సాక్షి సూర్యాపేట: వరకట్న వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రణయ్ నల్గొండ జిల్లా కొర్లపాడుకు చెందిన లావణ్య ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లికి ముందు బాగా చూసుకున్న ప్రణయ్, వివాహం జరిగినప్పటి నుంచి లావణ్యను వేధించసాగాడు. అదనపు కట్నం తీసుకు రమ్మని ఒత్తిడి చేశాడు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నమ్మించి మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య శనివారం పురుగుల మందు సేవించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
‘నన్ను ఎందుకు దూరం పెట్టావు. ఎక్కడ ఉన్నావ్. నేను పురుగుల మందు తాగాను’ అంటూ లావణ్య చివరగా ప్రణయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కట్నకానుకలు ముట్టజెప్పామని, అయినా అదనపు కట్నం కావాలంటూ ప్రణయ్ వేధించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డ చావుకు ప్రణయ్ వేధింపులే కారణమని తెలిపారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment