Leopard wandering
-
‘సాగర్’ తీరాన చిరుత సంచారం.. కారుకు అడ్డం తిరిగి..
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హెడ్‌స్లూయిస్, నవోదయ విద్యాలయం, నిజాంసాగర్ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు ప్రవీణ్, శివ, కిశోర్ కలిసి కారులో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శన ఆదివారం వచ్చారు. ప్రాజెక్టు పరిసరాల్లో సేదతీరిన వీరు సాయంత్రం వేళ ఇంటికి కారులో బయలు దేరారు. నిజాంసాగర్ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై కారుకు అడ్డంగా చిరుత పులి బైఠాయించడంతో వాహనాన్ని నిలిపి వేసి డోర్లు లాక్ చేసుకున్నారు. కొద్దిసేపటికి చిరుతపులి నిజాంసాగర్ మండల కేంద్రానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గం వైపు చిరుతపులి వెళ్లడంతో కారులో ఉన్న స్నేహితులు చిరుత కదలికలను సెల్‌ఫ్లోన్లల్లో బందించారు. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో చిరుత పులి సంచారంతో పర్యాటకులు బెంబేలెత్తుతున్నారు. అంతేకాకుండా హెడ్‌స్లూయిస్ జల విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు 33 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిసరాల్లో చిరుత సంచారం ఎక్కువైందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో పర్యాటకులు మరింత అప్రమత్తం అవుతున్నారు. (చదవండి: 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. ) -
చిరుత సంచారం!
సాక్షి, వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం వేలూరు శివారు వ్యవసాయ క్షేత్రాల్లో చిరుత కనిపించింది. గురువారం రాత్రి వ్యవసాయ పొలాలకు కాపలా వెళ్లిన రైతులకు అక్కడ చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పొరుగు రైతులను అప్రమత్తం చేస్తూనే అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం చేరవేశారు. చిరుత భయంతో తమ పాడి పశువులను సంరక్షించుకునేందుకు రాత్రంతా పంట చేల వద్దే మంటలు వేసుకుని జాగారం చేశారు. మండలంలో కలకలం రేపిన చిరుత సంచారం సంఘటనకు సంబంధించి అటవీ అధికారులు, గ్రామ రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్గల్ మండలం వేలూరు–మీనాజీపేట రోడ్డు మార్గంలో ఎత్తైన గురుమన్గుట్ట ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే ఓ పక్క అడవి, మరోవైపు వేలూరు రైతుల వ్యవసాయ పొలాలు ఉంటాయి. ప్రతి ఏడాది మాదిరిగా రైతులు మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. అక్కడే తమ పాడి పశువులను కట్టేసి, రాత్రి వేళ అడవి పందుల బారిన పంటపొలాలు దెబ్బతినకుండా రైతులు కాపలా వెళ్తారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 10.30–11.00 గంటల ప్రాంతంలో వేలూరు రైతు (గోపాలమిత్ర) ఉప్పరి ఆంజనేయులు తన మొక్కజొన్న చేను కావలికి బయల్దేరాడు. మొక్కజొన్న చేను పక్కనే చెట్టుకింద చిరుతపులి పడుకుని సేదతీరుతున్నట్లు గమనించాడు. అలికిడి విని అది చేనులోకి పరుగులు పెట్టగా భయాందోళనకు గురైన ఆంజనేయులు పొరుగు రైతులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే వారు చిరుత కన్పించిన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని గజ్వేల్ ప్రాంత అటవీ అధికారులకు, గౌరారం పోలీసులకు సమాచారం చేరవేశారు. చిరుత కన్పించిన ప్రదేశంలో మంటలు వేసి రైతులు నిఘా వేయగా కొద్దిసేపటికి మరోసారి పెద్ద ఆంజనేయులు అనే రైతుకు చిరుత కన్పించి మాయమైపోయింది. ఆ ప్రదేశానికి చేరుకున్న అటవీ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి వేణుగోపాల్, బీట్ ఆఫీసర్ శ్రావణ్, వాచర్ కుమార్, గౌరారం పోలీసులు చిరుత సంచరించినట్లు రైతులు చెప్పిన ప్రదేశాలను పరిశీలించారు. నేల ఎండిపోయి ఉండడంతో చిరుతకు సంబంధించిన పాదముద్రలు మాత్రం కన్పించలేదు. గురువారం చిన్నశంకరంపేట మండలం కామారం తండా గుట్టలలో చిరుత ప్రత్యక్షం కావడం, అదే రోజు రాత్రి వర్గల్ మండలం వేలూరు అటవీ ప్రాంత సమీప వ్యవసాయ క్షేత్రాల రైతులు చిరుతను చూసినట్లు చెబుతుండటంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మరోసారి సందర్శించిన అధికారులు.. చిరుత కన్పించినట్లు చెబుతున్న ప్రాంతాన్ని శుక్రవారం మధ్యాహ్నం అటవీ అధికారి వేణుగోపాల్ బృందం మరోసారి సందర్శించి పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకనప్పటికీ వేలూరుతో పాటు వర్గల్ మండల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. చిరుత, హైనా తదితర అటవీ జంతువుల బారిన తమ పశుసంపద పడిపోకుండా ఇనుప మెష్‌లతో కూడిన కొట్టాలను రైతులు నిర్మించుకోవాలని సూచించారు. చిరుత కన్పించిన సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశామని, వారి ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. కాగా వేలూరులో చిరుత కనపడిందనే వార్త మండలం మొత్తం వ్యాపించడం, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తూ వీడియోను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. -
కొసలమర్రిలో చిరుత సంచారం?
