నిజాంసాగర్ (నిజామాబాద్) : పెళ్లయిన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మాహుతితో తనువు చాలించింది. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దుంపల హేమలత(22)కు రెండు నెలల క్రితం పిట్లం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది.
అయితే ఇటీవలే పుట్టింటికి వెళ్లిన హేమలత శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
నవవధువు ఆత్మాహుతి
Published Fri, Sep 11 2015 6:08 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement