Prohibition of alcohol
-
మద్యం వినియోగం తగ్గుతోంది
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్య నిషేధం దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని మద్యం విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా కొరిటెపాడులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తుండటంతో ఇప్పటికే మద్యం వినియోగం 40 శాతం, బీరు వినియోగం 78 శాతానికి తగ్గిందని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను, పర్మిట్ రూమ్‌లను పూర్తిగా తొలగించడమే కాకుండా.. మద్యం షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి 4,400 మద్యం దుకాణాలను 2,900కు తగ్గించారని గుర్తు చేశారు. నవంబర్ 1న కర్నూలులో మద్యం విమోచన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీ ప్రాంగణాలు, డిగ్రీ కాలేజీల్లో డ్రగ్స్, మత్తు పానీయాలపై సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదే దివంగత నందమూరి తారక రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. 1994 నుంచి ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రంలో సత్ఫలితాలిచ్చిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే కోట్లాది మంది మహిళలు సాధించుకున్న సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారన్నారు. -
మద్యం తాగితే రూ.10 వేల జరిమానా
పాన్‌గల్: మహాత్మాగాంధీ స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌లో సంపూర్ణ మద్య నిషేధం విజయవంతంగా అమలవుతోంది. మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా మద్య నిషేధం కొనసాగిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అంతకుముందు గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా మద్యం తీసుకోవడంతో తరచూ గొడవలు చోటుచేసుకుని అశాంతి వాతావరణం నెలకొనేది. ఈ క్రమంలో విద్యావంతులు, యువకులు ఈ చెడు సంస్కృతిని పారదోలేందుకు నిర్ణయించుకున్నారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ గోప్లాపూర్‌లో మద్య నిషేధంపై ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు (ఫైల్) చిన్నాపెద్ద, మహిళలు, యువత ఒక తాటిపైకి వచ్చి మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. మద్యం విక్రయించినా.. కొనుగోలు చేసినా రూ.10 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ మేరకు 2016 జూలై 11వ తేదీ నుంచి గ్రామంలో గుడుంబా, గొలుసు మద్యం దుకాణాల పై విధించిన నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు వేలం పాట నిర్వహించి.. గోప్లాపూర్‌లో 4 వేల వరకు జనాభా.. 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఐదేళ్ల కిందట గ్రామంలో మద్యం విక్రయించేందుకు వేలంపాట పాడారు. మద్యం విక్రయాలు దక్కించుకున్నవారు ఇష్టానుసారంగా ధరలకు విక్రయించేవారు. దీంతో మద్యం మత్తులో గొడవలు జరగడం, డబ్బు వృథా కావడం, అప్పులు పెరిగి కుటుంబ పోషణ భారంగా మారింది. ఎంతో మంది ఆర్థికంగా కుంగిపోతుండడంతో యువకులు, గ్రామస్తులు సమావేశమై మద్యం భూతాన్ని తరిమేసేందుకు నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల కిందట మహిళలు, యువకులు ఏకమై గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం నిషేధంపై గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం విక్రయించరాదని, కొనుగోలు చేసినా రూ.10 వేలు జరిమానా విధించాలని తీర్మానించారు. గ్రామస్తులంతా పార్టీలకతీతంగా సమష్టి కృషితో యువకులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి మద్య నిషేధంపై ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆలయం ఎదుట ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతోంది. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతోపాటు గ్రామాభివృద్ధికి దోహదపడుతుంది. ప్రశాంతంగా ఉంది గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుతో ప్రశాంతంగా మారింది. గ్రామస్తులు, యువకుల సహకారంతో అందరం కలిసికట్టుగా పార్టీలకతీతంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి బాటలు వేయడంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఎలాంటి గొడవ లేకుండా హాయిగా పనులు చేసుకుంటున్నాం. - కృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు, గోప్లాపూర్ గొడవలు తగ్గాయి.. గతంలో గ్రామంలో మద్యం విక్రయాలతో కొందరు ఇష్టారాజ్యంగా తాగేవారు. దీంతో గ్రామంలో గొడవలు, మహిళలపై దాడులు తరచూ జరిగేవి. సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిర్ణయం తీసుకోవడంతో గ్రామంలో అందరూ ఆనందంగా ఉన్నారు. నిషేధాన్ని ఇకపై ఇలానే కొనసాగిస్తాం. - లక్ష్మీ, మాజీ సర్పంచ్, గోప్లాపూర్ -
‘అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం’
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. కాగా, బెల్ట్‌షాపులు పెట్టి మద్యం విక్రయాలను ప్రోత్సహించింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. అసలు మద్య నియంత్రణ అనేది చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. అక్రమ మద్యం సరఫరా వెనుక చంద్రబాబు ఉన్నారనే అనుమానం ఉందని నారాయణ స్వామి ఆరోపించారు. -
10న ఆటోలు బంద్: ఆటోడ్రైవర్స్ జేఏసీ
సుల్తాన్ బజార్: దిశ హత్య కేసు నేపథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు డిమాండ్ చేస్తూ ఈనెల 10న ‘షరాబ్ హటావో–తెలంగాణ బచావో’అనే నినాదంతో ఒక్క రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆటోడ్రైవర్స్ జేఏసీ వెల్లడించింది. ఈమేరకు ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరులతో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడారు. మద్యపాన నిషేధం లేకపోవడం వల్లే మద్యం మత్తులో దుండగులు దిశను హత్య చేశారని, నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యం తాగడమేనన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా రూ. 500 ఎంవీ ట్యాక్స్ మాఫీ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని, అదే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఆటోకు రూ. 10 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. -
'వైఎస్ జగన్ ఒక డైనమిక్ లీడర్'
సాక్షి,కర్నూలు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మూడు నెలల్లోనే ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే డైనమిక్ లీడర్‌గా పేరు సంపాదించారని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో దశల వారిగా అమలు చేస్తున్న మద్యపాన నిషేధం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడగలిగారని తెలిపారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి కేవలం ఏడు గంటలు ఉచిత కరెంటు ఇస్తే, సీఎం వైఎస్ జగన్ మాత్రం పగటిపూటే తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడం గొప్ప విషయమని వెల్లడించారు. నిరక్ష్యరాస్యతను తగ్గించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఒక బాధ్యతగా గుర్తించి సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. -
మన‘సారా’ మానేశారు
నాన్న రోజూ తాగొచ్చి ఇంట్లో వాళ్లందరినీ తిడుతుండేవారు.. ఇప్పుడా బాధ లేదు.. వచ్చిన డబ్బంతా తాగడానికే నా భర్త తగలేసేవాడు.. ఇప్పుడు ఇంటికిస్తున్నాడు.. నాన్న తాగుతూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు.. ఏం చదువుతున్నావు.. అని సాయంత్రం ఇంటికొచ్చి నన్నడుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది.. ఓ కుమార్తె.. ఓ భార్య.. ఓ కుమారుడి ఆనందానికి అక్షర రూపమిది. ఇళల్లో గొడవలు లేవు. ఊరిలో అరుపులు, కేకలు లేనేలేవు. మద్యానికి దూరమవుతున్నారు. కుటుంబానికి దగ్గరవుతున్నారు. భార్య, బిడ్డలను అక్కున చేర్చుకుంటున్నారు. దశలవారీగా మద్య నిషేధం విధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి విజయనగరం జిల్లా స్పందిస్తోంది. ఊరూవాడా మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై చైతన్యవంతమవుతోంది. -సాక్షి, విజయనగరం మాటంటే మాటే.. సాలూరు రూరల్: మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపుతో సాలూరు మండలంలోని మెట్టవలస గిరిజన గ్రామం స్పందించింది. జగనన్న పిలుపుతో ఊరు ఊరంతా చైతన్యవంతమైంది. ఇప్పుడా ఊరిలో మద్యం మాటే లేదు. మెట్టవలస పూర్తిగా గిరిజనులుండే గ్రామం. అత్యధికంగా ఉపాధ్యాయులు, వైద్యులు, పశువైద్యులు, వ్యవసాయాధికారులు, రైతులున్నారు. గ్రామంలో దాదాపు 2500 జనాభా ఉంటుంది. గ్రామాన్ని కొన్నేళ్లుగా సారా మహమ్మారి పట్టి పీడిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే మద్య నిషేధానికి తీసుకున్న చర్యలతో గ్రామస్తులు స్ఫూర్తి పొందారు. రెండు నెలల క్రితం సారా, మద్యం గ్రామంలో అమ్మరాదని తీర్మానించుకున్నారు. దీన్ని ఆ గ్రామానికి పరిమితం చేయకుండా.. తోణాం పంచాయతీ దిగువ మెండంగి, హనుమంతువలస, మావుడి వలస గ్రామాలతో పాటు ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. అక్కడి స్వయం సహాయక సంఘాలతో చర్చించారు. గ్రామపెద్దలు, గ్రామంలోని యువకులతో కలిసి మహిళలు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం మద్యం అమ్మకం లేకుండా తీర్మానించుకున్నారు. గిరిజనులు ఓ మాట అంటే ఎంతగా కట్టుబడి ఉంటారో ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది. అప్పటికే మద్యం అలవాటు ఉన్నవారు కూడా మానుకున్నారు. మహిళలతో కలిసి ఉద్యమించిన యువతలో కూడా కొందరు మద్యం సేవించేవారున్నారు. వారంతా ఇప్పుడు మద్యానికి దూరంగా ఉంటున్నారు. ఎంతగా తెలుసా? పండగలు.. శుభకార్యాలు జరిగినా కూడా అక్కడి యువత మద్యం ముట్టుకోవడం లేదు. తామే పెద్దలుగా నిలిచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నామని.. అందుకే తామే ముందుగా ఆదర్శంగా నిలవాలని యువత అనుకున్నారు. అలా యువత, మహిళలు సంయుక్తంగా మద్యాన్ని గ్రామానికి దూరం చేశారు. రూ.5 వేలు జరిమానా గ్రామంలో మద్యం లేదా సారా దొరకదు.. కానీ బయటి ప్రాంతాలకు వెళ్లి వారు ఒక వేళ తాగి వచ్చే అవకాశం ఉంది. అందుకే అలా ఎవరైనా తాగి వస్తే వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. తాగిన వారు ఏ గొడవా చేయకుండా ఉంటే పరవాలేదు. కానీ ఇంటికి వెళ్లి భార్య, పిల్లలతో లేదా గ్రామస్తులతో గొడవ పడితే రూ.5 వేల జరిమానా విధిస్తారు. గస్తీ కాశాం మద్యం గ్రామంలో ఎక్కడా ఉండకూడదని తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకున్న తరువాత కొద్దిరోజులు యువతంతా రాత్రులు గ్రామ చివార్లో గస్తీ కాశాం. అప్పటి నుంచి ఎవరూ మద్యం జోలికి పోవడం లేదు. – మువ్వల, విజయ్‌కుమార్, యూత్ కమిటీ ప్రెసిడెంట్, గ్రామం ప్రశాంతంగా ఉంది ఎప్పుడైనా సాయంత్రం అయితే పిల్లలు, ఆడవాళ్లు భయపడేవాళ్లు. ఎటు నుంచి ఏ గొడవ వస్తుందో.. ఇంటినుంచి వెళ్లిన వారు ఏ తగవు తెస్తారో అని ఆందోళన చెందేవాళ్లం. ఇప్పుడా సమస్య ఎక్కడా లేదు. – కొండగొర్రి లక్ష్మి, కార్యదర్శి, స్వయం సహాయక సంఘం, మెట్టవలస. సారా మహమ్మారిని తరిమేశారు కొత్తవలస (శృంగవరపుకోట): ఒకప్పుడా గ్రామంలో సారా తయారీ మూడు పీపాలు.. ఆరు సీసాలుగా సాగేది. మద్యం మత్తులో భర్తలు జోగుతుంటే.. ఇల్లు గడవడానికి గృహిణులు కూలి పనులకు వెళ్లేవారు. బడి ఈడు పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా తల్లికి సాయంగా ఇంట్లో ఉండేవారు. ఇదంతా గతం.. ఉపాధ్యాయిని దంతులూరి కృషికి తోడు.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే సంపూర్ణ మద్య నిషేధానికి శ్రీకారం చుట్టడంతో మద్యానికి దూరమైందా గ్రామం. అదే.. కొత్తవలస మేజరు పంచాయతీ దిగువ ఎర్రవానిపాలెం. నిలిచిన సారా తయారీ ఒకప్పుడు సారా మహమ్మారి గ్రామంలో తాండవం చేస్తుండేది. ఏ ఇంటిలో కూడా ఇల్లాలు ప్రశాంతంగా ఉండేది కాదు. నిత్యం గొడవలతో గ్రామం అగ్గిలా ఉండేది. ఇప్పుడు గ్రామంలో సారా తయారీ నిలిచిపోయింది. పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నాం. సంపూర్ణ మద్య నిషేధానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆనందంగా ఉంది. – దుంగ ఎర్నమ్మ, దిగువ ఎర్రవానిపాలెం బతుకులు బాగు గతంలో సారా పూటుగా తాగి భార్యల్ని కొట్టడమే కాకుండా ఆరోగ్య సమస్యలతో బాధలు పడేవాళ్లం. ఇప్పుడు సారా మానేసి కూలి పనులకు వెళ్తూ హాయిగా బతుకుతున్నాం. స్వచ్ఛ గ్రామంగా తీర్చి దిద్దుకున్నాం. – దుంగ అప్పారావు, దిగువ ఎర్రవానిపాలెం జగనన్న స్ఫూర్తితో మద్య నిషేధం బాడంగి (బొబ్బిలి) : సంపూర్ణ మద్య నిషేధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్ననిర్ణయంతో ఆకులకట్ట గ్రామ మహిళలు స్ఫూర్తి పొందారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. నాలుగైదు నెలల క్రితం గ్రామంలో మ ద్యం బెల్టు దుకాణం ఉండేది. నవరత్నాల్లో ఒకటైన దశల వారీ మద్య నిషేదం హామీని వైఎస్ జగన్ ప్రకటించడంతో మహిళలు బెల్టు దుకాణంపై దండెత్తి మూసి వేయించారు. అప్పటినుంచి గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా.. తాగినా రూ.10 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని చాటింపు వేశారు. దీంతో ఆ గ్రామం మద్యనిషేధంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో సుమారు 900మంది జనాభా ఉంటే.. మహిళలే అధికం కావడం విశేషం. ఆకులకట్ట గ్రామం జగనన్న హామీతో మేలు రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధిస్తానని జగనన్న హామీ ఇచ్చారు. అది జరిగితే మాలాంటి కుటుంబాలకు మేలు జరుగుతుంది. గ్రామంలోని పలు స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్ల భర్తలు మద్యానికి బానిసలవుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అందుకే మహిళలందరం ఏకమై తిరగబడి బెల్టు దుకాణాలను మూయించి వేశాం. మద్య నిషేధాన్ని పాటిస్తున్నాం. – రావిపల్లి కామేశ్వరి, ఆకులకట్ట, బాడంగి. స్వచ్ఛంద నిషేధం సీతానగరం (పార్వతీపురం): సంపూర్ణ మద్యపానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలతో మండలంలోని తాన్న సీతారాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తులు రెండేళ్లుగా స్వచ్ఛందంగా మద్య నిషేధం పాటిస్తున్నారు. రాష్ట్రీయ రహదారిని ఆనుకున్న గుచ్చిమి పంచాయతీ మధుర గ్రామం తాన్న సీతారాంపురంలో సుమారు 60 కుటుంబాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రశాంతత గ్రామంలో మహిళలందరం ఐకమత్యంతో మద్యంపై దండెత్తి బెల్ట్ దుకాణాన్ని మూయించి వేశాం. అప్పటినుంచి గ్రామంలో ఎలాంటి తగాదాలు లేవు. ప్రశాంతంగా గడుపుతున్నాం. ఎవరైనా గ్రామంలోకి తెచ్చి తాగినా.. అమ్మినా జరిమానా ఉన్నందున భయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్య నిషేధానికి కంకణం కట్టుకోవడం మాకెంతో ధైర్యాన్నిస్తోంది. – గొట్టాపు రాజేశ్వరి, ఆకులకట్ట, బాడంగి. నిషేధానికి జగనన్న భరోసా గజపతినగరం: మండలంలోని సీతారామపురం గ్రామంలో 2016లోనే మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విడతల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో మరింత చైతన్యవంతమైంది. మద్య నిషేధానికి ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యాచరణతో గ్రామస్తులకు భరోసా దొరికింది. ధైర్యం వచ్చింది మా గ్రామంలో మద్యం అమ్మరాదని తీర్మానించినా మద్యపానాన్ని అరికట్టలేకపోయాం. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలతో మాకు ధైర్యం వచ్చింది. ఇక బయట కూడా మగవారు తాగి రాకూడదని తీర్మానం చేసుకుంటాం. – గెద్ద చంద్ర, సీతారామపురం ఆనందంగా ఉంది గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టాం. గ్రామంలో ఎలాంటి మద్యం క్రయవిక్రయాలు జరపరాదని తీర్మానించున్నాం. ఇంతలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించనున్నట్టు ప్రకటించడం మాకెంతో ఆనందంతా ఉంది. – గెద్ద బంగారమ్మ, సీతారామపురం -
తొలి ఏడాదిలోనే 20% మద్యం షాపులు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ ఏడాది (2019–20)కి మద్యం పాలసీని ప్రకటించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,380 మద్యం షాపులుండగా తొలి ఏడాదే వీటిలో 880 తగ్గించి 3,500కి కుదించింది. వీటిని ప్రభుత్వమే నిర్వహించనుంది. షాపులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఏర్పాటు చేయనుంది. వీటికి ఏపీఎస్‌బీసీఎల్ రిటైల్ ఔట్‌లెట్‌గా నామకరణం చేస్తారు. వీటిపై షాపు నెంబర్ కూడా ఉంటుంది. జిల్లాలవారీగా షాపుల సంఖ్యపై ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. షాపుల ఏర్పాటుపై విధివిధానాలివే.. - మద్యం షాపులను ఎక్సైజ్ చట్టం–1968 రూల్స్ ప్రకారం ఏర్పాటు చేయాలి. ఒక్కో షాపు 150 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల లోపు ఉండాలి. పక్కా నిర్మాణంతో రోడ్డుకు అభిముఖంగా, ఒకే డోర్‌తో నిర్మించాలి. మొదటి అంతస్తులోనే షాపు ఉండాలి. ఎమ్మార్పీ ధరలను సూచించే బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. - మద్యం షాపులో సీలింగ్ ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు, ఐరన్ ర్యాక్‌లు, ఎలక్ట్రికల్ సబ్ మీటర్, దొంగ నోట్లను గుర్తించే డిటెక్టర్, సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్వేర్ ఉండాలి. - ఏడాదికి మాత్రమే షాపు అద్దె అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్ టు టైమ్ పొడిగించుకోవాలి. - ప్రతి మద్యం షాపులో అర్బన్ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉంటారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపులో ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్, ఒక వాచ్మెన్, గ్రామీణ ప్రాంతాల్లోని షాపులో సూపర్వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్, ఒక వాచ్మెన్ ఉంటారు. - షాపు సూపర్వైజర్కు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండి, మద్యం షాపు ఎక్కడ ఏర్పాటవుతుందో ఆ మండలానికి చెందినవారై ఉండాలి. విద్యార్హత డిగ్రీ. బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. షాపు సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు స్థానికులై ఉండాలి. సూపర్వైజర్కు నెలకు రూ.17,500 జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, సేల్స్‌మెన్‌కు నెలకు రూ.15 వేల జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తారు. కాంట్రాక్టు విధానంలో సిబ్బంది ఎంపిక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అర్హులైనవారు ఆన్లైన్లో ఏపీఎస్‌బీసీఎల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారికి కాంట్రాక్టు విధానంలో ఏడాది పాటు మద్యం షాపులో పనిచేసే అవకాశం ఉంటుంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను ఆయా డిపో మేనేజర్ అనుమతితో ఇస్తారు. సూపర్వైజర్ లేదా సేల్స్‌మెన్ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని రెండో ఏడాది కొనసాగించవచ్చు. రెండో ఏడాదిలో ఓ నెల రెమ్యునరేషన్‌ను బోనస్‌గా ఇస్తారు. మద్యం షాపులో రోజువారీ లావాదేవీలు, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్ సూచించే పనులను సూపర్వైజర్ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్, మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్వైజర్ సూచించే బాధ్యతలను సేల్స్‌మెన్ నిర్వహించాల్సి ఉంటుంది. మద్యం షాపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలి. మద్యం షాపులో ఏదైనా నష్టం సంభవిస్తే సిబ్బందిదే పూర్తి బాధ్యత. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు మద్యం షాపుల ఏర్పాటు, రవాణా, సిబ్బంది ఎంపికలను పర్యవేక్షిస్తాయి. -
మద్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. మద్యనిషేధం భవిష్యత్ కార్యాచరణపై కమిషనర్ మాటల్లోనే.. కలెక్టర్లు, ఎస్పీలు నిత్యం సమీక్షలు జరపాలి నవరత్నాల అమలును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నవరత్నాల్లో ఒకటైన దశలవారీ మద్యపాన నిషేధం అంశాన్ని నిత్యం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించాలి. ఇందుకు గాను ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు మా వైపు నుంచి లేఖలు రాస్తున్నాం. మద్యం లైసెన్సీలతో సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వ విధానం స్పష్టంగా చెప్పాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని మా శాఖ మంత్రి నారాయణ స్వామి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా శాఖ డీసీలు, ఏసీలు కొన్ని సమస్యలు చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల రీఆర్గనైజేషన్, నిధుల విడుదల వంటి కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు మద్యం అక్రమ అమ్మకాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులపై ఫిర్యాదులు చేసేందుకు కమీషనరేట్లో టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశాం. ప్రజలు 1800 425 4868 నెంబరుకు ఫిర్యాదులు చేయవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు మద్యపాన నియంత్రణకు సహకరించాలి. సమాచార శాఖను సంప్రదిస్తున్నాం. సినిమా హాళ్లలో మద్యపాన నియంత్రణపై ప్రచారం చేసేందుకు ఆలోచిస్తున్నాం. సినిమా హాళ్లలో స్లైడ్ల ద్వారా, గ్రామాల్లో కళాజాతల ద్వారా మద్యపాన నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. బెల్టు షాపుల్ని అరికట్టడం, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందిస్తాం. 190 నాటుసారా తయారీ గ్రామాల్ని దత్తత రాష్ట్రంలో మొత్తం 190 గ్రామాల్లో నాటుసారా తయారీ సాంప్రదాయంగా వస్తోంది. ఈ గ్రామాల్లో నాటుసారాకు బానిసైన వారున్నారు. ‘జాగృతి’ అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ గ్రామాల్ని ఎక్సైజ్ శాఖ అధికారులు దత్తత తీసుకుంటారు. నాటుసారా తయారీ నుంచి అక్కడి ప్రజలు బయటపడేలా ప్రభుత్వ శాఖల సాయంతో ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తాం. డీ–అడిక్షన్ కేంద్రాలు మద్యం దురలవాటును తగ్గించడానికి డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మద్యానికి బానిసైన వారిని ఆ కేంద్రాల్లో చేర్పిస్తాం. కేరళ, పంజాబ్లలోని కేంద్రాలను ఇప్పటికే పరిశీలించాం. అక్కడి తరహాలోనే డీ–అడిక్షన్ కేంద్రాలు నిర్వహించేందుకు ప్రణాళిక ఉంది. -
జగన్ నిర్ణయం.. మహిళలకు వరం!