సాక్షి, హాలియా(నల్గొండ) : అనుముల మండలంలోని కొసలమర్రి గ్రామ శివారులో చిరుతపులి సంచారం చేస్తుందని ప్రజలు, రైతులు భయాందోళన చెందారు. మంగళవారం కొసలమర్రి, వెంకటాపురం, కొత్తల్లూరు గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత సంచరించినట్లు ప్రచారం దావనంలా వ్యాపించింది. కొసలమర్రి గ్రామానికి చెందిన రైతు బాసిరెడ్డి కృష్ణారెడ్డి తన బత్తాయి తోటలో అంతర పంటగా పుచ్చసాగు చేశాడు. ఉదయం బైక్‌పై కృష్ణారెడ్డి గ్రామం నుంచి తన తోట వద్దకు బయలుదేరాడు. తన వ్యవసాయ భూముల్లో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన రైతు భయాందోళనతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు అశోక్‌రెడ్డి, పార్వతీ హుటాహుటీన ఘటన స్థలం వద్దకు చేరుకుని పాదముద్రలను సేకరించి హైనా జంతువు అడుగులుగా గుర్తించారు. ముక్కమాల, వెంకటాద్రిపాలెం, కొత్తల్లూరు సమీప ప్రాంతాల్లో హైనాలు సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయా ప్రాంతాల్లో త్వరలో బోనులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళన చెందాలి్సన అవసరం లేదని పేర్కొన్నారు. -
శ్రీశైలం ఘాట్‌లో చిరుత సంచారం
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల దేవస్థానానికి 14 కిలోమీటర్ల దూరంలోని చిన్నారుట్ల వద్ద ఘాట్‌లో చిరుతపులి రోడ్డుపైకి వచ్చింది. సోమవారం ఉదయం ఆరు గంటలకు అటవీ మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అటవీశాఖ అధికారులు చెక్‌పోస్టులను తెరిచారు. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఎదురుగా చిరుత కనిపించింది. కాసేపటికి చిరుత రోడ్డు దాటుకుని అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ద్విచక్ర వాహనదారులను రెండు గంటల పాటు అటువైపు వెళ్లకుండా నిలిపివేశారు. -
క్యాంపస్ ఆవరణలో చిరుత!
తెలంగాణ యూనివర్సిటీ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం క్యాంపస్‌లోని హాస్టల్ విద్యార్థులకు చిరుత కన్పించడంతో భయాందోళన చెందారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎంబీఏ కాలేజీ సమీపంలో చిరుత కన్పించినట్లు విద్యార్థి స్వామి.. రిజిస్ట్రార్ నసీమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్, ఇందల్వాయి రేంజ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి ఆసిఫుద్దీన్ నేతృత్వంలో సిబ్బంది చిరుత పాదముద్రలు, వెంట్రుకల కోసం వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తెయూ పరిధిలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. -
పులినా? పిల్లినా?
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని పువ్వాడనగర్‌లో చిరుతపులి సంచరించిందని కలకలం నెలకొంది. గుట్టపక్కనే అనుకొని ఉన్న నివాసాల వద్దకు గురువారం అర్ధరాత్రి చిరుతపులి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకుని శుక్రవారం అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీశాఖ రేంజ్ అధికారి రాధిక, డిప్యూటీ రేంజ్ అధికారి రేణుక, ఎఫ్ఆర్ఓ దుగ్గిరాల శ్రీను, రవి, తహసీల్దార్ శ్రీనివాసరావు, పంచాయతీ ప్రత్యేక అధికారి జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అడుగు జాడలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొంతమంది తోడేలని, మరికొంతమంది పునుగు పిల్లి అని, ఇంకొంతమంది చిరుత జాడలేనని చెబుతున్నారు. అడుగు ముద్రలు, బిత్తర చూపులు చూస్తున్నట్లు కనిపించిందని కొందరు చెప్పిన మాటల ఆధారంగా పునుగు పిల్లిగా భావిస్తున్నట్లు డిప్యూటీ రేంజర్ రేణుక చెబుతున్నారు. ఇక్కడి ఆధారలను బట్టి పూర్తిగా నిర్ధారణ చేసుకోలేమని అన్నారు. ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను అమర్చి..ఆ తర్వాత అది ఏ జంతువో తేలుస్తామని ప్రకటించారు. గ్రామంలో చిరుత సంచరించినట్లు సమాచారం అందడంతో పువ్వాడనగర్ వాసులు బెంబేలెత్తారు. పెద్ద ఎత్తున జనం వచ్చి కాలనీని పరిశీలించి వెళ్లారు. -
చక్రాపూర్‌లో చిరుత కలకలం
మూసాపేట (దేవరకద్ర) : మండలంలోని చక్రాపూర్ గ్రామంలో చిరుత పులి వరుస దాడులతో కలకలం సృష్టిస్తోంది. గ్రామ శివారులోని అడవిలో గత కొన్ని నెలల నుంచి చిరుత పులి సంచరి స్తూ.. మూగజీవాలపై దాడి చేస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా వరుస దాడులు చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పంటలకు కాపలా వెళ్లి అడవి జంతువుల బారి నుంచి కాపాడుకోలేక.. మరో పక్క చేసిన అప్పులను తీర్చలేక లబోదిబోమంటున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలానికి వెళ్లడానికే జంకుతున్నారు. అడవులకు అతి సమీపంలో.. చిరుతపులి గడిచిన నాలుగు నెలల్లో 6 మేకలు, రెండు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. చక్రాపూర్ గ్రామానికి, సమీపంలోని తండాలకు అడవులు దగ్గరగా ఉండటంతో తరచూ చిరుత సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన హరిజన్ కుర్మయ్య, మాసన్న, కావలి తిరుమలయ్యకు చెందిన మేకలను చంపి ఎత్తుకెళ్లగా.. తిరుమలి ఎర్రన్నకు చెందిన లేగ దూడను కూడా చంపడం కలకలం రేపుతోంది. ఇన్ని రోజుల నుంచి అడవిలో పందులు, ఎలుగుబంట్లు, నక్కల సంచారం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు చిరుత సంచారంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం ఎక్కువైందని వాపోయారు. గ్రామస్తులకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా కూడా జంకుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే రాత్రివేళల్లో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు స్పందించి చిరుత పులిని బంధించి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి కోసం వచ్చింది చిరుత పులులు ఎప్పుడూ అడవిలోనే తిరుగుతాయి. ప్రస్తుతం ఈ అడవిలో ఒకే ఒక్క చిరుత ఉంది. దానికి తాగునీరు దొరకక.. గ్రామ సమీపంలోకి వచ్చి పశువులపై దాడి చేసి ఉంటుంది. చుట్టుపక్కల పొలాల దగ్గర ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి «æదాహం వేసినప్పుడు ఎవరి మీదైనా దాడి చేస్తాయి. అడవిలో చిరుత కోసం తొట్లు ఏర్పా టు చేసి నీళ్లు పోస్తున్నాం. మేకపోతు చిరుత దాడిలో మృతిచెందింది. కాబట్టి నష్టపరిహారం చెల్లించేలా చూస్తాను. – నరేందర్, బీట్ ఆఫీసర్, మూసాపేట మమ్మల్ని పట్టించుకోరా? ప్రతినిత్యం మూగజీవాలైన పశువులు, మేకలు, గొర్రెలను కాపరులు గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్తున్నా కూడా వాటికి సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. అడవిలో ఉన్న వనరులతో కనీస అవసరాలైన కట్టెలు, రాళ్లు, ఇసుక ఇలా ఏదో ఒకటి గ్రామానికి తీసుకువచ్చిన కూడా అటవీ శాఖాధికారులు మాత్రం వారిపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప ఇలా అటవీ జంతువులు మూగజీవాలపై దాడులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని రీతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అడవిలో సిమెంట్ రింగులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోయడం ఎంత వరకు సబబని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇళ్లల్లోకి చిరుత..పరుగులు తీసిన జనాలు
-
ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం
సాక్షి, డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఓ చిరుత చుక్కలు చూపించింది. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడి ముచ్చెమటలు పట్టించింది. మెరుపు వేగంతా జనాలపైకి దూసుకెళ్లి హడలెత్తించింది. చివరకు ఎవరి చేతికి చిక్కకుండా పరారైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని కేవల్ విహార్ ప్రాంతంలోని ఓ నివాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. శాస్త్రబుద్ధి అనే రోడ్డులోని ఓ నివాసంలో గార్డెన్‌లోకి వెళ్లింది. అక్కడే కొద్ది సేపు కూర్చున్న చిరుత ఆ వెంటనే సెకన్లలో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి క్షణాల్లో దూకడం మొదలుపెట్టింది. దీంతో ఇళ్లల్లోని మహిళలు, ముసలివారు సైతం తమ శక్తిమేరకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉన్నవారిపైకి దూసుకెళ్లిన చిరుత నలుగురైదుగురిని చూసి మాత్రం భయపడింది. దీంతో జనాలంతా కూడా ఒకే చోట పోగయ్యారు. ఈ తంతు దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. అయితే, కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అక్కడికి వచ్చి గన్ సిద్ధం చేస్తుండగానే చిరుత కనిపించకుండా మాయమైంది. ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం -
పు.. పు.. పు... పులి
పిల్లతో కలిసి చిరుత సంచారం గాలించినా దొరకని ఆచూకీ వణికిపోతున్న మల్లక్కపేట ఇంటర్వెల్ సమయం. బడి గంట మోగింది. పిల్లలంతా మూత్ర విసర్జనకు వెళ్లారు. చెట్ల పొదల మాటున ఓ భారీ ఆకారం. పక్కనే చిన్న పిల్ల. అంతే ఒకటే అరుపు. పు.. పు.. పు.. పులి. పిల్లలు చెల్లాచెదురయ్యూరు. బడి మూత పడింది. ఊరు ఉలిక్కి పడింది. పొలం గట్లు.. చెట్లూపుట్టల వెంట గాలింపులు. అందరి చేతిలో కర్రలు. వరంగల్ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేటలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉదయం 11 గంటలకు చిరుత పులి తన పిల్లతో కన్పించింది. ఉపాద్యాయులు తరగతి గదులకు తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లయ్య, ఎస్సై వినయ్ కుమార్ సిబ్బందితో వచ్చి గాలించారు. చిరుత జాడ కన్పించలేదు. జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు చెప్పి వారు వెళ్లిపోయూరు. అనుక్షణం.. భయం భయం స్థానికులు కర్రలు పట్టుకుని గుంపులుగా చిరుత కోసం గాలించారు. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, కూలీలు పులి భయంతో అర్ధంతరంగా ఇళ్లకు వచ్చేశారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. అందరిలోనూ టెన్షన్. పొరుగునే ఉన్న సీతారాంపురం శివారు చేన్లలో చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు ఆదివారం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లక్కపేటవాసుల ఆందోళన మరింతగా పెరిగింది. ఏ చిన్న అలికిడి విన్పించినా ఉలికి పడుతున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ అంతే గతంలో గ్రామస్తులకు ఎలుగుబంటి బెడద ఉండేది. ఈ విషయం చెప్పినా అప్పట్లో అధికారులు పట్టించకోలేదు. గ్రామస్తులపై దాడి చేశాకే స్పందించారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎలుగు దాడిలో లడే శివయ్య తీవ్రంగా గాయపడిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడూ అధికారులు చిరుత విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని, ఇది తమకు ప్రాణగండంలా మారుతుందేమోనని ఠారెత్తిపోతున్నారు. త్వరగా చిరుతపులిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఊళ్లో కాపలా ఉంచాలి చుట్టు అడవి లేకున్నా మా ఊళ్లోనే ఇలా జరుగుతోంది. అప్పట్లో ఎలుగుబంటి దాడి చేసింది. ఇప్పటికీ వాళ్లు సరిగా నడుస్తలేరు.చిరుత పులి దాడి చేస్తే ప్రాణాలు పోతయ్. ఈ భయూనికి ఒక్కరూ బయటకు రావడం లేదు. ఊళ్లో పోలీసోళ్లు కాపలా ఉండాలి. గుడికందుల కొమురయ్య కూలీలు ఎల్లిపోరుుండ్రు పత్తి ఏరేందుకు వచ్చిన కూలీలు పులి భయంతో మధ్యలోనే వెళ్లిపోరుుండ్రు. గ్రామంలోని బడి బంద్ చేసిండ్రు. ఎవరి ఇల్లు చూసినా తలుపులు వేసే కన్పిస్తోంది. ఏ చిన్న చప్పుడు విన్పించినా భయమైతాంది. ఎన్ని రోజులు భయంతో ఉండాలో ఏమో. బైయ్యా శంకరయ్య -
మాదాపూర్ శివారులో చిరుత సంచారం
మాక్లూర్ : మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత పులి సంచరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరికి అటవీ ప్రాంతం వైపు గుట్టపై బండరాయి మీద చిరుత పులి కన్పిచింది. వారు వెంటనే మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావు, మాక్లూర్ ఎస్సై సంతోష్‌కుమార్, ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ రవిమోహన్ సిబ్బందితో కలిసి చిరుత పులి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. చికటి పడిన తర్వాత చిరుత పులి రాయి పైనుంచి కిందికి దిగడంతో పోలీసులు, గ్రామస్తులు పరుగులు పెట్టారు. మాదాపూర్ అటవీ ప్రాంతం నుంచి జక్రాన్‌పల్లి మండలంలోని సికింద్రాపూర్ అటవీ ప్రాంతం వరకు చిరుతపులులు ఉన్నట్లు ఫారెస్టు రెంజ్ అధికారి రవిమోహన్ తెలిపారు. చీకటి పడినందున రాళ్లు, చుట్టూ ముళ్ల పొదలు ఉన్నందున చిరుత పులిని పట్టుకునే పరిస్థితి లేదని, మంగళవారం ఉదయం చిరుత పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి వేళలో చుట్టు ప్రక్కల గ్రామల ప్రజలు బయటకు రావద్దని సూచించారు. చిరుత పులికి చాలా భయం ఉంటుందని,అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత పులిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి వేళలో ప్రజలు బయటకు వెళ్లవద్దని గ్రామాల్లో ఫారెస్టు, పోలీసు అధికారులు దండోర వేయించారు. చిరుత పులి అడవిలో కన్పించడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
అమ్మో పులి.. వెన్నులో చలి
- చిరుత సంచారంతో వణుకుతున్న ప్రజలు - పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు - అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి దోమకొండ : దోమకొండ శివారులో ఆదివారం పులి సంచరించిందని తెలియడంతో జనం భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా మల్లన్న గుడి శివారులోని పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా పులి ప్రతిరోజు 25 కిలోమీటర్ల వరకు నడుస్తుందని తాగునీటి కోసం ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. జింకలు, కుందేళ్లు వంటి వాటిని అది వేటాడి తింటుందని, అలాంటి జంతువులు దానికి ఇక్కడ కనిపించక వెళ్లిపోయి ఉంటుందంటున్నారు. కాగా ప్రజలు మాత్రం చిరుతను తలచుకొని భయపడుతున్నారు. దోమకొండ వాసులు రెండు రోజుల క్రితం వరకు మల్లన్న గుడి పక్కనుంచి భిక్కనూరు మండలంలోని జంగంపల్లి శివారులోని శ్రీకృష్ణ మందిరం వరకు గల దారినుంచి కామారెడ్డికి వెళ్లేవారు. ఇది ఇరుకైన మార్గం. అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారం విషయం తెలియడంతో ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు కామారెడ్డి వెళ్లడానికి లింగుపల్లి, భిక్కనూరు మండలం బీటీఏస్ చౌరస్తా మీదుగా వెళుతున్నారు. మల్లన్న గుడి వద్ద రైతుల సమావేశం చిరుత సంచారం విషయం తెలియడంతో అటవీ శాఖ అధికారులు మల్లన్న గుడి వద్ద రైతులతో సమావేశమయ్యారు. చిరుతపులి సంచరిస్తున్నందున రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లరాదని అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఫారూఖ్ రైతులకు సూచించారు. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున వెళ్లాలని పేర్కొన్నారు. చేతిలో కనీసం కర్రనైనా ఉంచుకోవాలన్నారు. చప్పుడు చేస్తూ నడవడం మంచిదని సూచించారు. దోమకొండ శివారులోకి వచ్చింది చిరుత పులా లేదా పులా అనే విషయం నిర్ధారణ కాలేదన్నారు. ఇక్కడ కనిపించిందని చెబుతున్న పులి పొలం గట్లమీద గడ్డిపై నడించిందని దాని అడుగులు గుర్తించడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పులి సంచారం విషయమై డీఎఫ్‌వోకు వివరాలు తెలిపానన్నారు.