హైదరాబాద్: ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు.. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి వైద్యురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహియా తరన్నం (24) ఈ నెల 3న ఎప్పటిలాగే ఉదయం సబ్జా కాలనీలోని తన నివాసం నుంచి విధులకు వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి మహ్మద్ గఫార్‌కు వాట్సాప్ కాల్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని తన కోసం వెతకవద్దంటూ చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు.
గత 8 నెలలుగా ఆమెతో పాటు వైద్యుడిగా పని చేస్తున్న నదీమ్‌తో.. పరిచయం ఏర్పడిందని.. బిహార్‌కు చెందిన అతను మాయమాటలు చెప్పి మహియా తరన్నంను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment