
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జగద్గిరిగుట్టలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. సుమారు పదిమంది వ్యక్తులు తరుముతూ స్థానిక ఆర్‌పీ కాలనీలో ఓ వ్యక్తిని కత్తులతో దాడిచేసి చంపారు. మృతుడిని రౌడీ షీటర్ ఫయాజ్‌గా గుర్తించారు. పాతకక్షలే హత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment