ఆ ఊరిలో మద్యం నిషేధం
డోంగ్లీ గ్రామస్తుల నిర్ణయం భేష్
నిజాంసాగర్ : మద్యానికి బానిసలుగా మారుతూ, ఆనారోగ్యాల బారిన పడంతో పాటు చెడు వ్యసనాల బారిన పడుతున్న కుటుంబాలను కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎంపీపీ గోదావరిబస్వంత్ రావ్ పటేల్ అన్నారు. అ ధికారులు, ప్రజలందరి సహకరంతో మద్యాపాన నిషేధం సాధ్యమవుతుందన్నారు. మద్నూర్ మండ లం డోంగ్లి గ్రామంలో మద్యపాన నిషేధంపై గురువారం స్థానిక సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు.
డోంగ్లి గ్రామస్తులు మద్యపాన నిషేధం కో సం 15 రోజుల కిందట తీసుకున్న నిర్ణయం హర్షణీయంగా ఉందన్నారు. ప్రతిఒక్కరి సహకారంతో గ్రా మంలో మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని పే ర్కొన్నారు. అనంతరం బిచ్కుంద సీఐ సర్దార్‌సింగ్ మాట్లాడుతూ మద్యపానం పట్ల గ్రామస్తుల ని ర్ణయం అభినందనీయమన్నారు. మార్చి15 లోగా గ్రామంలో వందశాతం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్నారు.
మద్యపానం వల్ల అనేక కు టుంబాలు నాశనం కావడంతో పాటు బతుకులు చి ధ్రమవుతున్నాయన్నారు. యువత, ప్రజలకు చెడువ్యసనాలకు బానిసలుగా మారడంతో పాటు పగలు ప్రతీకారాలకు దారితీస్తాయన్నారు. గ్రామస్తులు తీ సుకున్న నిర్ణయానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల పరంగా పూర్తిసహకారం అందిస్తామన్నారు. అంతకుముందు సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ మాట్లాడుతూ మద్యానికి డబ్బులు ఖర్చుచేస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
మద్యపాన నిషేదానికి గ్రామస్తులులు ముందుకురావడంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎస్సైలు సుదర్శన్, శ్రీకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ కల్పన గ్రామపెద్దలు దిగంబర్‌రావ్, ఆనంద్‌పటేల్ కళాశాల లెక్చరర్లు గంగాదర్,సన్నీ గ్రామస్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.