వెంగళరావునగర్: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు నామవరపు జ్యోత్స్న శ్రీ (17) భద్రాచలంలో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివింది. అనంతరం ఆమెను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ తల్లి రజిని భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బైపీసీలో వేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న జ్యోత్స్నశ్రీ తనకు ఇంగ్లిష్ పాఠాలు అర్థం కావడం లేదంటూ చదువు మానేసి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని తన పిన్ని స్వరూప ఇంటికి వచి్చంది.
భర్తతో విభేదాలు రావడంతో గత ఏడాది నుంచి జ్యోత్స్నశ్రీ తల్లి కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది. నాలుగురోజులుగా ఆ యువతి అమీర్‌పేటలోని ఓ షోరూంలో పని చేస్తుంది. ఆమె సరిగ్గా పని చేయకపోవడంతో షాపు ఓనర్ నాగమణి యువతి తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇటీవల యువతి తల్లి భద్రాచలం వెళ్లింది. అక్కడ నుంచి తన కుమార్తెకు ఫోన్ చేసి అటు చదువుకోకపోగా పని కూడా సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ మందలించింది.
దాంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేకని సమయంలో ఆ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచి్చన స్వరూప తలుపు గడియకూడా పెట్టకుండా ఉండటంతో లోపలకు వెళ్లింది. స్వరూపకు జ్యోత్న్స ఉరేసుకుని ఉండటం చూసి 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి పిన్ని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment