Jagadgiri gutta
-
మేడ్చల్: వీధి కుక్కలు వెంటపడడంతో ఆ చిన్నారి..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడకుంటూ అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి మనోజ్.. శవమై కనిపించాడు. మనోజ్ మృతదేహాన్ని దగ్గర్లోని క్వారీ గుంత నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. చిన్నారి ఎలా చనిపోయి ఉంటాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. వీధి కుక్కల వల్లే తమ కొడుకు చనిపోయి ఉంటాడని మనోజ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడి ఉంటాయని, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో క్వారీ గుంతలో పడిపోయి ఉంటాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
Hyderabad: వంశీతో వెళ్లిపోతున్నానని రాసి పెట్టి..యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో ఓ యువతి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడామేస్త్రీనగర్‌కు చెందిన గోకల బాల్‌రాజ్‌గౌడ్, స్వప్నల కుమార్తె మనీషా(24) ప్రైవేట్ ఉద్యోగిని. కాగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వప్న ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌ను సైతం ఇంట్లోనే వదిలిపెట్టింది. కాగా మనీషా పుస్తకంలో తాను వంశీ అనే వ్యక్తితో వెళ్లిపోతున్నానని రాసి ఉండగా.. అతడి సెల్‌ఫోన్‌కు ప్రయత్నించడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం యువతి తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి: సీఎం కేసీఆర్ -
ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్.. ఓ అబ్బాయి విషయం చెప్పి ఫోన్ కట్.. మళ్లీ చేస్తే...
జగద్గిరిగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట మహాత్మాగాంధీనగర్‌కు చెందిన మునుగల రామిరెడ్డి కుమార్తె స్నేహలత (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా ఈ నెల 17న ఉదయం 11 గంటల ప్రాంతంలో వారి ఇంటికి సంబంధించిన మెట్లు ఊడ్చేందుకు బయటకు వెళ్లిన యువతి కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే అదేరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ యువతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి నా వద్దనే ఉంది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అయితే మరలా సదరు నంబర్‌కు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నాయబ్.. సీనియారిటీ గాయబ్!) -
కిరాణం షాప్‌కు వెళ్తున్నానని చెప్పి..సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసి..
సాక్షి, జగద్గిరిగుట్ట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డివిజన్ లెనిన్‌నగర్‌కు చెందిన జోగేందర్ ప్రసాద్ కుమార్తె (14) ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 30న సాయంత్రం కిరాణా దుకాణానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి రాత్రైనా ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె బయటకు వెళ్లే ముందు తన ఫోన్ నుంచి సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసిందని, అతనిపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. చదవండి: నీ అంతు చూస్తా అన్నందుకు.. ఒక్కసారిగా కత్తి తీసుకుని సొంత తమ్ముడే -
హైదరాబాద్: సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
-
ఆన్లైన్ క్లాసులు వింటున్న బాలికపై అత్యాచారం
జగద్గిరిగుట్ట: మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి, బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన బాలిక (15), తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా.. ఇంట్లో ఆన్లైన్ క్లాసులు వింటూ ఒంటరిగా ఉంటున్నది. అదే క్రమంలో ఇంటి యజమాని కుమారుడు మధుసూదన్ రెడ్డి (27) బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీనిని వీడియోలో చిత్రీకరించాడు. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బాలికను భయపెట్టాడు. మనోవేదనకు గురైన బాలిక ఈనెల 12న విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..) -
జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి
జగద్గిరిగుట్ట: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసుల దాడులు నిర్వహించి నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గాజులరామారంలోని మహదేవపురం కాలనీలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసుల శనివారం అడ్డాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సెల్‌ఫోన్ ద్వారా విటులకు ఫోన్‌చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులతో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలానగర్ లోని వ్యభిచార గృహంపై బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలానగర్ ఎస్వోటి ఇన్ స్పెక్టర్ రమణారెడ్డి తెలిపిన వివరాలు.. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని కమల ప్రసూన నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యభిచార గృహం నిర్వాహకుడు హరీష్ (38), విటుడు విజేందర్ (26)లతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. హరీష్, విజేందర్‌లపై కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. చదవండి: కుటుంబ తగాదాలు.. అన్న, అక్క దారుణ హత్య -
హైదరాబాద్‌లో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జగద్గిరిగుట్టలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. సుమారు పదిమంది వ్యక్తులు తరుముతూ స్థానిక ఆర్పీ కాలనీలో ఓ వ్యక్తిని కత్తులతో దాడిచేసి చంపారు. మృతుడిని రౌడీ షీటర్ ఫయాజ్‌గా గుర్తించారు. పాతకక్షలే హత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్లే కానీ.. కరుడుగట్టిన దొంగలు
సాక్షి, జగద్గిరిగుట్ట : దోపిడీలు, దొంగతనాలు చేస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5.69 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాలానగర్ ఏసీపీ పురుషోత్తమ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూరారం కాలనీ దయానంద్‌నగర్ కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు 917,14) తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల నాలుగు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలు తదితర ఆధారాలతో కేసులను విచారించి ఈ ఇద్దరిని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 4.80 వేలు విలువ చేసే బంగారం, రూ. 84 వేల విలువ చేసే రెండు కేజీల వెండితో పాటు రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు. మైనర్.. నోఫియర్.. పట్టుబడిన ఇద్దరు మైనర్లు 2018 నుంచి దొంగతనాలకు పాల్పడడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒకరిపై (17) బాలానగర్ పీఎస్‌లో రెండు, శామీర్‌పేట పీఎస్‌లో ఒకటి, జీడిమెట్ల పీఎస్‌లో ఒకటి, పేట్ బషీరాబాద్ పీఎస్‌లో రెండు, జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు చొప్పున మొత్తం 8 దొంగతనం కేసులు ఉన్నాయి. మరొకరి(14)పై జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. ఐవో టీమ్‌కు రివార్డు.. దొంగతనాల కేసులను చాలెంజ్‌గా తీసుకున్న జగద్గిరిగుట్ట, జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్, జగద్గిరిగుట్ట ఎస్సై మహబూబ్‌పాటిల్‌లు తమ క్రైమ్ టీమ్‌తో సుదీర్ఘంగా విచారించి చాకచక్యంగా కేసులను ఛేదించారు. వీరితో పాటు క్రైమ్ సిబ్బంది సత్యనారాయణ, అర్జున్, విజయ్, హరిలాల్‌కు రివార్డులను అందించనున్నట్టు ఏసీపీ పురుషోత్తమ్, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిలు తెలిపారు. -
‘వసూల్ రాజా’పై సీపీ సీరియస్
కుత్బుల్లాపూర్: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జగద్గిరిగుట్ట సీఐ శ్రీనివాసులును కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఇన్చార్జ్ సీఐగా గంగారెడ్డిని నియమిస్తూ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ బాలాపూర్‌లో నిర్మిస్తున్న భవనానికి కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన పలువురి నుంచి భవన నిర్మాణ సామాగ్రిని తరలించినట్లు ఆరోపణలు రావడంతో ‘సాక్షి’లో మంగళవారం ‘వసూల్ రాజా’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ విచారణకు ఆదేశిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులును సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో బాలానగర్ స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న గంగారెడ్డిని నియమించారు. హెడ్ కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్ పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ఆది నుంచి వివాదాస్పదంగానే.. జగద్గిరిగుట్ట సీఐగా 2018 సెప్టెంబర్ 13న బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్నాడు. భూదేవి హిల్స్ మొదలు, కైసర్‌నగర్ వరకు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగద్గిరిగుట్టలో గుట్కా, పాన్ పరాగ్‌లు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మోసపోయి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాలికకు న్యాయం చేయకపోగా నిందితుడికే వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం పేకాట రాయుళ్ల నుంచి భారీగా వసూలు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు సీఐలు అవినీతి ఆరోపణలపై బదిలీ కాగా శ్రీనివాసులు బదిలీతో వారి సంఖ్య మూడుకు చేరింది. -
కొడుకును ఆటోకేసి కొట్టిన తండ్రి
హైదరాబాద్: పరిచయమున్న ఓ మహిళ తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. తమ కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆదివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్‌ను అరెస్టు చేశారు. ఉప్పల్‌కు చెందిన శివగౌడ్‌కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటున్న మరో మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంలో భార్యాపిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శివగౌడ్ ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్ చేసి ‘నీ కుమారుడిని చంపుతా’నంటూ బెదిరించాడు. భయాందోళనకు గురైన ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్(3)ను బయటకు తీసు కొచ్చి అక్కడున్న ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రిత్విక్‌ను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా శివగౌడ్ భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించి శివగౌడ్‌పై కేసు నమోదు చేశారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
జగద్గిరిగుట్టలో స్కూల్ టీచర్ రాక్షసత్వం
-
జగద్గిరిగుట్టలో పేలుడు పదార్ధాలు స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావి నారాయణ రెడ్డి నగర్లో భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన గురుజిత్ సింగ్(45), రమాదేవి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 250 డిటోనేటర్లు, 171 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయానికి వెళ్లిన ఇద్దరు అదృశ్యం
హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక, బాలుడు అదృశ్యం అయ్యారు. ఏడుకొండలు, సుశీల దంపతుల పిల్లలైన లక్ష్మి కల్యాణి (14), పునీత్ (8) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి తన వెంట తీసుకెళ్లిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
15 మంది రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జగద్గిరిగుట్టలో 15 మంది రౌడీ షీటర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రౌడీ షీటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులోభాగంగా నగరంలోని పలువురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
జగద్గిరిగుట్టలో తనిఖీలు.. 20మంది అరెస్ట్
-
జగద్గిరిగుట్టలో పోలీసుల తనిఖీలు, 20మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలో జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి 100 నకిలీ సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘బియాస్’ బాధితులకు న్యాయం చేయాలి
జగద్గిరిగుట్ట: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీఎస్, ఏఎంఎస్ఏ సంఘాల విద్యార్థి నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు స్టాలిన్, గౌతమ్, వీరబాబు, వెంకట్, భాస్కర్లు మాట్లాడుతూ 2012లో పులి చింతల ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లినపుడు జరిగిన ప్రమాదంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై ఉంటే బియాస్ నది సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. విద్యార్థులను స్టడీ టూర్ పేరిట తీసుకువెళ్లి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 24 మంది ప్రాణాలు పోవడానికి కారకులైన కాలేజీ యాజమాన్యంపై పోలీసులు స్పందించి వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్, డీన్‌తో వాగ్వాదం విద్యార్థులు ధర్నా చేస్తున్నా యాజమాన్యం దిగి రాకపోవడంతో విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి రక్షణగా పోలీసులు రావడం సిగ్గు చేటుగా ఉందని వారు ఆరోపించారు. పోలీసుల జోక్యంతో ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, డీన్ రవీంద్రబాబు విద్యార్థులతో మాట్లాడడానికి వచ్చారు. బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం చేయడానికి జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు వారిని నిలదీశారు. సరైన సమాధానం లభించకపోవడంతో విద్యార్థి నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు విద్యార్థి నాయకులను శాంతింపజేశారు. విలపించిన ఈశ్వర్రావు.. 2012లో పులి చింతల ప్రమాదంలో మృతి చెందిన మోహన్ తండ్రి ఈశ్వర్రావు తన కుమారుడు లేని జీవితం వ్యర్థంగా మారిందని కన్నీరు మున్నీరయ్యారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పిన కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, డీన్ రవీంద్రబాబు లు మాట్లాడే సమయంలో ఈశ్వర్రావు ఆవేదనకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థి నాయకులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.