18 రోజుల క్రితం పెళ్లి.. ఇంటికొచ్చి చూస్తే షాక్‌.. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ | Woman Goes Missing After 18 Days Of Marriage In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: 18 రోజుల క్రితం పెళ్లి.. ఇంటికొచ్చి చూస్తే షాక్‌.. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌

Published Tue, Jan 18 2022 11:02 AM | Last Updated on Tue, Jan 18 2022 1:39 PM

Woman Goes Missing After 18 Days Of Marriage In Hyderabad - Sakshi

తల్లిదండ్రులు పనులపై వెళ్లగా కావేరి ఒక్కత్తే ఇంట్లో ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చి చూడగా కుమార్తె..

సాక్షి, నిజాంపేట్‌: కొత్తగా పెళ్లైన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట శివనగర్‌కు చెందిన సిద్దయ్యగౌడ్, సంగీతల కుమార్తె కావేరి (19), వెంకటేష్‌కు 18 రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 6న తల్లిదండ్రులు పనులపై వెళ్లగా కావేరి ఒక్కత్తే ఇంట్లో ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌కు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ  తెలియరాలేదు. దీంతో కావేరి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement