పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం మండలకేంద్రంలోని నెహ్రూ కాలనీలో నివాసముంటున్న రాయల సరస్వతీ(23) అనే నవ వధువు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కళ్లు తిరిగి పడిపోయి చనిపోయిందని అత్తింటి వారు చెప్పడంతో అనుమానం వచ్చి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరస్వతికి గత ఏడాది నవంబర్‌లో సంతోష్ అనే యువకుడితో వివాహమయింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.