హైదరాబాద్ : పెళ్లయిన ఐదు నెలలకే ఓ యువతి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఎల్బీనగర్‌లోని శివనగర్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఉదయం 5 గంటలకు అత్తవారింటికి చేరుకున్న ఆమె ఆరు గంటలకు విగతజీవిగా మారింది. ఆమెకు రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రంజిత్ గౌడ్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. దాదాపు రూ.కోటి వరకు కట్నంగా తీసుకున్న రంజిత్ మరింత కట్నం కావాలని అత్తమామలు, భార్యను వేధించి చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.