
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జగద్గిరిగుట్ట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డివిజన్ లెనిన్‌నగర్‌కు చెందిన జోగేందర్ ప్రసాద్ కుమార్తె (14) ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 30న సాయంత్రం కిరాణా దుకాణానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి రాత్రైనా ఇంటికి రాలేదు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె బయటకు వెళ్లే ముందు తన ఫోన్ నుంచి సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసిందని, అతనిపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చదవండి: నీ అంతు చూస్తా అన్నందుకు.. ఒక్కసారిగా కత్తి తీసుకుని సొంత తమ్ముడే
Comments
Please login to add a commentAdd a comment