నిజాంసాగర్: సంక్షేమ పథకాల అమలులో అక్రమాలపై విచార ణ చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల వద్ద ఉన్న ‘తెల్లరేషన్ కార్డుల’ ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా సక్రమంగా అందాలన్న సంకల్పంతో రేషన్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసం ధానం చేసుకోవాలని సూచించింది.
ఫలితంగా ఒక కుటుంబానికి రెండు చొప్పున ఉన్న రేషన్‌కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్న కార్డుల ఏరివేతకు అవకాశం లభించింది. గత ప్రభుత్వం మూడవ విడత రచ్చబండ కార్యక్రమం ద్వారా పంపిణీ చేసిన రేషన్ కూపన్‌లపైనా అధికారులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యుల ఫొటోల ఆధారంగా పరిశీలన ప్రారంభించారు. ఆధార్ నంబర్లను నమో దు చేసుకోని కూపన్‌దారులకు రేషన్ సరుకులను నిలిపివేశారు.
సరుకుల పంపిణీలో జాప్యం
జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు, 718 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు 6.5 లక్షల కుటుంబాలకు ప్రభుత్వంసరుకులను రాయితీపై అందిస్తోంది. ఇందుకోసం జిల్లాకు 10,700 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తోంది. డీలర్లు నెలనెలా డీడీలు కట్టి సరుకులను తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గత నెల యథావిధిగా రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టినా జిల్లాకు మాత్రం కోటాను కేటాయించలేదు. దీంతో సెప్టెం బర్ నెల సరుకుల పంపిణీ ఆలస్యమవుతోంది. లబ్ధిదారులు దుకాణాల చుట్టు చక్కర్లు కొడుతున్నారు.
అయోమయంలో ‘రచ్చబండ’ కూపన్‌దారులు
గత ప్రభుత్వం నిర్వహించిన మూడో విడత రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు పొందిన లబ్ధిదారులు తమకు సరుకులు వస్తాయోలేదోనని ఆయోమయంలో పడిపోయారు. అప్పటికే తెల్ల రేషన్‌కార్డులలో పేర్లు ఉండి, కొత్తగా రేషన్ కూపన్లు పొందిన కుటుంబాలను గుర్తించేందుకు అధికారు లు యత్నిస్తున్నారు. దీంతో సరుకుల పంపిణీ ఆలస్యమవుతోందని సమాచారం. కూపన్ల ద్వారా రేషన్‌సరుకులు పొం దుతున్నవారు ఆధార్ నంబర్‌ను నమోదు చేయించకపోవడంతో ప్రభుత్వం కూపన్లకు సరుకులను నిలిపి వేసిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు.
60 వేల కుటుంబాల సంగతి అంతేనా!
జిల్లావ్యాప్తంగా 60 వేల కుటుంబాలకు రేషన్ కూపన్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు కుటుంబాల ఫొటో, ఆధార్ నంబర్లను డీలర్లు, రెవెన్యూ అధికారులకు అందించలేదు. దీంతో వీరికి సరుకులు అందే అవకాశం లేదు. బోగస్‌కార్డులు కలిగినవారితోపాటు, ఉద్యోగాలు ఉన్నవారికి సర్కారు సరుకులను నిలిపివేస్తోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసమే సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటాను ప్రభుత్వం జిల్లా, మండలాలు, గ్రామాలవారీగా కేటాయించలేదు. అందుకే సరుకుల పంపిణీ ఆలస్యం కానుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నెల 5 లోగా నమోదు చేసుకోవాలి
మూడవ విడత రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు పొందినవారు కుటుంబాల ఫొటోలు, ఆధార్ నంబర్లను ఈ నెల ఐదులోగా కంప్యూటర్లలో నమోదు చేయించుకోవాలి. రేషన్ కార్డులలో పేర్లు ఉండి కూపన్లు పొందినవారిని ఏరి వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. - కొండల్‌రావు, డీఎస్‌ఓ
ప‘రేషన్’
Published Fri, Sep 5 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement