సాక్షి, జవహర్‌నగర్: యువతి అదృశ్యమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డ జైజవాన్ కాలనీలో నివసించే లాజరు పెద్ద కుమార్తె బూలగ్రేస్ (20) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీనగర్‌లో నివసించే మహేశ్వరి (20), రెండు నెలలుగా రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో పని చేస్తోంది. ఎప్పటిలాగే విధులకు వెళ్లిన మహేశ్వరి రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డ్యూటీకి వెళ్లి..
బంజారాహిల్స్: విధులకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10, శ్రీరాంనగర్‌లో నివసించే బి. లోకేష్ స్టార్ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి రెండ్రోజులైనా ఇంటికి రాకపోవడంతో సోదరుడు కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment