పాదముద్రలు పరిశీలిస్తున్న అధికారులు, చిరుత పాదముద్రలు..
సాక్షి, హాలియా(నల్గొండ) : అనుముల మండలంలోని కొసలమర్రి గ్రామ శివారులో చిరుతపులి సంచారం చేస్తుందని ప్రజలు, రైతులు భయాందోళన చెందారు. మంగళవారం కొసలమర్రి, వెంకటాపురం, కొత్తల్లూరు గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత సంచరించినట్లు ప్రచారం దావనంలా వ్యాపించింది. కొసలమర్రి గ్రామానికి చెందిన రైతు బాసిరెడ్డి కృష్ణారెడ్డి తన బత్తాయి తోటలో అంతర పంటగా పుచ్చసాగు చేశాడు. ఉదయం బైక్‌పై కృష్ణారెడ్డి గ్రామం నుంచి తన తోట వద్దకు బయలుదేరాడు. తన వ్యవసాయ భూముల్లో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన రైతు భయాందోళనతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు అశోక్‌రెడ్డి, పార్వతీ హుటాహుటీన ఘటన స్థలం వద్దకు చేరుకుని పాదముద్రలను సేకరించి హైనా జంతువు అడుగులుగా గుర్తించారు. ముక్కమాల, వెంకటాద్రిపాలెం, కొత్తల్లూరు సమీప ప్రాంతాల్లో హైనాలు సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయా ప్రాంతాల్లో త్వరలో బోనులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళన చెందాలి్సన అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment