Bad addictions
-
యువతిని ఎరగా చూపి...!
సాక్షి, నెల్లూరు: చెడు వ్యసనాలకు బానిసైన నలుగు యువకులు, ఓ యువతి ముఠాగా (కోత బ్యాచ్) ఏర్పడ్డారు. వీరు నెల్లూరు నగరంలో తిరుగుతూ యువతిని ఎరగా చూపి దోపిడీ చేస్తారు. ఎదురుతిరిగిన వారిపై బ్లేడ్‌తో (పేపర్ కటింగ్ కోసం వినియోగించేది) దాడి చేసి అందినకాడికి దోచుకెళ్లేవారు. ఈనెల 3వ తేదీన కొత్తహాల్ సమీంపలో గణేష్ అనే యాచకుడిపై హత్యాయత్నం చేసిన కేసులో పోలీసులు కోతబ్యాచ్‌ను చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేసి వారిని విచారించే క్రమంలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర ఇన్చార్జ్ డీఎస్పీ మరియదాసు నిందితుల వివరాలను వెల్లడించారు. నవాబుపేటలోని కుసుమహరిజనవాడకు చెందిన బక్రీదు కన్నయ్య అలియాస్ కన్నా, జేమ్స్గార్డెన్కు చెందిన జి.నాగేంద్ర, గుంటూరు జిల్లా తెనాలి మండలం అత్తోడు గ్రామానికి చెందిన తన్నీరు ఏడుకొండలు, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన తాటిపర్తి వెంకయ్య, బోడిగాడితోటకు చెందిన ఝాన్సీలు వ్యసనాలకు బానిసై ముఠాగా ఏర్పడ్డారు. నిత్యం బామ్ఫిక్స్, సొల్యూషన్ లాంటివి సేవిస్తూ మత్తులో రోడ్లపై తిరుగుతూ నేరాలు చేయసాగారు. ఝాన్సీ అనే యువతిని దేవాలయాల వద్దకు పంపి యువకులను ఆకర్షిస్తారు. అనంతరం వారిని ఆ యువతి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా వారిని వెంబడిస్తూ నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకుని యువకుల వద్ద ఉన్న నగదు, నగలు దోపిడీ చేయసాగారు. ఎదురుతిరిగిన వారిపై బ్లేడ్లతో దాడులకు పాల్పడసాగారు. అనేక నేరాలకు.. కొంతకాలంగా ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడింది. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడంతో ఈ విషయాలు వెలుగులోకి రాలేదు. ఈక్రమంలో వీరి వ్యవహారాలను యాచకుడు గణేష్ గమనించాడు. గాంధీనగర్ సాయిబాబాగుడి వద్ద యాచకుడితో వారు గొడవపడడం చూసిన గణేష్ అదేప్రాంతంలో పూలు అమ్ముకునే శీనయ్య అనే వ్యక్తికి చెప్పాడు. ఆయన కన్నాను మందలించాడు. దీంతో గణేష్‌పై కక్ష పెంచుకున్న కన్నా ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. ఈనెల 3వ తేదీ రాత్రి గణేష్ గాంధీబొమ్మ సమీపంలోని రోడ్డుపై నిద్రిస్తుండగా కన్నా బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడిచేశాడు. గొంతుపై కోయడంతో గొంతు ప్రధాన నరం తెగింది. మిగిలిన వారు సైతం గణేష్‌పై దాడిచేసి అతని వద్దనున్న రూ.2 వేల నగదు అపహరించారు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు అక్కడి నుంచి తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ కేసు నమోదు చేశారు. తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు దోచుకున్న నగదుతో గంజాయిని కొని చిన్నచిన్న పొట్లాలుగా చేసి నగరంలో విక్రయిస్తుండగా సోమవారం సౌత్ రైల్వేస్టేషన్ వద్ద చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కొంత గంజాయి, నాలుగు పేపర్ కటింగ్ బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారించే క్రమంలో వారు చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వీరిపై గతంలో నవాబుపేట, చిన్నబజారు, వేదాయపాళెం పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. కోతబ్యాచ్‌ను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, ఎస్సైలు చిన్ని బలరామయ్య, హనీఫ్ తదితరులను డీఎస్పీ అభినందించారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు వారేనని వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. -
వ్యసనాలతో యువత చిత్తు
మద్యం మత్తులో లా విద్యార్థినిపై సీనియర్ అత్యాచారం నగరంలో కలకలం రేపిన ఘటన పెదవాల్తేరు(విశాఖ) : చెడు వ్యసనాలతో యువత నేరాల బాట పడుతున్నారు. మద్యం మత్తులో ఉన్నత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువుకునే వయసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. గురువారం వెలుగు చూసిన న్యాయ విద్యార్థిని అత్యాచారం ఈ కోవకు చెందినదే. ఎంవీపీకాలనీ సెక్టార్-11లో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. దామోదర సంజీవయ్య లా యూనివర్శిటీలో ప్రథమ సంవత్సం చదవడానికి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి వచ్చిన ఆ విద్యార్థిని కామ దాహానికి బలైంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏం జరిగిందంటే.. బాధితురాలు ఎంవీపీ కాలనీలోకి అక్షయ వసతి గృహంలో ఉంటూ న్యాయ విద్యనభ్యసిస్తోంది. ఆమె స్నేహితులైన నలుగురు యువతులు అదే కాలనీలోని ఓ అద్దె నివాసంలో ఉంటున్నారు. వీరికి అదే కళాశాలలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న సీనియర్ రిషబ్సింగ్తో పరిచయం ఏర్పడింది. బుధవారం రాత్రి అత్యాచారానికి గురైన యువతి ఆమె స్నేహితురాలు, రిషబ్సింగ్ పార్టీ చేసుకున్నారు. పార్టీ అన ంతరం హాస్టల్‌కు వెళ్లకుండా బాధితురాలు రిషబ్సింగ్, తన స్నేహితురాళ్లతో కలిసి ఎంవీపీకాలనీలోని అద్దె ఇంటికి వె ళ్లి నిద్రపోయారు. ఈ క్రమంలో రిషబ్సింగ్కు మద్యం మత్తు ఎక్కువడడ ంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులు నిద్రపోయిన బెడ్రూమ్లు, బెడ్సీట్స్ తనిఖీచేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలిని కేజీహెచ్‌కు తరలించారు. దురాలవాట్లకు బానిసై.. చదువుకునే విద్యార్థులు దురాలవాట్లకు బానిసై, చ ట్ట వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ టెక్నాలజీని వినియోగించి నేరాలు ఏ విధంగా చేయాలా అని ఆలోచించే విద్యార్థులూ ఉన్నారు. నేరాలు చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. - విద్యాసాగర్, సీఐ ఎంవీపీకాలనీ. -
ఆ ఊరిలో మద్యం నిషేధం
డోంగ్లీ గ్రామస్తుల నిర్ణయం భేష్ నిజాంసాగర్ : మద్యానికి బానిసలుగా మారుతూ, ఆనారోగ్యాల బారిన పడంతో పాటు చెడు వ్యసనాల బారిన పడుతున్న కుటుంబాలను కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎంపీపీ గోదావరిబస్వంత్ రావ్ పటేల్ అన్నారు. అ ధికారులు, ప్రజలందరి సహకరంతో మద్యాపాన నిషేధం సాధ్యమవుతుందన్నారు. మద్నూర్ మండ లం డోంగ్లి గ్రామంలో మద్యపాన నిషేధంపై గురువారం స్థానిక సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. డోంగ్లి గ్రామస్తులు మద్యపాన నిషేధం కో సం 15 రోజుల కిందట తీసుకున్న నిర్ణయం హర్షణీయంగా ఉందన్నారు. ప్రతిఒక్కరి సహకారంతో గ్రా మంలో మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని పే ర్కొన్నారు. అనంతరం బిచ్కుంద సీఐ సర్దార్‌సింగ్ మాట్లాడుతూ మద్యపానం పట్ల గ్రామస్తుల ని ర్ణయం అభినందనీయమన్నారు. మార్చి15 లోగా గ్రామంలో వందశాతం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. మద్యపానం వల్ల అనేక కు టుంబాలు నాశనం కావడంతో పాటు బతుకులు చి ధ్రమవుతున్నాయన్నారు. యువత, ప్రజలకు చెడువ్యసనాలకు బానిసలుగా మారడంతో పాటు పగలు ప్రతీకారాలకు దారితీస్తాయన్నారు. గ్రామస్తులు తీ సుకున్న నిర్ణయానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల పరంగా పూర్తిసహకారం అందిస్తామన్నారు. అంతకుముందు సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ మాట్లాడుతూ మద్యానికి డబ్బులు ఖర్చుచేస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మద్యపాన నిషేదానికి గ్రామస్తులులు ముందుకురావడంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎస్సైలు సుదర్శన్, శ్రీకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ కల్పన గ్రామపెద్దలు దిగంబర్‌రావ్, ఆనంద్పటేల్ కళాశాల లెక్చరర్లు గంగాదర్,సన్నీ గ్రామస్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
పులపత్తూరులో హత్య
చెడు వ్యసనాలు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి పాలిట శాపంగా మారాయి. తన చెడు అలవాట్ల కోసం కుటుంబ పరువును బజారుకు ఈడ్చడమే గాక, కుటుంబ సభ్యులను హింసిస్తుండడంతో వారు విసుగెత్తిపోయారు. ఎలాగైనా కుటుంబ సభ్యులకు మనశ్శాంతితో పాటు కుటుంబ పరువును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో రక్త సంబంధాన్ని మరచిన ఓ అన్న సొంత తమ్ముడినే హతమార్చాడు. రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట మండలం పులపత్తూరులో జి.రాజశేఖరరెడ్డి అలియాస్ రాజారెడ్డి(24) గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసై, కుటుంబ సభ్యుల పాలిట యమకింకరుడిగా మారిన రాజారెడ్డి మేడపై నిద్రిస్తుండగా హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన అతను మూడేళ్ల అనంతరం 11 నెలల కిందట స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి పనీ పాట లేక జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో దుర్వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఈ నేపథ్యంలో అతను కిరాతకంగా హత్యకు గురి కావడం సంచలనం రేకెత్తించింది. నేర స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు విషయం తెలిసిన వెంటనే రాజంపేట డీఎస్పీ అన్యోన్య, సీఐ ఉలసయ్య సహా ఎస్ఐలు జాబిద్, రమేష్‌బాబు, వెంకటేశ్వర్లు, మోహన్, నాగరాజు, రామచంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్వాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం వారంతా శోధించారు. హతుడి నడవడిక, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో అతను ప్రవర్తించే తీరుపైనా ఆరా తీశారు. క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన విధానాన్ని కూడా తెలుసుకున్నారు. సంఘటనపై ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.