టీఎస్పీఎస్సీ చైర్మన్ దిష్టిబొమ్మ దహనం
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం విద్యార్థి నిరుద్యో గ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నిరుద్యోగ జే ఏసీ చైర్మన్ సంతోశ్‌గౌడ్ మా ట్లాడుతూ.. విద్యార్థి నిరుద్యోగులు పోరాటంతో సాధించుకున్న టీఎస్పీఎస్సీకి చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి నిరుద్యోగుల పట్ల ని ర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యాలయాని కి వెళ్లిన విద్యార్థి నిరుద్యోగ నాయకులతో దు రుసుగా ప్రవర్తించడమే కాకుండా పోలీసుల చేత వారిని గెంటేయించడం శోచనీయమన్నారు.పది రోజుల్లో ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేయాలని లేదంటే తెలంగాణలోని పది జిల్లాల నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళన లో తెయూ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అ ధ్యక్షుడు రాజ్‌కుమార్, రాము, మనోజ్, బా బు, సృజన్, హరి, అనుదీప్, నాయక్, సుం దర్ తదితరులు పాల్గొన్నారు.