Nizamsagar
-
ఆధార్‌కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘సాగర్’ తీరాన చిరుత సంచారం.. కారుకు అడ్డం తిరిగి..
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హెడ్‌స్లూయిస్, నవోదయ విద్యాలయం, నిజాంసాగర్ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు ప్రవీణ్, శివ, కిశోర్ కలిసి కారులో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శన ఆదివారం వచ్చారు. ప్రాజెక్టు పరిసరాల్లో సేదతీరిన వీరు సాయంత్రం వేళ ఇంటికి కారులో బయలు దేరారు. నిజాంసాగర్ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై కారుకు అడ్డంగా చిరుత పులి బైఠాయించడంతో వాహనాన్ని నిలిపి వేసి డోర్లు లాక్ చేసుకున్నారు. కొద్దిసేపటికి చిరుతపులి నిజాంసాగర్ మండల కేంద్రానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గం వైపు చిరుతపులి వెళ్లడంతో కారులో ఉన్న స్నేహితులు చిరుత కదలికలను సెల్‌ఫ్లోన్లల్లో బందించారు. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో చిరుత పులి సంచారంతో పర్యాటకులు బెంబేలెత్తుతున్నారు. అంతేకాకుండా హెడ్‌స్లూయిస్ జల విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు 33 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిసరాల్లో చిరుత సంచారం ఎక్కువైందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో పర్యాటకులు మరింత అప్రమత్తం అవుతున్నారు. (చదవండి: 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. ) -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఇక రాష్ట్రవ్యాప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నలుదిశలా దళితబంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటు అమలుచేయాలని సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఎంపికైన ఆ నాలుగు మండలాలు ఇవే.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం: చింతకాని మండలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: తిరుమలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం: చారగొండ మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలం ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
దీపావళి పండగపూట విషాదం
-
ఒక్కటి తప్ప అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహాలు నమోదు కావడంతో నాలుగేళ్ల తర్వాత బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ నీరంతా నిజాంసాగర్‌కు వెళ్తుండటంతో అక్క డా ప్రవాహాలు పెరిగాయి. నేడో రేపో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. తెరుచుకున్న సింగూరు గేట్లు... సింగూరు ప్రాజెక్టులో బుధవారం ఉదయం మూడు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ 28.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో ఈ నీరంతా నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 41,851 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నిల్వ 17.80 టీఎంసీలకుగానూ 11.10 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నిల్వ 16 టీఎంసీలకు చేరి, ప్రవాహాలు ఇదే రీతిన ఉంటే గురువారంరాత్రిగానీ, శుక్రవారంగానీ గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీకి కాస్త ప్రవాహాలు తగ్గాయి. బుధవారం 24 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. లోయర్ మానేరుకు 96 వేల క్యూసెక్కులు, మిడ్‌మానేరుకు 29వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ ప్రాజెక్టులన్నీ నిండి ఉండటంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ప్రవాహ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలంలోకి 3.47 లక్షలు, సాగర్‌లోకి 2.73 లక్షలు, పులిచింతలకు 4.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఈ నీటినంతా దిగువకు విడిచి పెడుతుండటంతో బంగాళాఖాతం వైపు వెళుతోంది. అలుగు దుంకుతున్న 24,192 చెరువులు రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులకు జలకళ వచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లో 24,192 చెరువులు అలుగు దుంకుతున్నా యి. మరో 11,972 చెరువులు వందకు వంద శాతం నీటితో అలుగులు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణాబేసిన్‌లో 23,301 చెరువులకుగానూ 14,900 చెరువులు నిండగా, మరో 3,766 చెరువులు పూర్తిగా నిండాయి. అత్యధికంగా మెదక్ జిల్లా పరిధిలో 6,993 చెరువులు అలుగు పా రుతుండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4,644 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గోదావరి బేసిన్లో మొత్తంగా 20,111 చెరువులుండగా, ఇందులో 9,292 చెరువులు అలుగు పారుతున్నా యి. మరో 8,206 చెరువులు వంద శాతం మేర నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 2,795 చెరువులు, కరీంనగర్లో 2,578 చెరువులు, వరంగల్ జిల్లాలో 2,209 చెరువులున్నాయి. మంగళ, బుధవారం కురిసిన భారీ వర్షాలకు 152 చెరువులకు గండ్లు పడ్డాయి. మొత్తంగా ఈ సీజ న్లో 661 చెరువులకు గండ్లు, బుంగలు పడటం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. -
నిజాంసాగర్‌పై మూడు ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: నిజాంసాగర్ నుంచి జలాలు శ్రీరాంసాగర్‌కు వెళ్లే దారిపై సాగర్ ప్రధాన కాల్వలపై రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో ఒకటి మంజీరా ఎత్తిపోతలను చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలపగా, కొత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల పరధిలో జకోరా, చండూరు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రతిపాదించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ప్రణాళికను రూపొందించాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. నిజాం సాగర్, సింగూరు జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీళ్లు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. గుత్ప, అలీ సాగర్ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందివ్వాలని సూచించారు. దీనికి వెంటనే సర్వే చేసి, లిఫ్టులు ఎక్కడెక్కడ పెట్టాలి.. వాటి ద్వారా ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీనికనుగుణంగా అధికారులు బాన్సు వాడలో నిజాం సాగర్ ప్రధాన కాల్వపై రెండు ఎత్తిపోతలు ప్రతిపాదించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. జకోరా ఎత్తిపోతలతో రూ.4,200 ఎకరాలు, చండూర్ ఎత్తిపోతలతో 2,850 ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే నిజాంసాగర్ దిగువన మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం సాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. -
వివాహేతర సంబంధం: నమ్మించి చంపేశారు!
సాక్షి, నిజాంసాగర్: తరచూ కుటుంబ కలహాలు అవుతున్నాయన్న అనుమానంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేశారు. నిజాంసాగర్ మండలం సింగితం గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం జరిగిన హత్య ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం దక్కల్‌దాని తండాకు చెందిన బోడ అరుణ(35) అనే వివాహితతో, ముదెల్లికి చెందిన వట్నాల అంజయ్య చనువుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడంతో మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి అంజయ్య తన భార్య, పిల్లలతో తరచూ గొడవలు పడ్డాడు. అంజయ్య భార్య కాశవ్వకు, అరుణపై అనుమానం వచ్చింది. తన భర్తతో సంబంధం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని కక్ష పెట్టుకున్న కాశవ్వ అరుణను అంతం చేసేందుకు పన్నాగం పన్నింది. ముదెల్లికి చెందిన సుతారి బాలయ్య సహాయం తీసుకుంది. ఎప్పటిలాగే అరుణతో కలిసి కాశవ్వ బాన్సవాడ పట్టణానికి వచ్చింది. తమ బంధువులు పండుగ చేస్తున్నారని, ఊరికి వెళ్దామని అరుణతో నమ్మబలికింది. అప్పటికే సుతారి బాలయ్య గాలీపూర్ గేటు వద్ద వీరి కోసం కాపు కాస్తున్నాడు. బాన్సువాడ నుంచి కాశవ్వ, అరుణ ఇద్దరు కలిసి ఆర్టీసీ బస్సులో వచ్చారు. గాలీపూర్ గేటు వద్ద బస్సు దిగి నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై నుంచి కాలినడకన వచ్చారు. అక్కడే ఉన్న బాలయ్య, కాశవ్వ, అరుణ కలిసి సింగితం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. తర్వాత బాలయ్య తన ధోతిని అరుణ గొంతు చుట్టూ చుట్టి నులిమాడు. ఊపిరాడకుండా కొట్టుకుంటున్న అరుణపై కాశవ్వ బండరాయితో మోదడటంతో అరుణ మృతి చెందింది. దాంతో బాలయ్య, కాశవ్వ తిరిగి బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి ముదెళ్లికి వెళ్లారు. తండా నుంచి వెళ్లిన అరుణ రాత్రి వరకు ఇంటికి రాకపోవడం, ఆచూకీ లేక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ వెంట కాశవ్వ వెళ్లినట్లు తండావాసులు ఫిర్యాదులో పేర్కొనడంతో హత్య ఉందంతం వెలుగులోకి వచ్చింది. కాశవ్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అరుణను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దాంతో బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, పట్టణ సీఐ మహేశ్‌గౌడ్, స్థానిక ఎస్ఐ సాయన్న పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బోడ అరుణ మృతదేహం: మృతదేహాన్ని మోసుకు వస్తున్న సిబ్బంది -
‘మతం పేరిట బీజేపీ రాజకీయం’
కామారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణా వాసులు సత్తా చాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జహీరాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరవేయాలో మనమే నిర్ణయించాలని అన్నారు. బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఏం చేస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చినా కూడా వాళ్లకు గుర్తులేదేమో అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండని మోదీని అడిగామని, కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన షబ్బీర్ అలీ మళ్లీ ఈసారి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారట.. మళ్లీ కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడివారక్కడ పని చేసి బూత్ లెవెల్లో సత్తా చాటాలని సూచించారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు కూడా రైతు బంధు చెక్కులు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ, పెన్షన్లు అన్నీ వెళ్తున్నాయని గుర్తు చేశారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
నిజాంసాగర్ : సింగితం గ్రామంలో బుధవారం మల్లయోధులకు నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు. రెండు రోజులుగా ఆలయం వద్ద ఎడ్ల బండ్లు, బోనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయం ఆవరణలో మల్లయోధులకు కుస్తీపోటీలు జరిపారు. చుట్టు పక్క గ్రామాల నుంచి మల్ల యోధులు తరలిరావడంతో కుస్తీపోటీలు పోటా పోటీగా జరిగాయి. గెలుపొందిన వారికి సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, సర్పంచ్ ఆనందపల్లి వీరమణి, టీఆర్ఎస్ నాయకులు కలకొండ నారాయణ, సాయాగౌడ్ నగదును బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో గున్కుల్æ సోసైటీ వైస్‌చైర్మన్ సంగారెడ్డి నాయకులు బచ్చిగారి వెంకటేశం, సాయిలు, సంగయ్య, విఠల్, శ్రీదర్‌రెడ్డి న్నారు. హన్మాజీపేట్‌లో.. బాన్సువాడటౌన్ : హన్మాజీపేట్ గ్రామంలో బుధవారం కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుస్తీవీరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ సంగ్రామ్ నాయక్ నగదు బహుమతులు అందజేశారు. కుస్తీపోటీలు ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిరాం, గ్రామపెద్దలు సుధాకర్‌రెడ్డి, బోనాల సాయిలు పాల్గొన్నారు. -
దాహంతో వచ్చి.. కాలువలో పడి..
నిజాంసాగర్(జుక్కల్): వేసవి కాలం ఆరంబానికి ముందే వన్యప్రాణులకు తాగునీటి తిప్పలు ప్రారంభమయ్యాయి. నీటికోసం వచ్చిన మూడు నీల్గాయ్లు గురువారం నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కాలువలో పడిపోయాయి. రిజర్వాయర్ కాలువలో నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు బాన్సువాడ అటవీశాఖ సెక్షన్ అధికారి సిద్ధార్థకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాన్సువాడ డివిజనల్ అటవీశాఖ అధికారి గోపాల్రావ్, సెక్షన్ ఆఫీసర్ సిద్ధార్థ సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి వాటిని బయటికి తీశారు. ఒక నీల్గాయ్ రహదారి వెంట పరుగులు పెట్టడంతో ఊర కుక్కలు వెంబడించాయి. దీంతో అది నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి దూకింది. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం 1,600 క్యూసెక్కులు ఉండడంతో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు సిరాజుద్దీన్, హన్మాండ్లు కాలువలోకి దూకి, తాళ్లతో బంధించి సురక్షితంగా బయటకు తీశారు. ఆ నీల్గాయ్కి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలారు. -
నవవధువు ఆత్మాహుతి
నిజాంసాగర్ (నిజామాబాద్) : పెళ్లయిన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మాహుతితో తనువు చాలించింది. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దుంపల హేమలత(22)కు రెండు నెలల క్రితం పిట్లం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది. అయితే ఇటీవలే పుట్టింటికి వెళ్లిన హేమలత శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
2 ఇసుక లారీలు సీజ్
నిజామ్‌సాగర్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అధికారులు శుక్రవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. గత కొంత కాలంగా నిజామాబాద్ జిల్లాలో రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో రవాణాను అడ్డుకోవడానికి అధికారులు నిఘా పెట్టారు. అందుకోసం ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిజామ్‌పట్టణంలోని నౌర్సింగ్‌రావుపల్లి వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పాల్గొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
ఆ ఊరిలో మద్యం నిషేధం
డోంగ్లీ గ్రామస్తుల నిర్ణయం భేష్ నిజాంసాగర్ : మద్యానికి బానిసలుగా మారుతూ, ఆనారోగ్యాల బారిన పడంతో పాటు చెడు వ్యసనాల బారిన పడుతున్న కుటుంబాలను కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎంపీపీ గోదావరిబస్వంత్ రావ్ పటేల్ అన్నారు. అ ధికారులు, ప్రజలందరి సహకరంతో మద్యాపాన నిషేధం సాధ్యమవుతుందన్నారు. మద్నూర్ మండ లం డోంగ్లి గ్రామంలో మద్యపాన నిషేధంపై గురువారం స్థానిక సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. డోంగ్లి గ్రామస్తులు మద్యపాన నిషేధం కో సం 15 రోజుల కిందట తీసుకున్న నిర్ణయం హర్షణీయంగా ఉందన్నారు. ప్రతిఒక్కరి సహకారంతో గ్రా మంలో మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని పే ర్కొన్నారు. అనంతరం బిచ్కుంద సీఐ సర్దార్‌సింగ్ మాట్లాడుతూ మద్యపానం పట్ల గ్రామస్తుల ని ర్ణయం అభినందనీయమన్నారు. మార్చి15 లోగా గ్రామంలో వందశాతం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. మద్యపానం వల్ల అనేక కు టుంబాలు నాశనం కావడంతో పాటు బతుకులు చి ధ్రమవుతున్నాయన్నారు. యువత, ప్రజలకు చెడువ్యసనాలకు బానిసలుగా మారడంతో పాటు పగలు ప్రతీకారాలకు దారితీస్తాయన్నారు. గ్రామస్తులు తీ సుకున్న నిర్ణయానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల పరంగా పూర్తిసహకారం అందిస్తామన్నారు. అంతకుముందు సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ మాట్లాడుతూ మద్యానికి డబ్బులు ఖర్చుచేస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మద్యపాన నిషేదానికి గ్రామస్తులులు ముందుకురావడంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎస్సైలు సుదర్శన్, శ్రీకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ కల్పన గ్రామపెద్దలు దిగంబర్‌రావ్, ఆనంద్పటేల్ కళాశాల లెక్చరర్లు గంగాదర్,సన్నీ గ్రామస్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
పట్టాలి అరక.. దున్నాలి మెరక
వానలు లేవు. ఎండలు మండుతున్నయి. పంటలు మాడిపోయినయి. కరువు తరుముకొస్తోంది. తీరని దుఃఖంతో కొందరు రైతులు ఎండిన పంటలకు నిప్పు పెట్టిండ్రు. ధైర్యం సడలని మరి కొందరు రైతులు నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ‘నాగేటి సాల్లల్లో నా తెలంగాణ.. నా తెలంగాణ’ అంటూ పంటల సాగుకు సమాయత్తమవుతుండ్రు. మనసుంటే మార్గం లేదని నిరూపిస్తుండ్రు. ఆశల వేటను ఆనందంగా సాగిస్తుండ్రు. సింగూరుతో ప్రమాదముందని తెలిసినా వారు ముందుకే ‘సాగు’తుండ్రు. - నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియా * శిఖం భూములలో నాగేటి సాళ్లు * దుక్కులు దున్నుతున్న రైతన్నలు * శనగ, మొక్కజొన్న విత్తుతున్నరు * ఊరును విడిచి, పట్టాభూములు వదిలి * ఆశల సాగుకు అన్నదాత అడుగులు నిజాంసాగర్: ఉన్న ఊరు.. పట్టా భూములను వదిలి శిఖం భూములలో అన్నదాతలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వానలు ఆశిం చిన మేరకు కురవకపోవడంతో.. నీళ్లులేక నల్ల రేగడి మట్టి తేలిన నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూములలో ఆరుతడి పంటలను వే స్తున్నారు. వారం రోజుల నుంచి ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల లో నాగటి సాల్లు జోరందుకున్నాయి. అరక చేతపట్టిన రైతన్నలు శిఖం భూముల్లో శనగ, జొన్న విత్తనాలు చల్లుతున్నారు. మంజీరా నదిపై ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్ర స్తుతం నీళ్లులేక బోసి పోయి ఉన్నా, పచ్చని పంటల సాగుకు నిలయం కానుంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడ శనగ, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. వేల ఎకరాలలో నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించిన ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా అపరాల సాగుకు దోహదపడుతోంది. ఖరీఫ్ సీజన్లో వానలు కురవక పోవడంతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు రబీ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఉపాధి కోసం అన్వేషిస్తున్న రైతులు పట్టాభూములలో పంటలు వేయలేక శిఖం భూములను ఆశ్రయించారు. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది మంది రైతులు శిఖం భూములలో పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటల సాగుకు సమాయత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూములలో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. నాగళ్లు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని సుమా రు 300 ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు. సింగూరు నీరొస్తే మునిగినట్టే... నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో శిఖం భూములలో రైతులు పండిస్తున్న శనగ, జొన్న పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది.సాగర్ ఆయకట్టు కింద పండిస్తున్న పంటల కోసం, ఒక వేళ సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌కు నీటి విడుదల చేస్తే శిఖం భూములు మునిగిపోతాయి. రైతన్నలు ఆశతో సాగు చేస్తున్న పంటలు సైతం నీటి పాలవుతాయి. అయినా కుటుం బపోషణ కోసం ధైర్యం చేసి వేల రూపాయలు ఖర్చు చేస్తూ పంటలను సాగు చేస్తున్నారు. కరువును జయించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. -
ప‘రేషన్’
నిజాంసాగర్: సంక్షేమ పథకాల అమలులో అక్రమాలపై విచార ణ చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల వద్ద ఉన్న ‘తెల్లరేషన్ కార్డుల’ ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా సక్రమంగా అందాలన్న సంకల్పంతో రేషన్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసం ధానం చేసుకోవాలని సూచించింది. ఫలితంగా ఒక కుటుంబానికి రెండు చొప్పున ఉన్న రేషన్‌కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్న కార్డుల ఏరివేతకు అవకాశం లభించింది. గత ప్రభుత్వం మూడవ విడత రచ్చబండ కార్యక్రమం ద్వారా పంపిణీ చేసిన రేషన్ కూపన్లపైనా అధికారులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యుల ఫొటోల ఆధారంగా పరిశీలన ప్రారంభించారు. ఆధార్ నంబర్లను నమో దు చేసుకోని కూపన్‌దారులకు రేషన్ సరుకులను నిలిపివేశారు. సరుకుల పంపిణీలో జాప్యం జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు, 718 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు 6.5 లక్షల కుటుంబాలకు ప్రభుత్వంసరుకులను రాయితీపై అందిస్తోంది. ఇందుకోసం జిల్లాకు 10,700 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తోంది. డీలర్లు నెలనెలా డీడీలు కట్టి సరుకులను తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గత నెల యథావిధిగా రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టినా జిల్లాకు మాత్రం కోటాను కేటాయించలేదు. దీంతో సెప్టెం బర్ నెల సరుకుల పంపిణీ ఆలస్యమవుతోంది. లబ్ధిదారులు దుకాణాల చుట్టు చక్కర్లు కొడుతున్నారు. అయోమయంలో ‘రచ్చబండ’ కూపన్‌దారులు గత ప్రభుత్వం నిర్వహించిన మూడో విడత రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు పొందిన లబ్ధిదారులు తమకు సరుకులు వస్తాయోలేదోనని ఆయోమయంలో పడిపోయారు. అప్పటికే తెల్ల రేషన్‌కార్డులలో పేర్లు ఉండి, కొత్తగా రేషన్ కూపన్లు పొందిన కుటుంబాలను గుర్తించేందుకు అధికారు లు యత్నిస్తున్నారు. దీంతో సరుకుల పంపిణీ ఆలస్యమవుతోందని సమాచారం. కూపన్ల ద్వారా రేషన్‌సరుకులు పొం దుతున్నవారు ఆధార్ నంబర్‌ను నమోదు చేయించకపోవడంతో ప్రభుత్వం కూపన్లకు సరుకులను నిలిపి వేసిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. 60 వేల కుటుంబాల సంగతి అంతేనా! జిల్లావ్యాప్తంగా 60 వేల కుటుంబాలకు రేషన్ కూపన్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు కుటుంబాల ఫొటో, ఆధార్ నంబర్లను డీలర్లు, రెవెన్యూ అధికారులకు అందించలేదు. దీంతో వీరికి సరుకులు అందే అవకాశం లేదు. బోగస్‌కార్డులు కలిగినవారితోపాటు, ఉద్యోగాలు ఉన్నవారికి సర్కారు సరుకులను నిలిపివేస్తోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసమే సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటాను ప్రభుత్వం జిల్లా, మండలాలు, గ్రామాలవారీగా కేటాయించలేదు. అందుకే సరుకుల పంపిణీ ఆలస్యం కానుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 5 లోగా నమోదు చేసుకోవాలి మూడవ విడత రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు పొందినవారు కుటుంబాల ఫొటోలు, ఆధార్ నంబర్లను ఈ నెల ఐదులోగా కంప్యూటర్లలో నమోదు చేయించుకోవాలి. రేషన్ కార్డులలో పేర్లు ఉండి కూపన్లు పొందినవారిని ఏరి వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. - కొండల్రావు, డీఎస్ఓ -
‘పాడి’కోసం పశుగ్రాసం..
నిజాంసాగర్ : పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి, పప్పుజాతి అని రెండు రకాలుంటాయి. జొన్నజాతికి చెందినవి ధాన్యపు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు. వీటికి కాయలుండవు. కంకులుండడం వల్ల పిండిపదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. పప్పుజాతి పశుగ్రాసాల పంటలకు కాయలు కాస్తాయి. వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. వీటి వేర్లలోని నత్రజని, బుడిపెల వల్ల నేలలో నత్రజని పెరిగి భూమి సారవంతం అవుతుంది. ఏడాది పొడవునా.. డెయిరీ ఫాంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా పశుగ్రాసాలను సాగు చేయాలి. అప్పుడే పాడి పశువులకు పోషకాలు అంది, పాలదిగుబడులు పెరుగుతాయి. పాలల్లో వెన్నశాతం బాగుంటుంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తే 20 పాడి పశువులకు సరిపడా మేత ఏడాది పొడవునా లభిస్తుంది. నీటి వసతి ఉన్న భూముల్లో ఏపీబీఎన్-1, కొ1 పారావంటి ధాన్యపు జాతి, లూసర్న్ వంటి పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేస్తే మూడు నాలుగేళ్ల వరకు పశుగ్రాసం తిప్పలు ఉండవు. వర్షాధారంగా తేలికపాటి భూముల్లో ఎస్ఎస్జీ-59-3 రకం ధాన్యపు జాతి, అలసంద, పిల్లిపెసర వంటి పప్పుజాతి ఏకవార్షిక పశుగ్రాసాలను మిశ్రమపంటలుగా సాగు చేసుకోవచ్చు. అలసంద జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ పశుగ్రాసాన్ని పండించవచ్చు. ఇది ఏకవార్షిక, కాయజాతి పశుగ్రాసం. ఇది తీగలాగా పైకి వస్తుంది. కాండం పొడవుగా ఉంటుంది. పశువులకు పుష్టికరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. అనువైన భూములు : అన్నిరకాల భూముల్లో సాగుచేసుకోవచ్చు. నీరు నిలవని భూముల్లో ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకుంటే మంచిది. అధిక దిగుబడినిచ్చే రకాలు : ఈసీ -4216, యూపీసీ-5286, 5287, అలసంద- 2201, ఎన్పీ-3 విత్తనాలు : ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. మిశ్రమ పంటగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేస్తే 6 నుంచి 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. కావాల్సిన ఎరువులు : విత్తనాలు వేసేముందు దుక్కిలో ఎకరానికి పది బండ్ల కంపోస్ట్ ఎరువు, పది కిలోల యూరియా, 20 నుంచి 24 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. నీటితడి : పదిహేను రోజులకోసారి నీటితడి అవసరం. వర్షాలు కురిస్తే నీరు పారించకపోయినా పరవాలేదు. వేసవిలో ఏడు రోజులకోసారి నీటిని పెట్టాలి. మేత దిగుబడి : విత్తిన రెండు నెలల తర్వాత మొదటి కోత అందుతుంది. పూతదశలో ఉండగా పంట యాభై శాతం కోయాలి. ఎకరానికి 8-10 టన్నుల పచ్చిమేత లభిస్తుంది. సజ్జ తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకు అనువైన పశుగ్రాసం ఇది. తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ధాన్యపుజాతికి చెందినది. జొన్న రకాలకన్నా అధిక శాతం మాంసకృతులు కలిగి ఉంటుంది. అనువైన నేలలు : అన్నిరకాల నేలలు ఈ పంట సాగుకు అ నువైనవి. ఇసుక, చవుడు నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలు: టీ-55, కే-599, 533, ఐ-72, 74, జెంట్రాజ్కో 5-530. విత్తనాలు : ఎకరానికి 4-6 కిలోల విత్తనాలు అవసరం. మొక్క అంతరం : భూమిలో మూడు సెంటీమీటర్లకన్నా లోతులో విత్తనాలు వేయకూడదు. మొక్కకు మొక్కకు మధ్య 4 నుంచి 5 అంగుళాలు, సాళ్ల మధ్య 9 నుంచి 10 అంగుళాల అంతరం ఉండాలి. అనువైనకాలం : జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు కావాల్సిన ఎరువులు : దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 బండ్ల కంపోస్ట్ ఎరువులు వేయాలి. విత్తే ముందు 22 కిలోల యూరియా, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి చల్లాలి. విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజులకు 20 కిలోల యూరియా వేయాలి. నీటితడి : వర్షకాలంలో(వర్షాలు కురుస్తున్నప్పుడు) నీరు పారించాల్సిన అవసరం లేదు. వేసవి కాలంలో 10నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడిపెట్టాలి. మేత దిగుబడి : విత్తిన 60 నుంచి 70 రోజులకు మొదటిసారి, తదుపరి 40, 45 రోజులకు రెండోసారి కోయవచ్చు. ఎకరానికి 12 నుంచి 14 టన్నుల పచ్చిమేత లభిస్తుంది.