
సాక్షి, రంగారెడ్డి: ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదంండ్రులకు సందేశం పంపిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాంకాలనీకి చెందిన తాడాల శ్రీనివాస్‌రావు కుమార్తె ప్రత్యూష(24) మెడిసిన్ కోర్సు చదివి రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటుంది.
ఈనెల 18న ఉదయం 10గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ కాలేజీలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లిన ప్రత్యూష 19వ తేదీన ఉదయం 8గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో మెసేజి పెట్టింది. ఆందోళనకు గురైన తల్లి గంగాభవానీ పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.