విజయనగరం రూరల్ : అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్సార్సీపీ అధి నేత జగన్మోహన్రెడ్డి ప్రకటన లక్షలాది మహిళల్లో మనోధైర్యాన్ని నింపింది. 2014 ఎన్నికల్లో బెల్టు దుకాణాల నిషేధిస్తామం టూ గొప్పగా ప్రకటించి... సీఎంగా ప్రమాణ స్వీకారంనాడు తొలిసంతకం చేసినా... అమలు చేయడంలో విఫలమయ్యారు. ఆదాయమే పరమావధిగా మద్యం అమ్మకాలను మరింత విస్తృతపరచి... బెల్టు షాపులకు ఊతమిచ్చారు. పెరిగిన మద్యం దుకాణాలు 2014కు ముందు జిల్లాలో 200 మద్యం దుకాణా లు ఉంటే ప్రస్తుతం మరో పది పెరిగాయి. 2014కు ముందు కనీసం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల్లో అమ్మకాలు జరిగితే 2018 సంవత్సరం నాటికి వెయ్యి కోట్ల మార్కుకు చేరువలో అమ్మకాలు సాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రాష్ట్ర, జాతీయ రహదారులకు 220 నుంచి 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు నిర్వహించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినా... ఆదాయమే పరమావధిగా భా వించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులను జిల్లా రహదారులుగా మార్చేసి రోడ్డు పక్క మ ద్యం విక్రయాలకు ఏ ఇబ్బంది లేకుండా చేసేంది. దీంతో మద్యం సేవించి వాహనాలు నడ పడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జననేత ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం గతేడాది ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో దశలవారీ మద్యపాన నిషేధ ప్రకటన చేయడంతో ఉలిక్కిపడ్డ సీఎం 2017 జూలై 19న బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటా మని హడావుడి ప్రకటన చేశారు. ఆయన ఆదేశాలతో నెలరోజులపాటు హడావుడి చేసిన ఎక్సైజ్, పోలీస్ శాఖకు ‘ముఖ్య’నేతల అనధికార ఆదేశాలతో వాటికి జోలికి వెళ్లలేదన్న విమర్శలు మహిళల నుంచి వినిపిస్తున్నాయి. కానీ బెల్టు షాపుల దందా మాత్రం ఇంకా బాహాటంగానే కొనసాగుతోంది. ప్రభుత్వమే బాధ్యత వహించాలి 2014 ఎన్నికల్లో బెల్టు దుకాణాలు నిషేధిస్తూ తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు బెల్టు దుకాణాల నిషేధానికి తీ సుకున్న చర్యలు శూ న్యం. ప్రతీ గ్రామానికి రెండు, మూడు బెల్టు దుకాణాలున్నాయి. చిన్నచితకా కూలిపని చేసే వారు వారి రోజువారీ వేతనాన్ని మద్యానికే తగలేస్తూ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జగన్మోహన్రెడ్డి మద్యనిషేదం ప్రకటన హర్షణీయం. – బి.రమణమ్మ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సంపాదనంతా మద్యానికే అల్పాదాయ వర్గాల్లో అనేకమంది సంపాదనంతా మద్యానికే తగలేయడంతో వారి కుటుంబా లు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అందువల్ల మహిళలే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది. వారి పిల్లలు చదువును మధ్యలోనే ఆపేసి కూలీలుగా మారుతున్నారు. జగన్మోహన్రెడ్డి మద్యపాన నిషేధ ప్రకటనతో చంద్రబాబులో గుబులు రేగుతోంది. చంద్రబాబు మద్య నియంత్రణ ప్రకటన ఉత్తుత్తిదేనని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు బుద్ధి చెప్పడం ఖాయం. – పాలూరి రమణమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జగన్ ప్రకటన హర్షణీయం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి మద్య నిషేధంపై ప్రకటన చేయడం హర్షణీయం. మద్యంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల్లో మరణించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువత మద్యం సేవించి మైనర్ బాలికలు, యువతపై అత్యాచారాలకు పాల్పడటం ఆందోళనకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలు ఆగాలంటే మద్యపానాన్ని నిషేదించాలి. – ఎం.మాణిక్యం, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు -
శభాష్ నితీశ్..!
మద్యపాన నిషేధంపై బిహార్ సీఎంను ప్రశంసించిన మోదీ ► దీన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు ► పట్నాలో ఘనంగా గురుగోవింద్ 350వ ప్రకాశ్ పర్వ్ ► ఉత్సవాల నిర్వహణపై ప్రముఖుల ప్రశంసలు పట్నా: మద్యపాన నిషేధంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీన్ని విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని.. ఆయన కోరారు. పట్నాసాహిబ్ గురుద్వారాలో సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ 350వ ప్రకాశ్ పర్వ్ ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నితీశ్‌తో కలిసి మోదీ వేదిక పంచుకున్నారు. ఈ వేదికపై మద్యపానంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు విజయవంతంగా మద్యపానాన్ని అమలుచేశారని గుర్తుచేసిన నితీశ్.. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు చొరవతీసుకోవాలని కోరారు. దీనిపై మోదీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. మద్యపానంలో బిహార్ దేశానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘మద్యపానంపై ఉద్యమాన్ని ప్రారంభించినందుకు నితీశ్ కుమార్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ నితీశ్ ఒక్కరో లేక ఒక పార్టీనో దీన్ని విజయవంతం చేయలేదు. అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రజాఉద్యమంలో భాగస్వాములు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మద్యపానాన్ని అమలుచేయాలని నితీశ్ కోరిన నేపథ్యంలో ఈ విషయంలో యావత్భారతానికే బిహార్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘పాంచ్ పైరా పంత్’ ఏర్పాటుకోసం దేశాన్ని సంఘటితం చేయటంలో గురుగోవింద్ సింగ్ చేసిన ప్రయత్నం చాలా గొప్పదని మోదీ ప్రశంసించారు. ‘వివక్షకు తావులేకుండా గురుగోవింద్జీ అందరినీ ఒకేలా చూశారు. ఆయన బోధనలు నేటి తరానికి స్ఫూర్తి’ అని మోదీ అన్నారు. పట్నాసాహిబ్ గురుద్వారలో ఈ 350 ఏళ్ల ప్రకాశ్ పర్వ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చొరవతీసుకున్న నితీశ్‌ను, బిహార్ ప్రభుత్వాన్నీ అభినందించారు. ఈ కార్యక్రమం కోసం కేంద్రం రూ.100 కోట్లను ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. గతంలో నోట్ల రద్దును సమర్థించిన నితీశ్ కొన్నేళ్లుగా రాజకీయ కారణాల వల్ల ఈ ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా మారారు. 2014 ఎన్నికల సమయంలో మోదీని ఎన్డీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించటంతో కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నితీశ్ బహిరంగంగానే సమర్థించటం, దీన్ని పలుమార్లు మోదీ ప్రస్తావించటం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రకాశ్ పర్వ్‌లో ‘టార్క్’ సైతం ఈ కార్యక్రమంలో దేశ విదేశాలనుంచి పాల్గొ న్న ఆహూతుల్లో టార్క్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ చత్వాల్ పాల్గొన్నారు. ప్రకాశ్ పర్వ్‌లో పాల్గొ న్న భక్తులకు ఈ కంపెనీ 20 ట్రక్కుల టార్క్ జల్ (మినరల్ వాటర్) సరఫరా చేసింది. గుజరాత్లో సంపూర్ణంగా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ మద్యపాన నిషేధాన్ని తెచ్చారు. తొలిదశనుంచీ అక్కడ విజయవంతంగా అమలవుతోంది’ అని ప్రశంసించారు. గురు గోవింద్ సింగ్, మహాత్మా గాంధీ ప్రేరణతోనే బిహార్ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని చేపట్టిందని నితీశ్ తెలిపారు. తూర్పు చంపారన్ జిల్లాలో బ్రిటీషర్లు చేపట్టిన నీలి మందు మొక్కల పెంపకానికి వ్యతిరేకంగా మహాత్ముడు చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. ‘నా 70 ఏళ్ల ప్రజాజీవితం లో చాలా సమాగమాలు (సిక్కుల ఉత్సవాలు) చూశాను. కానీ నితీశ్ కుమార్ ప్రత్యేక ఆసక్తితో చేపట్టిన ఈ కార్యక్రమం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నేను కూడా ఇంత గొప్పగా ఎప్పుడూ నిర్వహించలేదనిపిస్తోంది’ అని నితీశ్‌ను పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రశంసించారు. -
మద్యపాన నిషేధం అమలును ప్రశ్నించరేం...?
సాక్షి, సిటీబ్యూరో: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 గురించి పదే పదే మాట్లాడే హిందుత్వ వాదులు అదే రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం మద్యపాన నిషేధం అమలు కోసం ఎందుకు నోరువిప్పరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మంగళవారం అర్థరాత్రి తాడ్‌బన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నిజంగా దమ్ముంటే ఆర్టికల్ 47 లోని అంశాల అమలుకు ప్రయత్నించాలన్నారు. మద్యపానం వల్ల వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, రహదారి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. కేంద్రం లోని మోదీ సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వివిధ అంశాలపై రాజకీయం చేస్తూ మోదీ సర్కారు తన పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గుతున్న ఇక్కడ పెట్రోల్ ధరలు మాత్రం దిగిరావడం లేదని ఆరోపించారు. కొందరు హిందుత్వ వాదులకు తన పేరు ఉచ్చరించనిదే నిద్ర పట్టడం లేదని, కేవలం పార్టీల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు తన వాఖ్యలను వక్రీకరిస్తూ అవాకులు, చవాకులు పెల్చుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కలలుకంటున్న హిందూరాజ్యం ఎప్పటికీ సా ద్యం కాదని, హిందూస్థాన్‌గానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో గట్టి ప్రతిపక్షం లేకుండా పోయిందని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హమీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా వత్తిడి తీసుకొస్తామని అసదుద్దీన్ ప్రకటించారు. దళితులతో కలిసి నడుద్దాం.. ముస్లిం-దళితుల ఐక్యత రాజ్యాధికారానికి సూచిక అని అసదుద్దీన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాబోవు తరాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. సభలో పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషాఖాద్రి మోజం ఖాన్, జాఫర్ హుస్సేన్ తదితతరులు ప్రసంగించారు. ఎన్ఐఏ రెండు నాల్కల ధోరణి మాలే గాం బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ యూ టర్న్ తీసుకోవడం పట్ల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండి పడ్డారు. బుధవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలేగాం బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ వ్యవహరిస్తున్న తీరు రెండు నాల్కల ధోరణిగా ఉందన్నారు. కేసులో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులకు క్లిన్ చిట్ ఇచ్చి తిరిగి అనుమానాలు వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ కేసులో హిందూ యువకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ముస్లిం యువకులను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
ఏప్రిల్ 1 నుంచి బిహార్‌లో మద్యనిషేధం
పట్నా: బిహార్‌లో మద్య నిషేధం అమలు చేస్తున్నట్లు గురువారమిక్కడ నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రకటించారు. 2016 ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని గత జూలైలో ఆయన హామీ ఇవ్వడం తెలిసిందే. అత్యంత పేదలు మద్యపానానికి అలవాటుపడడం వల్ల అది వారి కుటుంబాలపైన, వారి పిల్లల విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతోందని నితీశ్ అన్నారు. అంతేగాక మద్యపానం పెరిగిపోవడం కూడా మహిళలకు వ్యతిరేకంగా గృహహింసకు దారితీస్తోందని, నేరాల పెరుగుదలకు కారణమవుతోందని చెప్పారు. వచ్చేఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరకకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. -
మద్యపానాన్ని నిషేధించాలి
బీజేపీ మహిళా మోర్చా ధర్నా ఆందోళనకారుల అరెస్టు హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యపానాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి. పద్మజారెడ్డి డిమాండ్ చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీని నిరసిస్తూ శనివారం నాంపల్లిలోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పద్మజారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మద్యం పారించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుడుంబాను అడ్డుపెట్టుకుని చీప్‌లిక్కర్‌తో ప్రజల ప్రాణాలు తీయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. చీప్‌లిక్కర్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం తెలంగాణ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీప్‌లిక్కర్‌తో పేద ప్రజలు మరింత నష్టపోతారని, ఇది ప్రభుత్వానికి మంచిదికాదని హెచ్చరించారు. నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే ఉపసంహరించుకొని, రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ ధర్నాలో మహిళామోర్చా నేతలు విజయలక్ష్మీ, ఉమా రాణి, ఛాయాదేవి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బీజేపీ నేతలు చింతా సాం బమూర్తి, బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మద్యపాన నిషేధం అసాధ్యం
నిజామాబాద్ ఎంపీ కవిత సారంగాపూర్: మద్యపానాన్ని నిషేధించడం ప్రభుత్వాల బాధ్యత అయినప్పటికీ... దీనిని పూర్తిగా రూపుమాపడం సాధ్యం కావడం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో కేరళ రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించినా సంపూర్ణంగా అమలు కాలేదని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదని, దీనిని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని ప్రవేశపెట్టనుందని తెలిపారు. చీప్‌లిక్కర్ ద్వారా గుడుంబా నియంత్రణ సాధ్యం కాకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలతో తాను ఏకీభవిస్తానని కవిత పేర్కొన్నారు. -
రాష్ట్రంలో మద్య నిషేధం?
సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అధికార పగ్గాలు లక్ష్యంగా రాష్ట్రంలో మద్యనిషేధం వైపుగా అన్నాడీఎంకే సర్కారు అడుగులు వేస్తున్నట్టుంది. దశల వారీగా నిషేధం అమల్లోకి తెచ్చే రీతిలో ప్రజల్ని మెప్పించేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా త్వరలో టాస్మాక్ మద్యం దుకాణాల పని వేళలు తగ్గబోతున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో సుమారు ఏడు వేల మద్యం దుకాణాలు, ఆయా దుకాణాలకు అనుబంధంగా బార్లు ఉన్నాయి. అలాగే, స్టార్ హోటళ్లలోని బార్లకు ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తున్నది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఏడాదికి *25 వేలకోట్లు దాటింది. అదే సమయంలో ఈ మద్యం రక్కసి రూపంలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్న విమర్శలు బయలు దేరాయి. అలాగే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లతో పాటు పలు పార్టీలు సంపూర్ణ మద్యనిషేధాన్ని అందుకుని పోరుబాట సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో డిఎంకే మాత్రం ఆచీతూచి స్పందిస్తున్నది. రానున్న ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదాన్ని అందుకుంటుందా అన్న ఎదురు చూపులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా దూసుకెళ్తోన్న అన్నాడీఎంకే సర్కారు తాము సైతం అన్నట్టుగా దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న ప్రకటనను చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు తగ్గట్టుగా రాష్ర్టంలోని టాస్మాక్ మద్యం దుకాణాల పని వేళల్ని తగ్గించే కసరత్తులు ఆరంభం అయ్యాయి. తగ్గనున్న పనివేళలు : ప్రస్తుతం టాస్మాక్ మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరచి ఉంచుతున్నారు. ఈ పని వేళల్ని తగ్గించాలని ఓ వైపు అందులో పనిచేస్తున్న సిబ్బంది సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అవుతోన్నది. పని వేళల్ని తగ్గించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించినట్టుగా ఉండటంతో పాటుగా మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తామన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నది. శుక్రవారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు టాస్మాక్ దుకాణాల పని వేళల తగ్గింపుపై సమీక్షించినట్టు సమాచారం. టాస్మాక్ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతర సిబ్బందితో ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఉన్నారు. పని వేళల తగ్గింపు ద్వారా ఆదాయం ఏ మేరకు తగ్గ వచ్చు, ఆదాయాన్ని ప్రత్యామ్నాయంగా ఎలా భర్తీ చేయగలం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఉన్నారు. ఈ సమావేశం మేరకు మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి రాత్రి పది గంటల వరకు టాస్మాక్ దుకాణాల పని వేళల్ని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినానంతరం అధికార పూర్వకంగా పని వేళల తగ్గింపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు టాస్మాక్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మద్య నిషేధాన్ని కోరుతూ దేశవ్యాప్త యాత్ర
ప్రముఖ సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేష్ వెల్లడి హైదరాబాద్: మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ వ్యాప్త యాత్రను చేపడుతున్నానని, దానికి కుల, మత, పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఉన్నదని ప్రముఖ సామాజిక ఉద్యమ కర్త స్వామి అగ్నివేష్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ ‘కల్లు మానండోయ్ - కళ్లు తెరవండోయ్’ అని ఉద్యమాలు చేపడితే నేటి ప్రభుత్వాలు మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గుజరాత్లో మద్యం ఆదాయం లేకుండానే అభివృద్ధి పథంలో ఉందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, రాజస్థాన్ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. స్త్రీలపై అత్యాచారాలు.రోడ్డు ప్రమాదాలు, నేరాలతో పాటు అవినీతికి కూడా మద్యమే కారణమన్నారు. మద్యం పరిశ్రమలకు ప్రభుత్వాలిచ్చే రుణాలు నిలిపేయాలన్నారు. సిగరెట్, పొగాకు, ఇతర మత్తు మందులనూ నిషేధించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను తెలంగాణకు వచ్చినప్పుడు నేటి సీఎంతో మద్యాన్ని నిషేధించాలని కోరినప్పడు సరేనన్నారని, నేడు మాట తప్పుతున్నారని విమర్శించారు. కేసీఆర్ స్పృహలోకి వచ్చే విధంగా ఇక్కడ మద్య నిషేధ ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎక్సైజ్ పాలసీని రూపొందించాలన్నారు. పీవోడబ్ల్యూ నేత వి. సంధ్య మాట్లాడుతూ జూన్1 నుంచి వస్తున్న ప్రభుత్వ సారాయిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు మద్యంపై ప్రభుత్వం నిర్ణయం చేయకుంటే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని ఆటో వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ అమానుల్లాఖాన్ హెచ్చరించారు. సభలో సీపీఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్, అప్సా డెరైక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సంఘ నేతలు గజానని, శారద గౌడ్ పాల్గొన్నారు. -
చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేధం
రాష్ట్రమంత్రివర్గ నిర్ణయం ఫలించిన జిల్లావాసుల ఐదేళ్ల పోరాటం సాక్షి, ముంబై: చంద్రాపూర్ జిల్లా వాసుల ఐదేళ్ల పోరాటం ఫలించింది. ప్రజల కోరికను మన్నించిన ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. విదర్భ ప్రాంతంలోని గనుల జిల్లాగా పేరొందిన చంద్రాపూర్‌లో మద్యం అమ్మకం, కొనుగోలు, ఉత్పత్తి, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మహారాష్ట్రలో మద్యం నిషేధాన్ని అమలు చేయనున్న మూడో జిల్లా చంద్రాపూర్ కానుంది. తూర్పు మహారాష్ట్రలో చంద్రాపూర్‌కు పొరుగునున్న వార్ధా, గడ్చిరోలీ జిల్లాల్లో కూడా మద్య నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వ ప్రకటనతో జిల్లా వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు అభినందించుకున్నారు. ముఖ్యంగా మహిళలు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దులో ఈ మూడు జిల్లాలు ఉన్నందున అక్రమ మద్యం వ్యాపారం కొనసాగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక అధికారి అభిప్రాయపడ్డారు. మద్యం వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక న్యాయ విభాగం ఒక కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలకు సరిపోను సిబ్బందిని సమకూరుస్తామని అన్నారు. ప్రస్తుతం చంద్రాపూర్ జిల్లాలో జారీ చేసిన మద్యం పర్మిట్లన్నింటినీ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామని చెప్పారు. ఐదేళ్ల పోరాటం చంద్రాపూర్‌లో మద్యం నిషేధం అమలు చేయాలని 2010 నుంచి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సు మేరకు నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు వార్ధా జిల్లాలో కూడా సంపూర్ణ మద్యం నిషేధం అమలవుతోంది. అటు గడ్చిరోలీ జిల్లాలో 1992 నుంచే మద్య నిషేధం అమలులో ఉంది. చంద్రాపూర్‌లో మద్య నిషేధం విధించడాన్ని జిల్లా ఇన్చార్జి, ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ స్వాగతించారు. తన రాజకీయ జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయమని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే తన జిల్లా ప్రజల వాణిని వినిపించానని చెప్పారు. 2010లో అసెంబ్లీలో ప్రైవేటు సభ్యుని తీర్మానాన్ని ప్రవేశపెట్టానని తెలిపారు. జిల్లాలో ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున రూ.10వేలు మద్యంపై ఖర్చు చేస్తోందని చెప్పారు. జిల్లాలో సుమారు వెయ్యి నుంచి 1,200 కోట్ల రూపాయలు మద్యంపై వృథా అవుతున్నట్లు ఒక అంచనా అని అన్నారు. జిల్లాలో 847 గ్రామ పంచాయతీలుండగా, మద్య నిషేధం విధించాలని 588 పంచాయతీలు తీర్మానం చేశాయి. 2010లో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జిల్లాకు చెందిన ఉద్యోగినులు చీమూరు నుంచి నాగపూర్ వరకు 130 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి మద్యం నిషేధం విధించాలని డిమాండ్ చేశా రు. 22 లక్షల మంది ఉన్న జిల్లాలో రూ.600 కోట్ల మద్యం వినియోగమవుతోంది. రాష్ట్రమంతటా అమలు చేయాలి: భంగ్ మద్య నిషేధాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని సామాజిక కార్యకర్త అభయ్ భంగ్ డిమాండ్ చేశారు. గుజరాత్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉందని, అయినా అక్కడ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో మద్యంపై ఏటా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తోంది. -
ఆ ఊరిలో మద్యం నిషేధం
డోంగ్లీ గ్రామస్తుల నిర్ణయం భేష్ నిజాంసాగర్ : మద్యానికి బానిసలుగా మారుతూ, ఆనారోగ్యాల బారిన పడంతో పాటు చెడు వ్యసనాల బారిన పడుతున్న కుటుంబాలను కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎంపీపీ గోదావరిబస్వంత్ రావ్ పటేల్ అన్నారు. అ ధికారులు, ప్రజలందరి సహకరంతో మద్యాపాన నిషేధం సాధ్యమవుతుందన్నారు. మద్నూర్ మండ లం డోంగ్లి గ్రామంలో మద్యపాన నిషేధంపై గురువారం స్థానిక సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. డోంగ్లి గ్రామస్తులు మద్యపాన నిషేధం కో సం 15 రోజుల కిందట తీసుకున్న నిర్ణయం హర్షణీయంగా ఉందన్నారు. ప్రతిఒక్కరి సహకారంతో గ్రా మంలో మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని పే ర్కొన్నారు. అనంతరం బిచ్కుంద సీఐ సర్దార్‌సింగ్ మాట్లాడుతూ మద్యపానం పట్ల గ్రామస్తుల ని ర్ణయం అభినందనీయమన్నారు. మార్చి15 లోగా గ్రామంలో వందశాతం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. మద్యపానం వల్ల అనేక కు టుంబాలు నాశనం కావడంతో పాటు బతుకులు చి ధ్రమవుతున్నాయన్నారు. యువత, ప్రజలకు చెడువ్యసనాలకు బానిసలుగా మారడంతో పాటు పగలు ప్రతీకారాలకు దారితీస్తాయన్నారు. గ్రామస్తులు తీ సుకున్న నిర్ణయానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల పరంగా పూర్తిసహకారం అందిస్తామన్నారు. అంతకుముందు సర్పంచ్ మాదవి శశాంక్ పటేల్ మాట్లాడుతూ మద్యానికి డబ్బులు ఖర్చుచేస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మద్యపాన నిషేదానికి గ్రామస్తులులు ముందుకురావడంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సాయన్న, ఎస్సైలు సుదర్శన్, శ్రీకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ కల్పన గ్రామపెద్దలు దిగంబర్‌రావ్, ఆనంద్పటేల్ కళాశాల లెక్చరర్లు గంగాదర్,సన్నీ గ్రామస్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
మా ఊరు మణిపూస
సంపూర్ణ మద్య నిషేధం అమలు వివేకానందుని బోధనలే స్ఫూర్తి పేద విద్యార్థులకు చదువు డొంకాడ ఆదర్శం పచ్చదనం కనువిందు చేస్తుంది. అది కోనసీమ కాదు. మద్యపాన నిషేధం అమలవుతోంది. అది గుజరాత్ కాదు. వేసిన పంట చక్కగా పండుతుంది. ఊరిపక్కన నది లేదు. అంతేనా... ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. అంతకుమించి ఒక్క మాటపై నిలబడుతుంది. పల్లె బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసిస్తోంది. ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది.... దాని పేరు డొంకాడ. యలమంచిలి/నక్కపల్లి రూరల్ : ఇంటినే కాదు... ఊరిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని నక్కపల్లి మండలం డొంకాడ గ్రామస్తులు సగర్వంగా చెబుతారు. పచ్చదనం, పరిశుభ్రతలోనే కాదు... అయిదేళ్లుగా మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామం బాగుపడింది సరే.... మరి మీ బతుకు గురించి చెప్పండంటే... మాకేం..గతంలో ఎన్నడు లేని విధంగా వ్యవసాయం బాగుపడిందంటున్నారు గ్రామ అన్నదాతలు. గతంలో భూములన్నీ వర్షాధారమే. ఇప్పుడంతా వ్యవసాయ బోర్లతో సాగు చేస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం మూడేళ్ల క్రితం గ్రామంలో బెల్టు దుకాణాలుండేవి. తరచూ గ్రామంలో గొడవలు జరిగేవి. దీంతో యువకులంతా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని సంకల్పించారు. గ్రామ పెద్దలను సమావేశ పరచి బెల్టు దుకాణాల వేలం పాటను రద్దు చేయించారు. గ్రామంలో మద్యం విక్రయించకుండా, ఇతర ప్రాంతాలనుంచి తెచ్చుకుని సేవించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సమీప గ్రామాలైన డీజీ కొత్తూరు, సీతానగరంలో కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం విశేషం. ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి గ్రామంలో లభించే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు తరచూ మోకాళ్ల నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు. పిల్లలు అంగవైకల్యంతో పుడుతుండటంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. గ్రామస్తుల చందాలతో పాటు రామకృష్ట మఠం, విశాఖ డెయిరీ అందించిన సహకారంతో వివేకా జలం పేరుతో మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఊరంతా నందనవనం పచ్చదనంలో డొంకాడ కోనసీమను తలపిస్తోంది. గ్రామంలో కొబ్బరి, అరటి చెట్లతో పాటు రోడ్లు కిరువైపులా మొక్కలు నాటి పెంచుతున్నారు. దీంతో గ్రామమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇక్కడి విద్యార్థులు, మహిళలు, పెద్దల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. రోజూ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తుంటారు. దీంతో పాటు రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరాన్ని నిర్మించుకుని ధ్యానం చేస్తుంటారు. ఈ మందిరం వద్ద ఆహ్లాదకరమైన రీతిలో ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ బోర్లతో పంటల సాగు గతంలో వర్షాధారంపై రైతులు పంటలు పండించేవారు. వర్షాలు కురవకపోతే ఆర్థిక సమస్యలతో పాటు పశువులకు గ్రాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో విశాఖ డెయిరీ 10మంది రైతులకు వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించింది. మరో 30 మంది వరకు గ్రామస్తులు సొంతంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అన్ని రకాల కూరగాయలు, చెరకు, బొప్పాయి, అరటి, పశుగ్రాసం పెంపకంతో పచ్చగా కళకళలాడుతోంది. మండలంలోనే ఈ గ్రామం వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచింది. వివేకానందుడే స్ఫూర్తి స్వామీ వివేకానందుని స్ఫూర్తితో యువకులు గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రామకృష్ణ మఠం పీఠాధిపతి సహకారంతో విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నగదాధర ప్రకల్ప పథకం ద్వారా 1వ తరగతి నుంచి 5 వరకు చదువుకుంటున్న 120 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం దేశంలోని 106 గ్రామాల్లో అమలవుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న 4 గ్రామాల్లో డొంకాడ ఒకటి. ఇందుకోసం నెలకు రూ.35 వేలు ఖర్చు చేస్తున్నారు. రామకృష్ణ మఠం ద్వారా తుని, పాయకరావుపేటలలో చదువుకుంటున్న విద్యార్థినులకు రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. గ్రామంలో నిరుపేదలైన వృద్ధులకు సాయం చేసేందుకు యువకులంతా శ్రీ కృష్ణ అక్షయ పాత్ర పథకాన్ని రూపొందించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఒక డబ్బా ఇస్తారు. ఈ డబ్బాలో ప్రతి కుటుంబం రోజూ ఒక రూపాయి, లేదా కొంత బియ్యాన్ని దానంగా వేస్తారు. చదువుకుంటున్న విద్యార్థులు వీటిని సేకరించి నెలకు 20 పేద కుటుంబాలకు 20 కేజీల బియ్యం, కొంత నగదు అందజేసి ఆదుకుంటున్నారు. పోలీసుస్టేషన్ వరకూ వెళ్లం గతంలో మా గ్రామం విద్య, వ్యవసాయ రంగాల్లో బాగా వెనుకబడి ఉండేది. తునికి చెందిన శర్మ ద్వారా రామకృష్ణ మఠం ఏర్పాటు చేశాం. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకుల్లో చైతన్యం వచ్చింది. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించాం. గ్రామంలో ఉత్సాహంగా ఉన్న 21 మందితో కమిటీ వేశాం. ఏ చిన్న తగాదా వచ్చినా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించుకుంటున్నాం. - చందిన వెంకటరమణ, డొంకాడ మద్య నిషేధంతో మార్పు గతంలో గ్రామంలో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించడం వల్ల మగవారంతా మద్యం సేవించేవారు. వ్యవసాయం, కూలి పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు పడేవాళ్లం. గ్రామంలో మద్య నిషేధం విధించడంతో ఎంతో హాయిగా ఉంది. - అర్లంక అమ్మాజీ, డొంకాడ విద్యాభివృద్ధికి ప్రోత్సాహం గ్రామంలో విద్య వికాసానికి చర్యలు చేపట్టాం. చదువుకుంటున్న విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. మంచి చదువులు చదివిన సుమారు 20 మంది వరకు ఉపాధ్యాయులుగా, రైల్వే శాఖలో స్థిరపడ్డారు. - రాజు, గ్రామస్తుడు, డొంకాడ వ్యవసాయంలో మా గ్రామం ఆదర్శం నాకు పొలం ఉన్నా నీరు లేక ఇబ్బం దులు పడేవాడిని. ప్రస్తుతం వ్యవసాయ బోరు వేయించడంతో మామి డి, కూరగాయలు, పండ్ల తోటలు, పశుగ్రాసం పెంచుతున్నాను. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తున్నా యి. - ప్రగడ శివ, రైతు, డొంకాడ -
మందు.. బాబును మరిచినారా..?
ఎలక్షన్ సెల్: మద్యలక్ష్మి స్వాగతానికి వాడిన ‘మంగళ’వాద్యాలను.. రాజగురువుతో కలిసి పాడిన ‘సీసా’పద్యాలను.. అన్నకే కాదు.. ఆశయానికీ పొడిచిన వెన్నుపోటును.. మరిచినారా..? కన్నీటి కాసారాలైన సంసారాలను.. కూలిపోయిన కుటుంబాలను.. ఛిద్రమైన జీవితాలను.. శిథిలమైన బతుకులను.. మరిచినారా..? చేతకాకే ఎత్తేశామన్న చేవలేని మాటలను.. బాధతో తీసుకున్న నిర్ణయమంటూ మభ్యపెట్టే ప్రకటనలను.. అక్రమార్కులకు కళ్లెం వేయడం కోసమన్న కపటనాటకాన్ని.. మంది కోసమే మందు అన్న మార్గదర్శి మాటలను.. రాష్ట్రాన్ని ‘మద్య’ప్రదేశ్‌గా మార్చిన మందు‘బాబుల’ను.. మరిచినారా..? లిక్కర్‌తో చేసిన చీప్ ట్రిక్కులను.. బార్లా తెరుచుకున్న బార్లను.. గేట్లు తెంపుకొన్న సారాకొట్లను.. వళ్లు గుల్ల చేసిన కల్తీకల్లు అంగళ్లను.. ఇల్లు కొల్లగొట్టిన గొలుసు దుకాణాలను.. అడ్డగోలు అమ్మకాలకు పెట్టిన టార్గెట్లను.. మరిచినారా..? బాటిళ్లు వదిలి ఇంటింటికి చేరిన సారా భూతాలను.. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టిన ‘పచ్చ’ప్యాకెట్లను.. తడి, పొడి వ్యాపారాల తెలుగుతమ్ముళ్లను.. నడమంత్రపు సిరితో నెత్తినెక్కిన ‘నిషా’చరులను.. ఖజానాను కొల్లగొట్టిన దేశం కా‘మందు’లను.. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకున్న మద్యం మాఫియాను.. బడుగు బతుకుల్లో పెట్టిన ‘మందు’ పాతరను..మరిచినారా..? పేదింటి కాపురాలు నిలువునా కూల్చి.. ప్రభుత్వ ఖజానా నింపుకోవాలా? రాష్ట్రాన్ని నిషా మైకంలో ముంచి.. వ్యసన మహాభూతాన్ని ఊరూరా వదిలిపెట్టి.. జేబులు కొల్లగొట్టడం మినహా మద్యానికి మరో విధానమంటూ లేకుండా చేసి.. నిరుపేదల నట్టిళ్లలో బాటిళ్లతో నిప్పు రగిలించి.. కుటుంబాలను సర్వనాశనం చేసిన ఈ పాపం ఎవరిది? ‘నారా’సురుడు రాజేసింది కాదా.. ఈ మద్య మహా దావానలం? అయినా... మహాపాపం చేసి మరెవరి మీదో ఎందుకు నెపం? నిషేధానికి తూట్లు పొడిచిన బాబు గ్రామంలో సారాయి అమ్మకాలు జరపకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాం. మా ఉద్యమ స్ఫూర్తితో ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్టు దుకాణాలను ప్రోత్సహించారు. - గణేశం రవణమ్మ, తూర్పు దూబగుంట (నెల్లూరు జిల్లా) ఏరులై పారిన సారా చంద్రబాబు పాలనలో గ్రామాలు ఎడారులుగా మారాయి. సారా ఏరులై పారడంతో అనేకమంది రోగాల బారిన పడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సారా తయారీ తగ్గింది. సకాలంలో వర్షాలు కురవడంతో వారంతా వ్యవసాయ పనులు చేసుకున్నారు. - పూరేటి వెంకటరత్నం, చినకంచర్ల (గుంటూరు జిల్లా) తాగుబోతులను తయారు చేసిందే..బాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మద్యనిషేధానికి తూట్లు పొడిచాడు. చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడమే గాక.. పల్లెల్లో వైన్స్‌లకు అనుమతులు ఇచ్చి.. ప్రజలను తాగుబోతులుగా తయారు చేశాడు. - వేనేపల్లి పాండురంగారావు, మట్టిమనుషుల వేదిక కన్వీనర్, మిర్యాలగూడ (నల్లగొండ జిల్లా) మద్యాన్ని ఏరులై పారించాడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం అనేది లేకుండె...అప్పట్లో దొంగచాటున అమ్మేవారిని కూడా రామారావు ప్రభుత్వం అరికట్టింది. రామారావు మరణించిన తరువాత చంద్రబాబు పాలనలో మద్యాన్ని ఏరులై పారించాడు. ఆయన హయాంలో రాష్ర్ట పాలన భ్రష్టుపట్టింది. - మల్లయ్య , ద్వారకా నగర్, నిజామాబాద్ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన మద్యపాన నిషేధానికి బాబు తూట్లు పొడిచారు. దీంతో వేలాది కుటుంబాలు వీధినపడ్డాయి. గ్రావూల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించాడు. అధికారంలోకి వస్తే మద్యంపై ఆంక్షలు విధిస్తామని బాబు చెబుతున్న మాటలు నమ్మటానికి వీల్లేదు. - మందడి సులోచన, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా సెక్రటరీ, (నల్లగొండ జిల్లా) బాబు ఊరికో బెల్టుషాపు తెరిపించారు ఎన్టీఆర్ హయాంలో మేం పోరాడి సాధించుకున్న మద్య నిషేధానికి చంద్రబాబు ఒక్కసారిగా తూట్లు పొడిచారు. గ్రామానికో బెల్టుషాపు తెరిపించారు. అప్పట్నుంచి పల్లెల్లో ప్రశాంతత కరువైంది. శాంతభద్రతలు అదుపు తప్పాయి. - చల్ల శాంతకుమారి, బాపూజీ మహిళా ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, బాడంగి (విజయనగరం జిల్లా) ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నా... చంద్రబాబు హయాంలో ఊరూరా బెల్టుషాపులు పెట్టారు. మగవారు తమ కూలి డబ్బుల్లో మూడొంతులు మద్యానికే తగలబెట్టేవారు. మద్యం కారణంగా మా పల్లెలోని చాలా కుటుం బాల్లో వెలుగులు ఆరిపోయాయి. నా ఇద్దరు కుమారులు కూడా మద్యం మహ మ్మారికి బలైపోవడంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. - అచ్చమ్మ, దర్శి (ప్రకాశం జిల్లా) బాబు పాపమే నాకు శాపం నా భర్త పేరు వసంతప్ప. ఇద్దరు ఆడబిడ్డలు. ఇద్దరం కూలి చేసి పిల్లలను పెంచుకునేవాళ్లం. మా ఆయన తాగుడుకు అలవాటు పడ్డాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు సారా అంగళ్లన్నీ మూయించేస్తే నాకు చాలా సంతోషమైంది. చంద్రబాబు వచ్చాక మళ్లీ తెరిచారు. మా ఆయన కూలీ డబ్బులన్నీ తాగుడుకే పెట్టేవాడు. చివరికి దానికే బలయ్యాడు. ఆడపిల్లలను ఎలా పెంచాలో అర్థం కాలేదు. చివరికి పాచి పనిచేసి వారికి పెళ్లిళ్లు చేశా. చంద్రబాబు చేసిన పాపమే నాకు శాపమైంది. - తాయమ్మ, ఆలూరు(కర్నూలు జిల్లా) చంద్రబాబు తమ్ముడిపైనే సారా కేసుంది చంద్రబాబు హయాంలో ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సారా వ్యాపారం చేస్తున్నాడని కేసు నమోదైంది. బాబు ఊళ్లోనే సారా వ్యాపారం జరుగుతోందని రైడ్ చేయించారు. మద్యం ముసుగులో కోట్లు దండుకున్నది బాబే. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా నిషేధాన్ని తొలగించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేశాడు. బాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. - సుబ్రమణ్యం యాదవ్, మాజీ సర్పంచ్, రెడ్డి వారిపల్లె(చిత్తూరు జిల్లా)