నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హెడ్‌స్లూయిస్, నవోదయ విద్యాలయం, నిజాంసాగర్ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు ప్రవీణ్, శివ, కిశోర్ కలిసి కారులో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శన ఆదివారం వచ్చారు. ప్రాజెక్టు పరిసరాల్లో సేదతీరిన వీరు సాయంత్రం వేళ ఇంటికి కారులో బయలు దేరారు.
నిజాంసాగర్‌ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై కారుకు అడ్డంగా చిరుత పులి బైఠాయించడంతో వాహనాన్ని నిలిపి వేసి డోర్లు లాక్ చేసుకున్నారు. కొద్దిసేపటికి చిరుతపులి నిజాంసాగర్ మండల కేంద్రానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గం వైపు చిరుతపులి వెళ్లడంతో కారులో ఉన్న స్నేహితులు చిరుత కదలికలను సెల్‌ఫ్లోన్లల్లో బందించారు.
(చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది)
కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో చిరుత పులి సంచారంతో పర్యాటకులు బెంబేలెత్తుతున్నారు. అంతేకాకుండా హెడ్‌స్లూయిస్ జల విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు 33 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిసరాల్లో చిరుత సంచారం ఎక్కువైందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో పర్యాటకులు మరింత అప్రమత్తం అవుతున్నారు.
(చదవండి: 15 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. )
Comments
Please login to add a commentAdd a comment