కట్నం కోసం కోడలిని హతమార్చిన అత్త | Dowry death in Jinnaram | Sakshi
Sakshi News home page

కట్నం కోసం కోడలిని హతమార్చిన అత్త

Published Mon, May 30 2016 7:10 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Dowry death in Jinnaram

జిన్నారం (మెదక్) : అదనపు కట్నం వేధింపులకు నవ వధువు బలైన సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం దోమడుగులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(19)కు ప్రభాకర్‌గౌడ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో మౌనిక వంట చేస్తున్న సమయంలో అత్త అనసూయ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.

దీంతో మంటల్లో పూర్తిగా కాలిపోయిన మౌనికను నగరంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందింది. ఆమె మృతిచెందడానికి ముందు అత్త అనసూయే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిందని మరణ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement