ఐపాడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వాట్సాప్ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్ యూజర్లు వినియోగించేలా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2019 నుంచి మల్టీ డివైజ్ 2.0 పేరుతో మల్టీ డివైజ్ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్..ఈ ఏడాదిలో ఊహించని విధంగా ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందించింది.
అయితే తాజాగా ఈ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్‌లలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. యూజర్లు వాట్సాప్‌ను ఫోన్‌తో పాటు వాట్సాప్ వెబ్, పోర్టల్, డెస్క్ ట్యాప్, ఫోన్ లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఐపాడ్ లో కూడా అందుబాటులోకి రానుంది.
Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption.
— Will Cathcart (@wcathcart) July 14, 2021
Learn more: https://t.co/AnFu4Qh6Hd
అంతేకాదు వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. కాగా భవిష్యత్‌లో ఐపాడ్ కాకుండా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో మల్టీ డివైజ్ ఆప్షన్ ను అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment