woman missing
-
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు. -
అమ్మా.. నేను సూర్యతో వెళ్లిపోతున్నా!
రాప్తాడు రూరల్: ‘అమ్మా నా కోసం ఎక్కడా వెతకొద్దు. ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్తున్నా’ అంటూ లేఖ రాసి ఓ యువతి అదృశ్యమైన ఘటన గురువారం అనంతపురం రూరల్ మండలం కురుగుంటలో వెలుగు చూసింది. అనంతపురం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు... కురుగుంటలో నివాసముంటున్న ముస్లిం దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాడు. కుమారుడు బైకు మెకానిక్‌గా పని చేస్తుండగా, 22 ఏళ్ల వయసున్న కుమార్తె నగరంలోని ఓ షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తూ వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో తల్లి ఇంట్లో పరిశీలించగా ఓ లేఖ లభించింది. అందులో ‘అమ్మా... నేను సూర్య అనే యువకుడిని ప్రేమించా. ఆయనతోనే వెళ్తున్నా. మీరు నా కోసం వెతకొద్దు. విజయవాడ వెళ్తున్నా. వాళ్ల అమ్మానాన్న కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇంట్లో బంగారు, డబ్బులేవీ తీసుకెళ్లడం లేదు. అన్నా... అమ్మను బాగా చూసుకో’ అంటూ రాసి ఉంది. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న అనంతపురం రూరల్ పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.యువతి అదృశ్యంకదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్లో నివాసముంటున్న యువతి కనిపించడం లేదు. ఈ మేరకు తల్లి ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బంధువుల అబ్బాయితో ఈ నెల 18న ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ఫంక్షన్ హాల్లో ఆమెకు వివాహ నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కదిరికి చెందిన మునివర్ధన్ (గజ), చిన్నాన్న పవన్ కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. -
Hyderabad: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
వెంగళరావునగర్: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు నామవరపు జ్యోత్స్న శ్రీ (17) భద్రాచలంలో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివింది. అనంతరం ఆమెను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ తల్లి రజిని భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బైపీసీలో వేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న జ్యోత్స్నశ్రీ తనకు ఇంగ్లిష్ పాఠాలు అర్థం కావడం లేదంటూ చదువు మానేసి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని తన పిన్ని స్వరూప ఇంటికి వచి్చంది. భర్తతో విభేదాలు రావడంతో గత ఏడాది నుంచి జ్యోత్స్నశ్రీ తల్లి కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది. నాలుగురోజులుగా ఆ యువతి అమీర్‌పేటలోని ఓ షోరూంలో పని చేస్తుంది. ఆమె సరిగ్గా పని చేయకపోవడంతో షాపు ఓనర్ నాగమణి యువతి తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇటీవల యువతి తల్లి భద్రాచలం వెళ్లింది. అక్కడ నుంచి తన కుమార్తెకు ఫోన్ చేసి అటు చదువుకోకపోగా పని కూడా సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ మందలించింది. దాంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేకని సమయంలో ఆ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచి్చన స్వరూప తలుపు గడియకూడా పెట్టకుండా ఉండటంతో లోపలకు వెళ్లింది. స్వరూపకు జ్యోత్న్స ఉరేసుకుని ఉండటం చూసి 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి పిన్ని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మా కూతురిని వెతికిపెట్టండి
గోనెగండ్ల: తమ కూతురు కనిపించకుండా పోయి 56 రోజులైనా జాడ లేదని, దయచేసి వెతికిపెట్టాలని మండల కేంద్రానికి చెందిన రూపేంద్రరెడ్డి, రామేశ్వరమ్మ దంపతులు పోలీసులను వేడుకున్నారు. ఏప్రిల్ 21న కూతురు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టకపోవడంతో దంపతులు శనివారం స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే తమ కూతురిని బేతంచర్ల మండలం శంకలాపురం గ్రామానికి చెందిన మధు అనే యువకుడు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్లు తెలిసిందన్నారు. ఇదే విషయాన్ని ఏప్రిల్ 21న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకుని, పోలీసులు చేతులు దులిపేసుకున్నారన్నారు. ఇప్పటికై నా పోలీసులు తమ కూతురి జాడ కనిపెట్టి, తమకు దక్కేలా చేయాలని, లేనియెడలా తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు తెలిపారు. ఇదే విషయమై సీఐ రామకృష్ణయ్యను ఆరా తీయగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. బా లిక, నిందితుడి సెల్ఫోన్లు కూడా ట్రెస్ కావడం లేదన్నారు.అయినా త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. -
గోవా: మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
పనాజీ: గోవాలో అదృశ్యం అయిన నేపాల్‌లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్ కుమార్తె ఆర్తీ హామల్ ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించింది. ఆర్తీ హామల్ రెండు రోజుల క్రితం గోవాలో అదృశ్యమైన విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అదృశ్య ఘటనపై కేసు నమోదు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులకు ఆమె ఆచూకీ లభించింది. ఆమె నార్త్ గోవాలోని మాండ్రేమ్లో ఓ హెటల్లో కనిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెతో మరో ఇద్దరు మహిళలతో ఆమెను ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నామని పోలీసులు తెలిపారు. ఆర్తీ హామల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్ మీడియా పేర్కొంది. ఆర్తీ స్నేహితురాలు ఆమె తండ్రికి అదృశ్యం విషయం తెలియజేయగా ఆయన సోషల్ మీడియా వేదికగా తమ కూతురి ఆచూకీ తెలియజేయాలని కోరారు. ‘ఆర్తీ నా పెద్ద కూతురు. ఆమె ఓషో ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. గోవా ఉండేవారు నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా’అని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. అదేవిధంగా తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయల్దేరారని తెలిపారు. తన కూతురును వెతకటంలో సాయం అందించాలని ఆచూకీ తెలియటంతో తమను సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను జత చేశారు. -
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్‌తో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్‌వాక్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి
హైదరాబాద్: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లీశ్వరీ అనే యువతి గత కొంతకాలంగా మధురానగర్ డివిజన్ పరిధిలోని స్టేట్‌హోంలో ఉంటూ సమీపంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఇన్‌స్ట్రాగాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థరాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్‌హోం ఇన్చార్జి ముంతాజ్‌బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్య..
శివ్వంపేట(నర్సాపూర్): భర్త ప్రశ్నించడంతో వివాహిత అదృశ్యమైన ఘటన శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌కు 2013లో తూప్రాన్ మండలం యావపూర్ గ్రామానికి చెందిన కాగిత అనురాధతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అనురాధ సోమవారం ఫోన్లో మాట్లాడుతుండగా భర్త ప్రశ్నించడంతో గొడవపడింది. చిట్టి డబ్బులు కట్టడానికని ఆమె మంగళవారం ఇంట్లోంచి వెళ్లి సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బీరువాలో ఉన్న రూ.50 వేలు కనిపించలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఆస్ట్రేలియా వెళ్తున్నా.. నా కోసం వెతకొద్దు
హైదరాబాద్: ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు.. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి వైద్యురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహియా తరన్నం (24) ఈ నెల 3న ఎప్పటిలాగే ఉదయం సబ్జా కాలనీలోని తన నివాసం నుంచి విధులకు వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి మహ్మద్ గఫార్‌కు వాట్సాప్ కాల్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని తన కోసం వెతకవద్దంటూ చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. గత 8 నెలలుగా ఆమెతో పాటు వైద్యుడిగా పని చేస్తున్న నదీమ్‌తో.. పరిచయం ఏర్పడిందని.. బిహార్‌కు చెందిన అతను మాయమాటలు చెప్పి మహియా తరన్నంను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హుస్సేన్‌సాగర్ నాలాలో మహిళ గల్లంతు?
హైదరాబాద్: కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు నాలాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. వందమంది సిబ్బంది నాలుగు బృందాలుగా నాలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కోసం డ్రోన్లనూ వినియోగించారు. సోమవారం కవాడిగూడ నుంచి గోల్నాక వరకు దాదాపు 10 కి.మీ.ల మేర గాలింపు జరిపినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
ప్రియుడి గొడవ.. ‘అమ్మా.. అందరి ముందు పరువు పోయింది’ అంటూ
సాక్షి, మేడ్చల్: అమ్మా.. అందరి ముందు నా పరువు పోయిందని లేఖ రాసి ఇంట్లో పెట్టిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి సుతారిగూడలో చోటు చేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25) రెండేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమించింది. కొన్ని రోజులుగా అతడితో మాట్లాడటం మానేసింది. ఈ నెల 9న రాత్రి సమయంలో ప్రేమించిన యువకుడు మద్యం మత్తులో శైలజ ఇంటికి వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోయాడు. దీంతో మరుసటి రోజు 10వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా శైలజ వెళ్లిపోయింది. ఇంట్లో లెటర్ కనిపించింది. అందులో ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. నా కోసం వెతకకండి’ అంటూ శైలజ లేఖలో పేర్కొంది. దీంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ రావడంతో బయటకు వెళ్లి.. ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కండ్లకోయలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండం వెంకటేశ్వరి(22) కొంత కాలంగా ఓ అపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమెకు ఫోన్ వచ్చింది. దీంతో ఫొన్ మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు -
జ్యూస్ కోసం బయటకు.. మధుమిత మిస్సింగ్! అతనిపైనే అనుమానం
హైదరాబాద్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వర్లు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన తపన్ కుమార్ గిరి, మధుమిత డగారా(22) ఏడాది క్రితం జల్పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. స్థానికంగా ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీలో మధుమిత పని చేస్తోంది. 10వ తేదీన అనారోగ్యంగా ఉందని ఇంటి వద్దే ఉన్న మధుమిత.. మధ్యాహ్నం సమయంలో జ్యూస్ తీసుకొస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెతో పాటు కంపెనీలో పనిచేసే బినేష్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గానీ 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
యువతి అదృశ్యం
హుజూర్నగర్: పట్టణంలోని దద్దనాలచెరువు కాలనీకి చెందిన యువతి అదృశ్యమైనట్లు శుక్రవారం ఫిర్యాదు అందిందని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. దద్దనాలచెరువు కాలనీకి చెందిన షేక్ రిహానా, ఖాజామియా దంపతులకు కుమారుడు, కుమార్తె షేక్ షఫియా సంతానం. షఫియా ఇంటి వద్దనే ఉంటోంది. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షఫియా బ్యాగులో బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా షఫియా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఆమె తండ్రి ఖాజామియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫిలింనగర్లో ఇద్దరు యువతుల అదృశ్యం... ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
నగరం పరిధిలో ఇటీవల అదృశ్యం కేసులు ఎక్కువ అవుతున్నాయి. సిటీ నలుమూలలా ఏదో ఒక చోట బాలిక లేదా బాలుడు లేదా యువతీయువకులు అదృశ్యమయ్యారని ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. వీరంతా ఏమయ్యారో తెలియక బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఇలా నాలుగు పోలీస్ స్టేషన్లలో అదృశ్యం ఫిర్యాదులు అందాయి. – సాక్షి, నెట్వర్క్ డిగ్రీ విద్యార్ధిని అదృశ్యం నల్లకుంట: డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరాల మేరకు..సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ తుమ్మ యాదగిరి కుమార్తె శ్రావ్య (21)కు ఇటీవలే వివాహమైంది. కాగా 2021లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతూ నల్లకుంట శంకరమఠం సమీపంలోని హాస్టల్లో ఉంటుంది. ఇటీవల ఇంటికి వెళ్లిన ఆ యువతి ఈ నెల 15న హాస్టల్‌కు వచ్చింది. ఈ క్రమంలో 17న సాయంత్రం తండ్రి యాదగిరి కుమార్తెను చూడడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. హాస్టల్ నిర్వాహకులను విచారించగా శ్రావ్య ఈ నెల 16న సాయంత్రం 8 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారిని విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన యాదగిరి తమ కుమార్తె కనిపించడంలేదంటూ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్‌లో ఇద్దరు పిల్లలు.. మేడ్చల్ రూరల్: నిత్యం ఇంట్లో ఉండే అన్నా చెల్లెలు ఇద్దరు తండ్రి పనికి వెళ్లొచ్చేసరికి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన బ్రహ్మదేశ్ పాశ్వాన్–బబ్లీదేవి దంపతులు మేడ్చల్ పట్టణానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు అజయ్‌కుమార్ (7), ప్రతిభ (5)లు సంతానం. కాగా మూడేళ్ల క్రితం దంపతులు విడాకులు తీసుకోవడంతో పిల్లలు తండ్రి వద్ద ఉంటున్నారు. నిత్యం పిల్లలకు భోజనం తినిపించి ఇంటి వద్దే ఉంచి తండ్రి సెంట్రింగ్ పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన రోజులాగే ఉదయం 7 గంటలకు పనికి వెళ్లిన బ్రహ్మదేవ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చేసరికి పిల్లలు అజయ్‌కుమార్, ప్రతిభ ఇంట్లో కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనుమడిని చూసేందుకొచ్చిన వృద్ధురాలు.. వెంగళరావునగర్: నగరంలో నివసిస్తున్న మనుమడిని చూడటానికి వచ్చిన ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఒంగోలులో నివసించే డి.అచ్చమ్మ (70) వెంగళరావునగర్ డివిజన్ వీడియోగల్లీలో నివసించే మనుమడి ఇంటికి మూడు రోజుల కిందట వచ్చింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అచ్చమ్మ తిరిగి రాలేదు. మనుమడు వెంకటేశ్వర్లు బంధుమిత్రులకు ఫోన్ల ద్వారా సమాచారం తెలియజేసి విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం మధురానగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అచ్చమ్మ నలుపు రంగు ఉండి. దాదాపు 4.8 అడుగులు ఎత్తు ఉంటుందని, కొద్దిగా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనుమడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫిలింనగర్లో యువతి... ఫిలింనగర్: అనుమానాదస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన అంకిత(19) డెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నది. ఎప్పటిలాగే ఆదివారం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. తండ్రి ఊషన్న అన్ని ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తన కూతురు కనిపించడంలేదు అని ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. -
యువతి అదృశ్యం
మెదక్: యువతి అదృశమైన సంఘటన మండల పరిధి చెండిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నర్మద గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం యువతి తండ్రి భూపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
Hyderabad: భర్తతో గొడవపడి.. భార్య అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... హయత్‌నగర్ డివిజన్ సూర్యానగర్‌లో నివసించే మహీంద్రారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష(25) బుధవారం రాత్రి గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఈ విషయమై భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీషపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మహీంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు -
ఈషా యోగా సెంటర్ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన పళణి కుమార్ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది. దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..
చిత్తూరు అర్బన్: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ -
Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్ తెలిపిన మేరకు.. మహమ్మద్ కాజా పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్‌నగర్‌లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్ కనిపించలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భర్తతో విడాకులు.. ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి..
సీతమ్మధార(విశాఖపట్నం): ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో.. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకానగర్, మొదటి లేన్‌లోని పవన్ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న సింహాచలం నాయుడు కుమార్తె రామలక్ష్మి వివాహిత. భర్తతో విడిపోవడంతో తండ్రి వద్ద ఉంటూ, చుట్టుపక్కల ఇంటి పనులకు వెళ్లి వస్తుంటుంది. ఈ నెల ఐదో తేదీన పనికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కుమార్తె రాకపోవడంతో, బంధువులు, స్నేహితులను వాకబు చేశారు. వారు రాలేదని తెలపడంతో బుధవారం ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని హెచ్‌సీ కె.అప్పలరాజుకు సూచించారు. -
మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి
సాక్షి, రంగారెడ్డి: ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదంండ్రులకు సందేశం పంపిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాంకాలనీకి చెందిన తాడాల శ్రీనివాస్‌రావు కుమార్తె ప్రత్యూష(24) మెడిసిన్ కోర్సు చదివి రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటుంది. ఈనెల 18న ఉదయం 10గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ కాలేజీలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లిన ప్రత్యూష 19వ తేదీన ఉదయం 8గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో మెసేజి పెట్టింది. ఆందోళనకు గురైన తల్లి గంగాభవానీ పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నీతో ఉండను నన్ను వెతకొద్దు.. వెతికితే చస్తా..!
సాక్షి, హయత్‌నగర్ (హైదరాబాద్): నన్ను వెతకకండి.. ఒకవేళ వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు ఫోన్లో మెసేజ్ పెట్టి ఓ వివాహిత అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌కు చెందిన తిరందాస్ ప్రసాద్‌కు ఆరేళ్ల క్రితం పూజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. చిన్న తగాదాల కారణంగా రెండు వారాల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల క్రితం భర్త ప్రసాద్ వెళ్లి రాజీ కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం నాగోల్‌లోని తన అత్త ఇంటికి వెళుతున్నానని చెప్పి పూజ తన పిల్లలను తీసుకుని వెళ్లింది. తర్వాత తాను నీతో ఉండను.. నన్ను వెతక వద్దు, వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తన మొబైల్ నుంచి భర్తకు వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు) -
Hyderabad: వంశీతో వెళ్లిపోతున్నానని రాసి పెట్టి..యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో ఓ యువతి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడామేస్త్రీనగర్‌కు చెందిన గోకల బాల్‌రాజ్‌గౌడ్, స్వప్నల కుమార్తె మనీషా(24) ప్రైవేట్ ఉద్యోగిని. కాగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వప్న ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌ను సైతం ఇంట్లోనే వదిలిపెట్టింది. కాగా మనీషా పుస్తకంలో తాను వంశీ అనే వ్యక్తితో వెళ్లిపోతున్నానని రాసి ఉండగా.. అతడి సెల్‌ఫోన్‌కు ప్రయత్నించడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం యువతి తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి: సీఎం కేసీఆర్ -
చదువుకునే సమయంలో రాజేష్‌తో ప్రేమ.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమిరెడ్డి సత్తిబాబు తన కూతురు రాధిక(19)ను స్వస్థలం ఆంధ్రపదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని మచ్చవాని పాలెంలో చదివిస్తున్నాడు. అయితే అక్కడ రాజేష్ అనే యువకుడు, రాధికలు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాధికను బాలానగర్‌లోని సాయినగర్‌కు ఆరు నెలల క్రితం తీసుకువచ్చాడు. అయితే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాధిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన సోమిరెడ్డి సత్తిబాబు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవటంతో బాలానగర్ పోలీస్‌లను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు.. -
ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అదే నా చివరి కోరిక..
తూర్పు గోదావరి: మండలంలోని నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమైందని, కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోరంగి ఎస్సై టి.శివకుమార్ బుధవారం తెలిపారు. ఎం.ఎస్.శర్మ దంపతుల 22 ఏళ్ల కుమార్తె ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఇంటినుంచి వెళుతూ యువతి రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరి యువకుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో పేర్కొంది. యానాం గోదావరిలోగాని, కోరంగి గోదావరిలో గాని దూకి తాను చనిపోతానని, తన కోసం గాలించవద్దని తెలిపింది. దీంతో యువతి తండ్రి ఆందోళన చెందుతూ యానాం, కోరంగి గోదావరి ప్రాంతాలలో తీవ్రంగా గాలించి, ఆచూకీ లభించకపోవడంతో కోరంగి పోలీసులకు 13 తేదీన ఫిర్యాదు చేశారు. కలకలం రేపుతున్న వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో ఒక యువకుడు ఆ యువతి ఫొటోలను తగులబెడుతూ, ఆమె చనిపోకపోతే నేనే చంపేస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. ఆ యువకుడు ఎవరు, సూసైడ్ నోట్లో యువతి పేర్కొన్న ఇద్దరి పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌నోట్‌లో గోదావరిలో దూకి చనిపోతానని పేర్కొనడం, కొంతమంది గోదావరి పరీవాహక ప్రాంతంలో యువతిని చూసినట్లుగా చెప్పడంతో గోదావరిలో విస్తృతంగా గాలించినట్లు ఎస్ఐ తెలిపారు. సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని, అదే నా చివరి కోరిక అని యువతి పేర్కొంది. కాగా తమ కుమార్తెను ఆ ఇద్దరు యువకులే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు. తమకు ఇద్దరు పిల్లలని మూడేళ్ల వయసులోనే కాలువలో పడి తమ కుమారుడు మృతి చెందాడని, తమకు అండగా ఉంటుందనుకున్న కుమార్తె ఈ రకంగా కనిపించకపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు.