
మాధవి (ఫైల్)
సాక్షి, డోన్ టౌన్: మండలంలోని చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన మాధవి అనే నవ వధువు అదృశ్యమైనట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్ మంగళవారం తెలిపారు. ఈనెల 10వ తేదీన మాధవికి అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లె గ్రామానికి చెందిన కొత్తరాయుడితో వివాహమైంది. తిరిగింపు, మరిగింపుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన నూతన దంపతులు చిన్నమల్కాపురానికి చేరుకున్నారు.
అదే రోజు భర్తకు అన్నం వడ్డించి పక్కనే ఉన్న అంగడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మాధవి తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువుల ఊళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఆమె భర్త కొత్తరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment