తెలంగాణ యూనివర్సిటీ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం క్యాంపస్‌లోని హాస్టల్ విద్యార్థులకు చిరుత కన్పించడంతో భయాందోళన చెందారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎంబీఏ కాలేజీ సమీపంలో చిరుత కన్పించినట్లు విద్యార్థి స్వామి.. రిజిస్ట్రార్ నసీమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్, ఇందల్వాయి రేంజ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి ఆసిఫుద్దీన్ నేతృత్వంలో సిబ్బంది చిరుత పాదముద్రలు, వెంట్రుకల కోసం వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తెయూ పరిధిలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment