newly married woman
-
మంది మాటలు వినే..! పిన్ని, అన్నల కొత్త డ్రామానా..?
-
వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్‌నగర్‌లో నివసించే నరేష్ గౌడ్‌కు గాజుల రామారంలో నివాసం ఉండే నందిని (23)కి నెల రోజుల క్రితం వివాహమైంది. భర్త ఇంటి వద్దనే ఉన్న నందిని శనివారం రాత్రి 7 గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై రామ్మోహన్ రెడ్డి వివరించారు. -
బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీకై నవ వధువు మృతి
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్లో గీజర్ నుంచి లీక్ అయిన గ్యాస్ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. వివరాలు.. ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్ డోర్ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టగా.. ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ గీజర్‌లో నుంచి వెలువడిన కార్బర్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమని.. పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గ్యాస్ గీజర్‌ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్రూమ్లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లో గ్యాస్ గీజర్లను ఉపయోగించడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇవి విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ పీల్చిన కొద్ది నిమిషాల్లోనే కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయిదు నిమిషాలు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల తల తిరగడం.. అంతకంటే ఎక్కువ సమయం పీలిస్తే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు యాంటీ సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. గ్యాస్ సీజర్‌ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. 1. బాత్రూమ్, వంటగది వంటి మూసివేసిన ప్రదేశాలలో గ్యాస్ గీజర్‌ను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయవద్దు. 2. ఒకవేళ బాత్రూమ్, కిచెన్ వంటి ప్రదేశాల్లో వీటిని అమర్చినట్లయితే తగినంత వెంటిలేషన్ ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. 3. గ్యాస్ గీజర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. 4. గ్యాస్ గీజర్‌ను రోజంతా వినియోగించడం మంచిది కాదు. నిరంతరాయంగా టిని వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తే వినియోగించే ముందు తగినంత గ్యాస్ ఉండాలి. 5. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లే ముందే గ్యాస్ గీజర్‌ను స్విచ్ ఆఫ్ చేయడం మంచింది.. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు. 6. కార్భన్ మోనాక్సైడ్ రంగు, రుచి లేని కారణంగా గీజర్‌లో గ్యాస్ లీకవడాన్ని గుర్తించడం అంత సులభం కాదు. వీటిని పీలుస్తున్న విషయం కూడా మనకు తెలియదు. 7. గ్యాస్ గీజర్‌లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. 8. కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఇది పీల్చిన తర్వాత నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 9. గ్యాస్ గీజర్ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. దీని వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. తరువాత ఆసుపత్రికి తరలించాలి. -
పెళ్లయి 13 రోజులే.. బెడ్రూంలో ఉరేసుకుని నవవధువు..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తండయార్‌పేటలో పెళ్లయిన 13వ రోజే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చెన్నై తండయార్‌పేటకు చెందిన ప్రకాష్, గౌరి దంపతుల కుమార్తె రేఖ(35) రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో లేబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈమెకు టి.నగర్ గిరియప్ప రోడ్డుకు చెందిన రాజశేఖర్ (40)కు వడపళని మురుగన్ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వివాహం జరిగింది. ఈ నెల 19వ తేదీ రేఖ తండయార్‌పేటలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఆర్కే నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పెళ్లయి 13 రోజులే కావడంతో తండయార్‌పేట ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. ఆర్కే నగర్ ఇన్స్పెక్టర్ రవి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..) -
మామను మందలించిన అల్లుడు.. నవ వధువు ఆత్మహత్య
సాక్షి, చీడికాడ (విశాఖపట్నం): తండ్రి మందలించాడన్న మనస్తాపంతో పురుగు మందు తాగిన నవ వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని కోనాం శివారు గిరిజన గ్రామం గుంటిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సుధాకరరావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. గుంటి గ్రామానికి చెందిన కాదలి రాజుకు పక్క గ్రామమైన గుంటి కొత్తూరుకు చెందిన గర్శింగి అచ్చిబాబు కుమార్తె దేవి (18)కి మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇటీవలకాలంలో ప్రతిరోజు దేవి తండ్రి అచ్చిబాబు అల్లుడి స్వగ్రామమైన గుంటి వచ్చి సారా సేవించి వెళ్తుండేవాడని ఎస్ఐ తెలిపారు. గమనించిన అల్లుడు రాజు మామ అచ్చిబాబును మూడు రోజుల క్రితం మందలించాడు. దీనిపై తన తండ్రిని ఎందుకు మందలించావని భర్త రాజుతో దేవి గొడవ పడి రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. మేము గొడవ పడితే నీకెందుకమ్మా అని దేవిని తండ్రి అచ్చిబాబు మందలించి శుక్రవారం భర్త దగ్గరకు పంపించేశాడు. దీంతో మనస్తాపం చెందిన దేవి శుక్రవారం రాత్రి పురుగు మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను భర్త, కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చదవండి: (ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో..) -
18 రోజుల క్రితం పెళ్లి.. ఇంటికొచ్చి చూస్తే షాక్.. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్
సాక్షి, నిజాంపేట్: కొత్తగా పెళ్లైన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట శివనగర్‌కు చెందిన సిద్దయ్యగౌడ్, సంగీతల కుమార్తె కావేరి (19), వెంకటేష్‌కు 18 రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 6న తల్లిదండ్రులు పనులపై వెళ్లగా కావేరి ఒక్కత్తే ఇంట్లో ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌కు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ తెలియరాలేదు. దీంతో కావేరి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాపురానికి వెళ్లినా వేధింపులు తప్పవు.. పుట్టింట్లో నవవధువు..
సాక్షి, ముత్తారం (పెద్దపల్లి): అదనపు కట్నం వేధింపులకు నవవధువు పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్‌లో విషాదం నింపింది. కట్నం కింద రూ. 17లక్షలు ఇచ్చి.. ఇతర కానుకలు ముట్టజెప్పినా.. భర్త, అత్తామామల వేధింపులు ఆగలేదు. అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని పుట్టింట్లో వదిలేయడం.. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వారిపై భారం వేయొద్దని కానరాని లోకాలకు వెళ్లింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అడవిశ్రీరాంపూర్‌కు మారం వెంకన్న, సరోజనకు కూతురు పవిత్ర, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పవితక్రు ఈ ఏడాది ఆగస్టు 21న మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం లక్ష్మి, ఓదెలు కుమారుడు నరేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.17లక్షలు, 17 తులాల బంగారం, ద్విచక్రవాహనం ఇచ్చారు. కాపురంలో పట్టుమని పది రోజులు కాకుండానే నరేశ్‌లో అదనపు కట్నమనే పిశాచి ఆవహించింది. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) వివాహం నాటి ఫొటో తనకు ఫర్టిలైజర్ దుకాణంలో నష్టం వచ్చిందని, మరో రూ.10లక్షలు అదనంగా తేవాలని పవిత్రను వేధించసాగాడు. దీనికి నరేశ్ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు సురేశ్, బంధువులైన రమేశ్, రావుల చంద్రయ్య, పద్మ సహకరించారు. తనపై భర్త, అత్తామామలు, మరిది దాడి కూడా చేశారని పవిత్ర తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలపగా.. పెద్ద మనుషులను తీసుకెళ్లి పంచాయితీ పెట్టించారు. అందరికీ సర్దిచెప్పి వచ్చారు. అయితే దీపావళి పండుగ నిమిత్తం పవిత్రను పుట్టింట్లో వదిలివెళ్లిన నరేశ్.. అదనపు కట్నం తెస్తేనే కాపురానికి తీసుకెళ్తానని స్పష్టం చేశాడు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడం.. కాపురానికి వెళ్లినా నరేశ్ నుంచి వేధింపులు తప్పవని మనస్తాపానికి గురైన పవిత్ర (24) గురువారం వేకువజామున దూలానికి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికే చనిపోయింది. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, సీఐ సతీశ్ సంఘటన స్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కట్నం వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని పవిత్ర తండ్రి ఫిర్యాదు మేరకు పవిత్ర భర్త చిందం నరేశ్, అత్తామామలు చిందం లక్ష్మీ, ఓదెలు, మరిది సురేశ్, రమేశ్, రావుల చంద్రయ్య, రావుల పద్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు) -
ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి
నాగోలు: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, జర్పుల తండాకు చెందిన జర్పుల మంత్రు, మారెమ్మ దంపతుల కుమార్తె అమూల్య (22), కొత్తపేటలోని ఓ కాఫీ షాపులో పని చేసేది. అక్కడ పని చేస్తున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన కంతుల డేవిడ్(25)తో పరిచయమై మార్చి 24న సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకుని వనస్థలిపురంలో కొన్ని రోజులు ఉండి, గత 20 రోజుల క్రితం ఎల్బీనగర్లోని శివగంగాకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నాటి నుంచి అమూల్య పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. మూడ్రోజుల క్రితం హస్తినాపురంలో ఉండే తన అక్క ఇంటికి వెళ్లగా మెడలోని నల్లపూసలు గురించి కుటుంబ సభ్యులు అడిగినట్లు సమాచారం. అక్కడ నుంచి 17న హాస్టల్‌కు వెళ్తున్నానని చెప్పి తన భర్త వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి తల్లికి ఫోన్‌చేసి తాను కులాంతర వివాహం చేసుకున్నానని మీ వద్దనున్న తన బంగారు ఆభరణాలు, డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఉదయం బాత్రూంలో అమూల్య చున్నీతో అనుమానాస్పద స్థితిలో ఉండటంతో గమనించిన డేవిడ్ కామినేని హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అమూల్య మృతి చెందిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. డేవిడ్ తన కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమూల్య మృతికి డేవిడ్ కారణమంటూ అతడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. అమూల్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి స్పందించి అమూల్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం
సాక్షి, డోన్ టౌన్: మండలంలోని చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన మాధవి అనే నవ వధువు అదృశ్యమైనట్లు రూరల్ ఎస్ఐ సురేష్ మంగళవారం తెలిపారు. ఈనెల 10వ తేదీన మాధవికి అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లె గ్రామానికి చెందిన కొత్తరాయుడితో వివాహమైంది. తిరిగింపు, మరిగింపుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన నూతన దంపతులు చిన్నమల్కాపురానికి చేరుకున్నారు. అదే రోజు భర్తకు అన్నం వడ్డించి పక్కనే ఉన్న అంగడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మాధవి తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువుల ఊళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఆమె భర్త కొత్తరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..) -
యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి..
సాక్షి, మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. రిజిస్టర్ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఈ నెల 20 వ తేదీ రాత్రి కాశీనాథ్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి ఉప్పల్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్‌నగర్‌కు చెందిన నాగరాజు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తాడు. ఇతని భార్య సౌజన్య(26) సోమవారం ఉదయం మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి సోదరుడు లింగ స్వామి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నాంపల్లికి చెందిన వారు. 22 రోజుల క్రితమె పెళ్లి జరిగినట్లు మృతురాలి సోదరుడు తెలిపారు. చదవండి: నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే...
సాక్షి, చెన్నై : ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై అమింజికరైకు చెందిన భవానీశ్వరి కార్తీక్ అనే యువకుడిని ఈ నెల మొదటి వారంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం బయట పడింది. పెళ్లి చేసుకున్న వారం రోజులకే కార్తీక్, అతడి కుటుంబం కట్నం కోసం వేధించడం, ప్రియుడిని నమ్మి పారిపోయి వచ్చిన తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
‘నన్ను ఎందుకు దూరం పెట్టావు’
సాక్షి సూర్యాపేట: వరకట్న వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రణయ్ నల్గొండ జిల్లా కొర్లపాడుకు చెందిన లావణ్య ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లికి ముందు బాగా చూసుకున్న ప్రణయ్, వివాహం జరిగినప్పటి నుంచి లావణ్యను వేధించసాగాడు. అదనపు కట్నం తీసుకు రమ్మని ఒత్తిడి చేశాడు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నమ్మించి మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య శనివారం పురుగుల మందు సేవించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ‘నన్ను ఎందుకు దూరం పెట్టావు. ఎక్కడ ఉన్నావ్. నేను పురుగుల మందు తాగాను’ అంటూ లావణ్య చివరగా ప్రణయ్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కట్నకానుకలు ముట్టజెప్పామని, అయినా అదనపు కట్నం కావాలంటూ ప్రణయ్ వేధించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డ చావుకు ప్రణయ్ వేధింపులే కారణమని తెలిపారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కొత్త కోడళ్లకు నో రేషన్..
కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేష్‌కు ఏడాది క్రితం హుజూరాబాద్‌కు చెందిన అఖిలతో వివాహామైంది. రేషన్‌కార్డులో ఆమె పేరును అక్కడ తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న బాధితులది. సాక్షి, కరీంనగర్ : రేషన్ కార్డుల జారీ ఎటూ తేలకపోవడం కొత్త కోడళ్లకు శాపంగా మారింది. ఇంటి పేరు మారినా రేషన్ కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది బాధితులు నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత మూడేళ్లుగా అర్జీలు కుప్పలుగా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం మారింది. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్త కార్డుల జారీలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: టెన్త్ విద్యార్థులకు శుభవార్త..! అర్జీ ఇచ్చి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లో.. అర్జీ ఇచ్చి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని బాధితులు వాపోతున్నారు. తనకు మూడేళ్ల క్రితం వివాహామైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించాడు. జిల్లాలో 497 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.50లక్షల కార్డుదారులు ఉన్నారు. పెళ్లి కాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్క పేరు చేర్చలేదని తెలుస్తోంది. దశలవారీగా పేర్ల తొలగింపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో వేల కార్డులు వృథాగా మిగిలిపోయాయి. ఐదేళ్ల కాలంలో వేలమంది మరణించగా ఇంకా కార్డుల్లో పేర్లు కొనసాగుతుండగా యూనిట్ల సంఖ్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరణించిన వారు, కొత్తగా పెళ్లయిన వారి వివరాలను నమోదు చేసి తొలగించారు. ఆడపిల్లకు పెళ్లి జరిగితే ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పురుషులకు వివాహామైతే వేరు కుటుంబం ఏర్పడడం అనివార్యమే. ఈ క్రమంలో వేర్వేరుగా జాబితాలను తయారు చేసి తొలగించారు. ఇక అలాగే సంపన్నులను గుర్తించేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించి తొలగించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు విక్రయించిన ధాన్యం, వచ్చిన నగదు, రైతుబంధు పథకంలో ఎక్కువ మొత్తం పెట్టుబడి సాయం వచ్చిన రైతు, వ్యాపారులకు సంబంధించి జీఎస్టీ చెల్లిస్తున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. పట్టణాల్లో బహుళ అంతస్తుల నివాసాలు, వివిధ వ్యాపారాలు, స్థిరాస్తులు, ప్రైవేటు కంపెనీలు వంటి వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కార్డుకు రూ.25వసూలు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులను పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులను ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలన పడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణ చేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. పేరు చేర్చే అవకాశం అత్తారింటి కార్డులో పేరు చేర్చుకునే అవకాశ«ం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లయిన వెంటనే పేరు తొలగింపునకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. గిర్దావర్ విచారణ చేసి తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. పేరు తొలగించినట్లు తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం తీసుకుని డీఎస్వో కార్యాలయంలో అందజేయాలి. విచారణ చేసి పేరు చేరుస్తారు. లబ్ధిదారులు అదే జిల్లా పరిధిలోని వారై ఉండాలి. వివాహమైన యువతులు జిల్లా పరిధిలో వారైతే పేరు తొలగించినట్లు తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని, డీఎస్వో కార్యాలయంలో అందజేస్తే కమిషనరేట్ నుంచి ప్రత్యేక అనుమతి వస్తుందని అధికారులు వివరించారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చితే కొత్త జంటకు కార్డు ఏదన్నది తేల్చడం లేదు. -
ఇష్టంలేని పెళ్లి.. నవవధువు బలవన్మరణం
-
పెళ్లయిన 9 నెలలకే..
సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని మాస్తి ఫిర్కా దొడ్డకల్లహళ్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరు రూరల్ జిల్లా ఆనేకల్ తాలూకా అత్తిబెలె ఫిర్కా మంచేనహళ్లి గ్రామానికి చెందిన మేఘను మాలూరు తాలూకా మాస్తి ఫిర్కా దొడ్డకల్లహల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప పెద్ద కొడుకు మహేష్ చంద్రకు ఇచ్చి 9 నెలల క్రితం వివాహం చేశారు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురం.. అనంతరం కట్నం కోసం వేధింపులు మొదలు కావడంతో నెలన్నర క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి తిరిగి పంపారు. అయితే గురువారం రాత్రి ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటివారే తమ కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త మహేష్ చంద్ర, అతని అక్క భర్త రేవణ్ణలను అరెస్టు చేశారు. -
పోలీస్ స్టేషన్లో కొత్త పెళ్లికూతురి నిర్వాకం
చండిఘడ్ : పంజాబ్ రాజకీయాలన్ని ఇప్పుడు డ్రగ్స్ చుట్టే తిరుగుతున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే.. పోలీసులు మాత్రం మాకు ఇవేవి పట్టవన్నట్టు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఫిరోజ్‌పూర్ డీఎస్పీ ఒక మహిళకు బలవంతంగా మత్తు పదార్ధాలు అలవాటు చేసిన సంగతి బయటకు రావడంతో మొత్తం పోలీస్ శాఖ మీదనే చెడు అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వీడియో మరొకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక నవ వధువు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే కూర్చుని ‘చిట్టా’(హెరాయిన్ లాంటి మత్తు పదార్ధం) తాగుతుంది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. పెళ్లి దుస్తులు ధరించిన ఓ యువతి వెలుగుతున్న కొవ్వొత్తి ముందు కూర్చుని ఉంది. ఆ మంట మీద ‘చిట్టా’ ఉన్న ఫాయిల్ పేపర్‌ను పెట్టి దాన్ని తాగుతు ఉంది. యువతి పోలీస్ స్టేషన్లోనే ‘చిట్టా’ సేవిస్తుందనడానికి నిదర్శంగా అక్కడ ఉన్న కొవ్వొత్తి నలుపు రంగు ఇనుప పెట్టెలో ఉంది. ఈ ఇనుప పెట్టే సాధారణంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కనిపిస్తుంది. వీడియోలో ఒక వ్యక్తి గొంతు కూడా వినిపిస్తుంది. అతను ‘నేను జలందర్‌లో రైడ్ చేయడానికి వెళ్తున్నని’ అంటున్నాడు. యువతి పోలీస్ స్టేషన్లోనే ఇంత దర్జాగా డ్రగ్స్ సేవిస్తుందంటే దీని వెనక కూడా పోలీసుల హస్తం ఉన్నదేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానికంగా ‘చిట్టా’ అని పిలిచే ఈ మత్తు పదార్ధంలో హెరాయిన్‌తో పాటు ఎల్ఎస్డీ కూడా కలిసి ఉండి ఎక్కువ మత్తు కల్గిస్తుంది. గతంలో ‘చిట్టా’ అంటే కేవలం హెరాయిన్ మాత్రమే. కానీ నేడు వేర్వేరు పదార్ధాలు కలిసి అదో శక్తివంతమైన మత్తు పదార్ధాంగా తయారయ్యింది. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్ టెస్ట్‌లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
తల్లిని తిట్టాడని.. నవవధువు ఆత్మహత్య
పహాడీషరీఫ్: కట్టుకున్న భర్త తన తల్లిని దుర్భాషలాడాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై నర్సింగ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం....కొత్తపేటకు చెందిన అబ్దుల్లా బిన్ సాల్హెకు ఐదు నెలల క్రితం పర్వీన్ బేగం(30)తో వివాహమైంది. కాగా పెళ్లైన కొన్ని రోజుల నుంచే పర్వీన్ బేగాన్ని అదనపు కట్నం తీసుకురావాలంటూ అబ్దుల్లా వేధించసాగాడు. దీంతో పర్వీన్ వేధింపుల విషయాన్ని తల్లికి తెలియజేయడంతో ఆగ్రహానికి గురైన ఆమె తల్లి.. అల్లుడికి ఫోన్ చేసి గట్టిగా ప్రశ్నించింది. దీనికి ప్రతిగా అల్లుడు ఆమెను దూషించాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన పర్వీన్ తన వల్లే తల్లిదండ్రులకు ఇన్ని కష్టాలని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
నవ వధువు గొంతు కోసి పరారైన దుండగుడు
-
కట్నం కోసం కోడలిని హతమార్చిన అత్త
జిన్నారం (మెదక్) : అదనపు కట్నం వేధింపులకు నవ వధువు బలైన సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం దోమడుగులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(19)కు ప్రభాకర్‌గౌడ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో మౌనిక వంట చేస్తున్న సమయంలో అత్త అనసూయ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో మంటల్లో పూర్తిగా కాలిపోయిన మౌనికను నగరంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందింది. ఆమె మృతిచెందడానికి ముందు అత్త అనసూయే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిందని మరణ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు బలవన్మరణం
కర్నూలు: కట్నం వేధింపులకు బనగానపల్లెలో నవవధువు హిమబిందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ హిమబిందు బుధవారం మృతి చెందింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించేవారని బంధువులు చెబుతున్నారు. భర్త, అత్తమామ, ఆడపడచును పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని ఎస్పీ రవికృష్ణ పరామర్శించారు. -
గ్యాస్ లీకై నవ వధువు సజీవదహనం
క్రోసూరు (గుంటూరు జిల్లా) : వంట గ్యాస్ లీకై సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ నవ వధువు సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానిక మార్కెట్ యార్డు వెనుకభాగంలో ఉన్న ఎస్టీ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రేఖమణి వెంకటకృష్ణ, ఆదెమ్మ దంపతుల కుమార్తె లావణ్య (19)ను నరసరావుపేట ప్రాంతానికి చెందిన వనపర్తి మస్తాన్‌కు ఇచ్చి గత నెల 29న వివాహం చేశారు. అల్లుడిని కూడా తమ ఇంటి వద్దే ఉంచుకుని వ్యాపారం చేయించాలనే యోచనలో వెంకటకృష్ణ దంపతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నవదంపతులు ఇక్కడి వచ్చారు. ఆదివారం ఉదయం లావణ్య దంపతులు పాలప్యాకెట్ కోసం బజారుకెళ్లారు. ముందుగా లావణ్య ఇంటికి వచ్చి టీ పెట్టేందుకు వరండాలోని గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే వంటగ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని చుట్టుముట్టాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె ఇంట్లోకి వెళ్లింది. క్షణాల్లో మంటలు పెద్దవి కావడంతో ఆ మంటల్లో చిక్కుకుని లావణ్య సజీవ దహనమైంది. ప్రమాదంలో పక్కనే ఉన్న మూడు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. వ్యాపారనిమిత్తం పక్క గ్రామం వెళ్లిన లావణ్య తల్లిదండ్రులు, సోదరుడు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి సత్తెనపల్లి సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ రాజేశ్వరరావు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తహశీల్దార్ జేఏ ప్రసూన బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం మండలకేంద్రంలోని నెహ్రూ కాలనీలో నివాసముంటున్న రాయల సరస్వతీ(23) అనే నవ వధువు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కళ్లు తిరిగి పడిపోయి చనిపోయిందని అత్తింటి వారు చెప్పడంతో అనుమానం వచ్చి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరస్వతికి గత ఏడాది నవంబర్‌లో సంతోష్ అనే యువకుడితో వివాహమయింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : పెళ్లయిన ఐదు నెలలకే ఓ యువతి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఎల్బీనగర్లోని శివనగర్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఉదయం 5 గంటలకు అత్తవారింటికి చేరుకున్న ఆమె ఆరు గంటలకు విగతజీవిగా మారింది. ఆమెకు రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రంజిత్ గౌడ్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. దాదాపు రూ.కోటి వరకు కట్నంగా తీసుకున్న రంజిత్ మరింత కట్నం కావాలని అత్తమామలు, భార్యను వేధించి చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నవవధువు ఆత్మాహుతి
నిజాంసాగర్ (నిజామాబాద్) : పెళ్లయిన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మాహుతితో తనువు చాలించింది. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దుంపల హేమలత(22)కు రెండు నెలల క్రితం పిట్లం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది. అయితే ఇటీవలే పుట్టింటికి వెళ్లిన హేమలత శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
డెంగ్యూతో నవ వధువు మృతి
వజ్రకరూర్ (అనంతపురం) : డెంగ్యూతో చికిత్స పొందుతూ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చినప్యాపిలి గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చినప్యాపిలి గ్రామానికి చెందిన సుజాత(19)కు పెద ప్యాపిలి గ్రామానికి చెందిన తిప్పయ్యతో మూడు నెలల కిందట వివాహమైంది. అయితే గత వారం రోజులుగా సుజాత అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగ్యూ సోకిందని తెలపడంతో.. ఆమెను హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. -
నవ వధువు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జ్లిలా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీ పరిధిలోని మెట్టిల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మయూరు కవిత(20)కు ఆరు నెలల కిందట యాచారం మండలానికి చెందిన మధు(24)తో వివాహమైంది. కాగా కొద్ది రోజుల కిందట తల్లిగారింటికి వచ్చిన కవిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
భర్త మందలించాడని యాసిడ్ తాగిన భార్య
సరూర్‌నగర్ (రంగారెడ్డి) : ఎక్కువసేపు సెల్లో మాట్లాడొద్దంటూ భర్త మందలించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రభావతికి, రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట నగర పంచాయితీ పరిధిలోని గుర్రంగూడకు చెందిన పుట్టగళ్ల జనార్థన్‌కు రెండు నెలల కిందట వివాహం జరిగింది. అయితే ప్రభావతి పదే పదే ఫోన్ మాట్లాడుతుందని భర్త ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. కాగా మూడు రోజుల కిందట ప్రభావతి తల్లిదండ్రులు గుర్రంగూడకు వచ్చారు. వారి ముందు కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన ప్రభావతి.. తల్లిదండ్రుల ముందే మరుగుదొడ్లు శుభ్రపరిచే యాసిడ్‌ను తాగింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపు నొప్పి భరించలేక నవ వధువు ఆత్మహత్య
శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : కడుపు నొప్పి భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ రూరల్ మండలం గగన్‌పహాడ్‌కు చెందిన శిరీష(19)కు రెండు నెలల క్రితమే వివాహం అయింది. అయితే కొంత కాలంగా శిరీష తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో నొప్పిని భరించలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త సరదాగా లేడని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం గాజువాకకు చెందిన రజిని(29)అదే ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్‌తో ఫిబ్రవరి 11వ తేదీన వివాహం జరిగింది. నెల కిందట దంపతులు ఇద్దరూ శ్రీకృష్ణానగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రజని ఓ వార్తా సంస్థకు చెందిన జర్నలిజం స్కూల్లో ట్రైనీ రిపోర్టర్‌గా శిక్షణ తీసుకుంటుండగా నరేష్కుమార్ సినీ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. పెళ్ళి అయిన మరుసటి రోజు నుంచే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చి తనతో కలిసి నగరంలో వివిధ ప్రాంతాలకు సందర్శనకు రావాలని రజిని భర్తను కోరేది. అయితే తాను పని చేసేది సినీ పరిశ్రమలో కాబట్టి సాయంత్రం త్వరగా ఇంటికి రావడం కుదరదని రమేష్ చెప్పడంతో గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. వారం క్రితం ఇదే విషయంలో గొడవ జరగగా రజిని తల్లిదండ్రులు వచ్చి కూతురికి నచ్చజెప్పి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం రజిని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గది నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రమేష్‌తో పాటు ఆయన తల్లి రామలక్ష్మి గది తలుపు సందులోంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయంపై రమేష్ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా రమేశ్ మొదటిభార్య కూడా పెళ్లి అయిన ఏడాదిన్నరకు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం పోలీసుల విచారణలో తేలింది. -
బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది..
* కట్నం కోసం చిత్ర హింస *హత్య చేసేందుకు యత్నం *బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసిన నవవధువు *రక్షించిన పోలీసులు హైదరాబాద్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నవ వధువును సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు రక్షించారు. భర్త, అత్తల చిత్రహింసలు భరించలేని ఆమె బాత్రూమ్లోకి వెళ్లి గడియ వేసుకుని 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమై పోలీసులు బాధిత యువతిని రక్షించారు. ఈ సంఘటన నిన్న తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్‌బజార్‌కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌తో ఆగస్టు 15న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ తండ్రి కొద్దికాలం క్రితమే మృతి చెందగా.. తల్లి లక్ష్మితో తాతాచారి కాలనీలో ఉంటున్నాడు. వివాహ సమయంలో లక్ష రూపాయలతో పాటు కొంత బంగారాన్ని కట్నంగా అరుణ తల్లిదండ్రులు ఇచ్చారు. రెండు నెలలపాటు అరుణను బాగానే చూసుకున్న భర్త, అత్త ఆ తర్వాత తమ విశ్వరూపం చూపించారు. చంద్రశేఖర్ నిత్యం పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలోనే అత్త లక్ష్మి కట్నం ప్రస్తావన తేవడంతో అదనపు కట్నం కావాలని వేధించేవాడు. తల్లిదండ్రులకు అదనపు కట్నం ఇచ్చే స్తోమత లేకపోవడంతో అరుణ అత్తింతివారి వేధింపులను భరిస్తూ వచ్చింది. ఇటీవల వేధింపులు తీవ్రమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తల్లి సహాయంతో అరుణను చిత్రహింసలు పెట్టాడు. గొంతు నులిమే ప్రయత్నం చేయడంతో పాటు గదిలో నిర్భందించి కొట్టబోయాడు. దీంతో తనను చంపేస్తారని భావించిన అరుణ తన ప్రాణాలను కాపాడుకునేందుకు శనివారం తెల్లవారు జామున 3.30కి బాత్రూమ్లోకి పరుగెత్తింది. వెళ్తూ .. వెళ్తూ భర్త సెల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లి 100 నెంబర్‌కు డయల్ చేసి.. భర్త తనను బంధించి చిత్రహింసలు పెడుతున్న తీరును ఫిర్యాదు చేసింది. పోలీస్ కంట్రోల్‌రూమ్ సిబ్బంది గోపాలపురం పోలీసులను అప్రమత్తం చేశారు. గోపాలపురం పోలీసులు రెజిమెంటల్ బజార్‌లోని తాతాచారి కాంపౌండ్‌కు వెళ్లి బాత్రూమ్లో తలదాచుకున్న అరుణను రక్షించారు. అదే సమయంలో ఆమె భర్త చంద్రశేఖర్, అత్త లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. భర్త, అత్తను రిమాండ్‌కు తరలించారు.