిన అనేక వీడియోల్ని వారు విశ్లేషించారు. వారి పరిశీలన ప్రకారం ఏడాది వయసున్న చిన్నారుల్లో సగం మంది ఐపాడ్ వినియోగించగలిగితే, మరో ఏడాదిలోపు వీరిలో 90 శాతం మంది మాస్టర్స్ అనే స్థాయికి ఎదుగుతున్నారు. పరిశీలకులు విశ్లేషించిన వీడియోల్లో 12-17 నెలల వయసు పిల్లలు సాంకేతిక విషయంలో మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఈ పరిణామం భవిష్యత్‌లో చిన్నారుల చదువుల కోసం మంచి యాప్స్ రూపొందించేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
యాపిల్ కంపెనీ మనదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి.. యాపిల్ కంపెనీకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఊ అన్నా.. ఆ అన్నా కూడా ఆయనకు యాపిల్ ఐప్యాడ్లే గుర్తుకొస్తున్నాయి. అవి దేనికి ఉపయోగపడతాయో, ఎందుకు ఉపయోగపడతాయో కూడా ఆలోచించకుండా ఎడాపెడా ఐప్యాడ్లు ఇచ్చేస్తానంటూ చెబుతున్నారు. నిన్న కాక మొన్న రైతులకు ఐప్యాడ్లు ఇస్తానన్న సీఎం.. తాజాగా ఉపాధ్యాయులకు కూడా అదే వరం ప్రకటించేశారు. ఉపాధ్యాయ దినోత్సవం చేయడంలో తనకు తానే సాటి అని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా.. వాటిని కాదనుకుని మరీ గుంటూరులో జరుగుతున్న గురుపూజోత్సవానికి హాజరయ్యానని చెప్పారు. మండలానికో ఉత్తమ ఉపాధ్యాయుడిని, ఉత్తమ విద్యార్థిని ఎంపిక చేస్తామని, విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ కింద ప్రతినెలా స్టైపండ్ ఇస్తామని తెలిపారు. అవన్నీ బాగానే ఉన్నా.. ఉపాధ్యాయులకు, రైతులకు ఐప్యాడ్లు ఎలా ఉపయోగపడతాయన్నది మాత్రం ఇంకా బ్రహ్మపదార్థంగానే ఉంది. -
హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు!
హైదరాబాద్: రాష్ట్రంలోని హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ స్ట్రీట్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. వచ్చే కేబినెట సమావేశం పూర్తిగా ఇన్కేబినెట్ మీటింగ్దేనని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంత్రులందరికి లాప్టాప్, ఐపాడ్ల అందజేస్తామని... వాటి సహయంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు.