
సైదా జైనా ఫాతిమా, ముష్రత్ అన్సారీ, సైదా జోహా ఫాతిమా(ఫైల్ ఫోటోలు).
సాక్షి, చాంద్రాయణగుట్ట: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హషమాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీవుద్దీన్, ముష్రత్ అన్సారీ(24) దంపతులు. వీరికి సైదా జైనా ఫాతిమా(5), సైదా జోహ ఫాతిమా (1.5) సంతానం. ఈ నెల 21వ తేదీన భర్త పని నిమిత్తం బయటికి వెళ్లాడు.
చదవండి: నా భర్తతో ప్రాణహాని ఉంది.. రక్షించండి
అనంతరం ముష్రత్ అన్సారీ సోదరి కౌసర్ అన్సారీ సమీవుద్దీన్‌కు ఫోన్ చేసి సోదరి ఫోన్ స్వీచాఫ్ వస్తుందని తెలిపింది. దీంతో అతడు ఇంటికి వెళ్లి చూడగా.. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కనిపించలేదు. పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి...
Comments
Please login to add a commentAdd a comment