school Subject
-
Hyderabad: విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకువస్తాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ వదిలిన తర్వాత అందరినీ ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. మిగతా ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలి ఆ విద్యార్తిని ఇంటికి తీసుకెళ్లకుండా వేరే చోటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:20 గంటల వరకు ఇంటికి చేరుకునే కూతురు 1:30 గంటల వరకు రాకపోవడంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆటో డ్రైవర్ మిగతా పిల్లలను వదులుతున్నాను సార్.. మా ఇంటికి వెళ్లే క్రమంలో మీ పాపను వదిలి వెళ్తానని సమాధానం చెప్పి పది నిమిషాల్లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని ఆటో డ్రైవర్ తనను ఇంటికి తీసుకురాకుండా మరో చోటికి తీసుకెళ్లి నా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. జరిగిన విషయంపై నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. -
కిరాణం షాప్‌కు వెళ్తున్నానని చెప్పి..సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసి..
సాక్షి, జగద్గిరిగుట్ట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డివిజన్ లెనిన్‌నగర్‌కు చెందిన జోగేందర్ ప్రసాద్ కుమార్తె (14) ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 30న సాయంత్రం కిరాణా దుకాణానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి రాత్రైనా ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె బయటకు వెళ్లే ముందు తన ఫోన్ నుంచి సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసిందని, అతనిపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. చదవండి: నీ అంతు చూస్తా అన్నందుకు.. ఒక్కసారిగా కత్తి తీసుకుని సొంత తమ్ముడే -
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: ‘‘బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం మాజీ మంత్రి ఈశ్వరీబాయి రాజీలేని పోరాటం చేశారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తాం. తద్వారా భావితరాలు స్ఫూర్తి పొందేలా చూస్తాం’’అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. భాషా సాంస్కృతిక శాఖ , ఈశ్వరీబాయి స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈశ్వరీబాయి జయంతి వేడుకల్లో కడియం, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, దళిత వర్గాల స్థితిగతుల వంటి పలు అంశాలపై 100కు పైగా అధ్యయనాలు చేసిన రీసెర్చ్ స్కాలర్ ఐసీఎస్ఎస్ఆర్ చైర్మన్, సుఖదేవో థోరట్‌కు ఈశ్వరీబాయి స్మారక అవార్డు-2016ను ప్రదానం చేశారు. వచ్చే ఏడాది ఈశ్వరీబాయి శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కడియం ప్రకటించారు. దళిత, బడుగు బలహీన, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న ఈశ్వరీబాయి ఆలోచనలకు అనుగుణంగానే 254 గురుకుల పాఠశాలలు, ఎస్సీ మహిళల కోసం 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. తల్లి ఈశ్వరీబారుు ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి గీతారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత వర్గాల బిడ్డ ఈశ్వరీబాయి అని చందూలాల్ కొనియాడారు. ఉద్యమంలో తాను సైతం: గీతారెడ్డి తన తల్లి ఈశ్వరీబాయి తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లిందని ఈ సందర్భంగా గీతారెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘‘నా తల్లి రాజకీయ జీవితం 1957లో హైదరాబాద్ చిలకలగూడ నుంచి మొదలైంది. తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మహిళా సాధికారితతో పాటు బడుగు బలహీన, దళిత వర్గాల కోసం ఆమె చేసిన పోరాటం మరవలేనిది. తన మాటలతో అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన వీరవనిత మా అమ్మ. తనే నాకు స్ఫూర్తి’’అని వివరించారు. అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకున్న ఈశ్వరీబాయి కలలుగన్న అభ్యున్నతి కోసం ముందుకెళ్లినప్పుడే ఈ జయంత్యుత్సవాలకు సార్థకత అని థోరట్ అన్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా ఆమె స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను మరింతగా వెలుగులోకి తేవాల్సిన అవసరముందన్నారు. వందనాలు వందనాలు అంటూ ఈశ్వరీబాయిపై ఎమ్మెల్యే రసమరుు బాలకిషన్ పాడిన పాట రంజింపచేసింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.