సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో ఓ యువతి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడామేస్త్రీనగర్‌కు చెందిన గోకల బాల్‌రాజ్‌గౌడ్, స్వప్నల కుమార్తె మనీషా(24) ప్రైవేట్ ఉద్యోగిని. కాగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వప్న ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌ను సైతం ఇంట్లోనే వదిలిపెట్టింది.
కాగా మనీషా పుస్తకంలో తాను వంశీ అనే వ్యక్తితో వెళ్లిపోతున్నానని రాసి ఉండగా.. అతడి సెల్‌ఫోన్‌కు ప్రయత్నించడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం యువతి తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment